రాజమండ్రిలో మిస్టర్ & మిసెస్ 'సి' | Ram Charan, Upasana Marriage Anniversary | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో మిస్టర్ & మిసెస్ 'సి'

Published Wed, Jun 14 2017 3:27 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

రాజమండ్రిలో మిస్టర్ & మిసెస్ 'సి'

రాజమండ్రిలో మిస్టర్ & మిసెస్ 'సి'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెళ్లి రోజును రంగస్థలంలో షూటింగ్ లోకేషన్ లోనే జరుపుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. 1985 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీ పల్లెటూరి యువకుడిగా నటిస్తున్నాడు. షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్న చరణ్ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు.

అందుకే పెళ్లి రోజుకు బ్రేక్ తీసుకోలేదు. అయితే ఈ స్పెషల్ డేను తన భర్తతో కలిసి గడిపేందుకు ఉపాసన రాజమండ్రికి వెళ్లింది. ఈ సందర్భంగా ' 'మిస్టర్ అండ్ మిసెస్ సి'కి ఐదేళ్లు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సపోర్ట్, ప్రేమ కారణంగా ఇన్ని రోజులు ఇంత అద్భుతంగా గడిచాయి.' అంటూ తమ శ్రేయోభిలాషులకు కృతజ్ఙతలు తెలియజేసింది ఉపాసన.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement