Disney Plus Hotstar Bringing Mahabharat Series In Association With Allu Entertainments - Sakshi
Sakshi News home page

Mahabharat Series: ఓటీటీ చరిత్రలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ‘మహాభారత్‌’..

Published Sat, Sep 10 2022 8:37 PM | Last Updated on Sat, Sep 10 2022 8:58 PM

Disney Plus Hotstar bringing Mahabharat Series In Association With Allu Entertainments - Sakshi

మహాభారతం నిజంగా ఒక మహాగ్రంథం. అది చదవడం మొదలు ఎన్నటికీ పూర్తికానంతగా రచన జరిగింది. లెక్కలేనన్ని పాత్రలు, పాత్రధారులు మనకు కనిపిస్తారు. ప్రతి ఒక్క పాత్రకు దానికంటూ ఒక విశిష్టత ఉంటుంది. వేదవ్యాస మహర్షి రచించిన ఈ గ్రంధాన్ని తెరకెక్కించాలని ఎన్నో నిర్మాణ సంస్థలు, దర్శకులు సన్నాహాలు చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కూడా ఇదే. అయితే ఇది సినిమా కంటే ముందు వెబ్‌ సిరీస్‌ రూపంలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియన్  ఓటీటీ స్పేస్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ‘మహాభారత్‌’ రాబోతుంది. అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. ‘గ్రేటెస్ట్ ఇతిహాసం- మునుపెన్నడూ చూడని స్థాయిలో తిరిగి చెప్పబడుతుంది. ఒక అద్భుతమైన దృశ్యం కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్‌లో 'మహాభారత్' రాబోతుంది’ అని అడిస్నీ+ హాట్‌స్టార్ సంస్థ ట్వీట్‌ చేసింది. 

అల్లు ఫ్యామిలీ ఇటీవలే అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను ప్రారంభించింది. ఇప్పటికే వారు మెగా బడ్జెట్ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ సిరీస్‌కు  సహ నిర్మాతలుగా కనిపిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement