![Jr NTR Reveals How Rajamouli Helped Him In His Depression About Career - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/30/NTR.jpg.webp?itok=hiemd--a)
Jr NTR Depression: ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ జనవరి7న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా గడిపేస్తుంది మూవీ టీం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ తన డిప్రెషన్ గురించి బయటపెట్టాడు. 17ఏళ్లకే హీరోగా తెరంగేట్రం చేశాను. రెండవ సినిమాకే స్టార్ స్టేటస్ చూశాను. అయితే కొన్నాళ్ల తర్వాత వరుస డిజాస్టర్లు పలకరించాయి.
ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఏం చేస్తున్నానో తెలియని అయోమయంలో పడిపోయాను. అలాంటి గందరగోళ పరిస్థిత్లుల్లో ఉన్నప్పుడు ఆత్మపరిశీలన చేసుకునేందుకు జక్కన్న సాయం చేశాడు. వరుస ఫ్లాపులతో ఉన్న నాతో యమదొంగ లాంటి సూపర్ హిట్ ఇచ్చి మళ్లీ నన్ను సక్సెస్ ట్రాక్‌లో నిలబెట్టారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు నా స్నేహితుడిగా రాజమౌళి ఎప్పుడూ నాకు అండగా నిలబడ్డారు. అయితే ఆ విజయాలతో నేను పెద్దగా సంతృప్తి చెందలేదు.
కానీ ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించడం సంతృప్తినిస్తుంది. నటుడిగా ఎంతో నేర్చుకున్నాను అని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపిస్తే, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment