Top 5 Best Movies On Disney Plus Hotstar: Must-Watch List April 2022 - Sakshi
Sakshi News home page

Best Movies On Disney Plus Hotstar: ఓటీటీలో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమాలు.. ఈ వీకెండ్‌కు మంచి టైంపాస్‌

Apr 23 2022 6:01 PM | Updated on Apr 23 2022 10:25 PM

Top 5 Best Movies On Disney Plus Hotstar For April 2022 - Sakshi

ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లు ప్రారంభమైన వెబ్‌ సిరీస్‌లు, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఉన్న సినిమాల కోసం ఓటీటీల బాట పడుతున్నారు సినీ ప్రియులు.

Top 5 Best Movies On Disney Plus Hotstar For April 2022: ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లు ప్రారంభమైన వెబ్‌ సిరీస్‌లు, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఉన్న సినిమాల కోసం ఓటీటీల బాట పడుతున్నారు సినీ ప్రియులు. పెద్ద సినిమాలను అటు థియేటర్లలో వీక్షిస్తూ.. మరోవైపు ఓటీటీలో వచ్చే చిత్రాలపై కూడా ఓ కన్ను వేస్తున్నారు. ఓటీటీలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా కొత్త కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. అలాంటి ఓటీటీల్లో ఒకటి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధిస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలై డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లతో దూసుకుపోతున్న టాప్ 5 చిత్రాలపై ఓ లుక్కేద్దామా.! డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రాలను చూసి ఈ వీకెండ్‌ ఎంజాయ్ చేయండి.


1. భీష్మ పర్వం
అమల్‌ నీరద్ దర్శకత్వం వహించిన మలయాళ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం భీష్మ పర్వం. ఈ మూవీలో ప్రముఖ సీనియర్‌ నటుడు మమ్ముట్టి నటించారు. సముద్రపు ఎగుమతిదారునిగా మారిన గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నటించి మెప్పించాడు మమ్ముట్టి. ఓ గ్యాంగ్‌స్టర్‌కు ఎదురయ్యే చావు బెదిరింపుల చుట్టూ తిరిగుతుంది ఈ మూవీ కథ. మార్చి 3, 2022న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. 

చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్‌ ఇచ్చిన 10 బెస్ట్‌ తెలుగు వెబ్‌ సిరీస్‌లు..

2. తానక్కరన్‌ (పోలీసోడు)
విక్రమ్‌ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన తమిళ పోలీసు డ్రామా చిత్రం 'తానక్కరన్‌'. తెలుగులో 'పోలీసోడు' అనే టైటిల్‌తో నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. 1997లో జరిగిన పోలీసు శిక్షణకు సంబంధించిన నిజ జీవితపు సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి తమిజా దర్శకత్వం వహించగా.. జిబ్రాన్ స్వరాలు సమకూర్చారు. 

3. ప్రవీణ్‌ తాంబే ఎవరు ?
శ్రేయాస్‌ తల్పాడే ప్రధాన పాత్ర పోషించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ప్రవీణ్ తాంబే ఎవరు?. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రవీణ్ తాంబే జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ. జయప్రద్‌ దేశాయి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్‌ 1, 2022న నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. 

4. డెత్‌ ఆన్‌ ది నైలు
ఈ సినిమా ప్రసిద్ధ రచయిత్రి అగాథా క్రిస్టీ రాసిన 'డెత్‌ ఆన్‌ ది నైలు' నవల ఆధారంగా తెరకెక్కించారు. వండర్‌ వుమెన్‌ గాల్ గాడోట్, బాలీవుడ్‌ యాక్టర్‌ అలీ ఫాజల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కెన్నెత్‌ బ్రానాగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 11, 2022న యూకే, యూఎస్‌ఏలలో విడుదలైంది. ఓ హత్యకు సంబంధించిన దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుంది. 

5. ది కింగ్స్‌మన్‌
కింగ్స్‌మన్ సిరీస్‌లో మూడో చిత్రంగా వచ్చింది ఈ మూవీ. రాల్ఫ్‌ ఫియెన్నెస్‌, గెమ్మ ఆర్టెర్టన్‌, రైస్ ఇఫాన్స్, టామ్‌ హోలాండర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నిటించారు. మాథ్యూ వాన్‌ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మొదటి ప్రపంచ యుద్దం, కింగ్స్‌మన్‌ సంస్థ మూలానికి సంబంధించిన సంఘటనల చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. కరోనా కారణంగా అనేక వాయిదాల తర్వాత డిసెంబర్‌ 22, 2021న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 



చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు..

సూపర్ థ్రిల్‌ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్‌ ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement