భార్యకు స్పెషల్‌గా విష్ చేసిన రంగం హీరో.. పోస్ట్ వైరల్! | Kollywood Hero Jiiva Special Wishes On Her Marriage Anniversery | Sakshi
Sakshi News home page

Jiiva: భార్యకు స్పెషల్‌గా విష్ చేసిన రంగం హీరో.. సోషల్ మీడియాలో వైరల్!

Published Tue, Nov 21 2023 6:34 PM | Last Updated on Tue, Nov 21 2023 6:48 PM

Kollywood Hero Jiiva Special Wishes On Her Marriage Anniversery - Sakshi

రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు జీవా.  ఆసాయ్ ఆసాయి అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇ‍చ్చారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించారు. 2011లో వచ్చిన రంగం సినిమాతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌తో గుర్తింపు దక్కించుకున్నారు. 1983 ప్రపంచకప్‌ నేపథ్యంలో తెరకెక్కించి మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో మెరిశారు. ప్రస్తుతం మహీ వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న యాత్ర-2 చిత్రంలో నటిస్తున్నారు. ఇవాళ తన వివాహా వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేశారు. తన భార్యకు విషెస్ చెబుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఫోటోలు పంచుకున్నారు. కాగా.. 2007లో సుప్రియను ఆయన పెళ్లి చేసుకున్నారు.  

(ఇది చదవండి: 'యాత్ర 2' సినిమా... చంద్రబాబు పాత్రలో ఆ విలన్!)

కాగా.. ప్రస్తుతం ఆంధ‍్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'యాత్ర- 2'. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై వచ్చిన 'యాత్ర' చిత్రానికి ఇది సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ చిత్రానికి మహీ వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. జగన్ పాత్రలో తమిళ హీరో జీవా, వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement