సూపర్‌స్టార్ మహేష్‌బాబు, నమ్రత శిరోద్కర్ దాంపత్య జీవితానికి నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్యూట్ కపుల్ బుధవారం 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పెళ్లి రోజు సందర్భంగా నమ్రతకు విషెస్ చెబుతూ భార్యపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు మహేష్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్ పోస్టు పెట్టారు. నమ్రతకు ప్రేమతో నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేస్తూ. ‘16 ఏళ్ల ప్రేమకు శుభాకాంక్షలు మై లవ్.. జీవితాంతం నీతో కలిసి ఉంటాను’ అంటూ పేర్కొన్నారు.
చదవండి: స్నేహితుడికి అండగా మహేష్.. ట్రైలర్ రిలీజ్
నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత..
అచ్చం ఇలాగే నమ్రత కూడా మహేష్ బుగ్గలపై కిస్ చేస్తున్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘16 ఏళ్లు త్వరగా గడిచిపోయాయి. ఇన్నేళ్ల జీవితంలో అమితపైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలగలిసి ఉన్నాయి. పెళ్లి రోజు శుభాకాంక్షలు మహేష్.. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను’. అని భర్తపై ప్రేమను కురిపించారు.
కాగా వంశీ సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు.. ఆ సమయంలోనే ప్రేమలో పడి 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.. కొడుకు గౌతమ్, కూతురు సితార ఉన్నారు. ఇక ప్రస్తుతం మహేష్ తన కుటుంబంతో కలిసి దుబాయిలో ఉన్నాడు. అక్కడ సర్కారు వారి పాట షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment