Janhvi Kapoor Good Luck Jerry Movie Direct Release In OTT - Sakshi

Janhvi Kapoor: నేరుగా ఓటీటీలోకి జాన్వీ కపూర్‌ 'గుడ్‌ లక్‌ జెర్రీ'..

Jun 17 2022 5:45 PM | Updated on Jul 26 2022 10:50 AM

Janhvi Kapoor Good Luck Jerry Direct Release In OTT - Sakshi

దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ మొదటి సినిమా 'ధడక్‌'తోనే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తన నటనతో, అందచందాలతో కోట్లాదిమంది మనసులు కొల్లగొట్టింది. అంతేకాకుండా యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా జాన్వీ కపూర్‌ నటించిన చిత్రం 'గుడ్‌ లక్‌ జెర్రీ'. లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార నటించిన 'కోలమావు కోకిల' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది ఈ మూవీ.

అందాల తార, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ మొదటి సినిమా 'ధడక్‌'తోనే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తన నటనతో, అందచందాలతో కోట్లాదిమంది మనసులు కొల్లగొట్టింది. అంతేకాకుండా యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా జాన్వీ కపూర్‌ నటించిన చిత్రం 'గుడ్‌ లక్‌ జెర్రీ'. లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార నటించిన 'కోలమావు కోకిల' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది ఈ మూవీ. 'కోకోకోకిల' అనే టైటిల్‌తో తెలుగులోనూ డబ్‌ అయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది జాన్వీ. 

'గుడ్ లక్‌ జెర్రీ' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఒక పోస్టర్‌లో తుపాకీ పట్టుకుని, మరో దాంట్లో భయంతో లంచ్‌ బాక్స్‌ టేబుల్‌ వెనుక దాక్కున్న జాన్వీ కపూర్‌ను మనం చూడొచ్చు. ఈ మూవీ నేరుగా ప్రమఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో జూలై 29 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాను పూర్తిగా పంజాబ్‌లో చిత్రీకరించారు. ఈ సినిమాకు బాలీవుడ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ సేన్‌ గుప్త దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రంలో దీపక్‌ డోబ్రియాల్‌, మితా వశిష్ట్‌, నీరజ్ సూద్‌, సుశాంత్‌ సింగ్‌ నటించారు. 'గుడ్‌ లక్‌ జెర్రీ'ని సన్‌డియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్నాయి. 

చదవండి: సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్‌..
డేటింగ్‌ సైట్‌లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు
కాలేజ్‌లో డ్యాన్స్‌ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement