![Did Kajol Taking 5 Crore Remuneration For A Episode - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/12/kajol_0.jpg.webp?itok=cQI4QXtG)
Did Kajol Taking 5 Crore Remuneration: అందంతో పాటు అభినయంతో అభిమానుల మనసును కొల్లగొట్టింది బాలీవుడ్ దివా కాజోల్. 90 దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన కాజోల్ హిందీ చిత్రపరిశ్రమను ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ 47 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు అందంలో పోటీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో వివాహం తర్వాత సైతం అడపాదడపా సినిమాలు చేస్తూనే ఆకట్టుకుంటూనే ఉంది. అయితే ఇప్పటికే వెండితెరపై మెరిసిన స్టార్ హీరోయిన్లందరూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలో కాజోల్ కూడా చేరిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అందిస్తోన్న ఓ థ్రిల్లర్ షోతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టనుంది. కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఉన్న ఈ షో సోమవారం (జులై 11) ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ఓ వార్త బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ షోలో ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్ల పారితోషికాన్ని తీసుకోనుందట కాజోల్. ఈ విషయంపై బాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ థ్రిల్లర్ షోకు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా కాజోల్ ప్రస్తుతం నటి రేవతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న 'సలామ్ వెంకీ' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
చదవండి: ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా..
అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య
ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment