అక్కడి అందాల పోటీల్లోనూ...! | Seven Indian-Origin Women in US Pageants | Sakshi
Sakshi News home page

అక్కడి అందాల పోటీల్లోనూ...!

Published Mon, Oct 19 2015 6:20 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Seven Indian-Origin Women in US Pageants

న్యూఢిల్లీ: అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అన్ని రంగాల్లో ముందున్నారు. అదేవిధంగా అందాల పోటీల్లోనూ భారత సంతతి అమ్మాయిలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా న్యూజెర్సీలో నిర్వహిస్తున్న రెండు వార్షిక అందాల పోటీల్లో ఏడుగురు భారత సంతతి సుందరీమణులు పోటీ పడుతున్నారు. న్యూజెర్సీ రాష్ట్రం ప్రతి ఏడాది 'మిస్ న్యూజెర్సీ యూఎస్ఏ', 'మిస్ న్యూజెర్సీ టీన్ యూఎస్ఏ' పోటీలను నిర్వహిస్తున్నది. ఇందులో 'మిస్ న్యూజెర్సీ యూఎస్ఏ' పోటీలలో ఆరుగరు భారత సంతతి అమ్మాయిలు పోటీపడుతుండగా.. 'మిస్ న్యూజెర్సీ టీన్ యూఎస్ఏ' పోటీలో ఒకరు పోటీపడుతున్నారు.

వనితా బుధాన్ (22), నికోల్ పటేల్ (23), నిహారా చక్రాల (24), సౌమ్యశర్మ (23), సుచిత్ర సింగ్ (24), ఛావి వర్గ్ (18)లు 'మిస్ న్యూజెర్సీ యూఎస్ఏ'లో అదృష్టం పరీక్షించుకుంటుండగా.. 14 ఏళ్ల నేహా పసుపులేటి ఎడిసన్కు ప్రాతినిధ్యం వహిస్తూ.. 'మిస్ న్యూజెర్సీ టీన్ యూఎస్ఏ'లో పోటీపడుతున్నారు. ఈ పోటీలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలు గత శుక్రవారం, శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో వ్యక్తిత్వ అభివృద్ధి, ప్రేరణ, నైపుణ్య విశిష్టత వంటి అంశాలపై పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వారు అమెరికా జాతీయ అందాల పోటీలైన 'మిస్ యూఎస్ఏ', 'మిస్ టీన్ యూఎస్ఏ'లో పాల్గొంటారు. మిస్ యూఎస్ఏలో విజయం సాధిస్తే.. మిస్ వరల్డ్ పోటీల్లో కూడా పాల్గొనవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement