న్యూఢిల్లీ: వాల్ట్ డిస్నీ భారత వ్యాపార విభాగ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా విభాగం కార్యకలాపాలను విలీనం చేసేందుకు ఇరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
విలీన సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన మీడియా విభాగం, ఇతర అనుబంధ సంస్థలకు 61 శాతం వాటా ఉంటుందని, మిగతా వాటాలు డిస్నీకి ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ వారం వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
టాటా ప్లే సంస్థలో డిస్నీకి ఉన్న మైనారిటీ వాటాలను కూడా రిలయన్స్ కొనుగోలు చేయొచ్చని వివరించాయి. సంక్లిష్టంగా మారిన తమ భారత విభాగాన్ని వీలైతే పూర్తిగా విక్రయించేందుకు లేదా ఇతర సంస్థలతో జట్టు కట్టి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు గతేడాది నుంచి డిస్నీ కసరత్తు చేస్తోంది. డిస్నీ, రిలయన్స్ ఒప్పందం?
Comments
Please login to add a commentAdd a comment