
అందానికి మరో పేరు ఉంటే అది తమన్నానే అవుతుంది. అంతగా తన అందాలతో ఉత్తరాది, దక్షిణాది అన్న భేదం లేకుండా యావత్ సినీ ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అవకాశాలు కాస్త తగ్గినా, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆమ్మడు ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం బల్లీ బౌన్సర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 23వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.
ప్రముఖ దర్శకుడు మదూర్ భండార్కర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, జంగిల్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. కాగా గీత రచయిత డాక్టర్ కృతిక రాసిన వసమాన అనే పాటను గాయకుడు రోషన్ శబాస్టియన్ పాడారు. కాగా ఈ పాటను శనివారం విడుదల చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందనే సంతాషాన్ని వ్యక్తం చేశారు.
కాగా ఇందులో నటుడు సౌరబ్ శుఖియా, అభిషేక్ బజాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. డ్రామా, కామెడీ, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రం విడుదల కోసం నటి తమన్నా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కారణం లేడీ బౌన్సర్ పాత్రలో తొలిసారిగా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించ డమే. అయితే పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హింది భాషల్లో థియే టర్లో కాకుండా డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవ్వడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment