Dil Raju Daughter Hanshitha Reddy Vacation Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Hanshitha Reddy: వెకేషన్‌లో దిల్ రాజు కుమార్తె.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!

Published Thu, May 4 2023 2:06 PM | Last Updated on Thu, May 4 2023 2:42 PM

Dil Raju Daughter Hanshitha Reddy Vacation Pics Goes Viral - Sakshi

టాలీవుడ్‌ నిర్మాతల్లో దిల్‌ రాజు గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉంటారు. టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నిలబడే వారిలో దిల్ రాజు ముందు వరుసలో ఉంటారు. ఇటీవల ఆయన నిర్మించిన శాకుంతలం మూవీ పెద్ద షాకిచ్చిందని వెల్లడించారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. 

(ఇది చదవండి: ఆ సినిమా నాకు పెద్ద ఝలక్ ఇచ్చింది: దిల్ రాజు)

వేకేషన్‌లో దిల్ రాజు డాటర్

అయితే దిల్‌ రాజు కూతురు హన్షిత రెడ్డిని కూడా నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇటీవలే సూపర్‌ హిట్‌గా నిలిచిన బలగం సినిమాకు దిల్ రాజు కుమార్తె నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా దిల్ రాజు కూతురు వేకేషన్‌ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 2014లో మే 4 వ తేదీన అర్చిత్ రెడ్డిని విహహం చేసుకుంది. ఇవాళ హన్షిత పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి వేకేషన్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం  ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: శరత్‌బాబుకు సంతాపం తెలిపిన కమల్‌హాసన్‌.. కాసేపటికే ట్వీట్‌ డిలీట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement