న్యూఢిల్లీ: దేశంలోని మెజారిటీ ప్రజలకు తియ్యటి పదార్ధాలంటే విపరీతమైన ఇష్టం. కానీ అదే పనిగా తీపి పదార్ధాలను తినడం ద్వారా కోవ్వు పెరుగుతుందని మనందరికి ఇది వరకే తెలుసు. కానీ ఆశ్చర్యకరంగా తీపి పదార్ధాలకు డిప్రెషన్‌కు సంబంధం ఉన్నట్లు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ నివేదిక తెలిపింది. అయితే ఆహార పదార్ధాల ద్వారా వ్యక్తి స్పందనలు ఉంటాయని తెలిపింది. కాగా రెండు రకాల షుగర్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. 1)సింపల్ షుగర్ 2)ప్రాసెస్డ్ షుగర్
1) సింపల్ షుగర్: కూరగాయలు, పండ్లలో సింపుల్ షుగర్ ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు(మినరల్స్) సమృద్ధిగా లభిస్తాయి.
2) ప్రాసెస్డ్ షుగర్: ఇందులో ఏ విధమైన షోషక విలువలు, కేలరీలు ఉండవు. ఉదా: చాక్‌లెట్స్, సాప్టడ్రింక్స్ (కూల్‌డ్రింక్స్) అయితే మన శరీరంలో తియ్యటి పదార్ధాల చేరాక కార్బోహైడ్రేట్స్‌గా ఉన్న పదార్ధాలను గ్లూకోజ్‌లోకి మార్చుతాయి.
అయితే తియ్యటి పదార్ధాలు తింటే ఎక్కువ స్ధాయిలో డోపమైన్ విడుదలవుతుంది(సంతోషం కలిగించే హార్మోన్). మరోవైపు ఎక్కువ తియ్యటి పదార్ధాలు తిన్నట్లయితే షుగర్‌ను స్థిరీకరిచేందుకు రసాయన చర్యలు జరుగుతాయి. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ సమస్యలతో బాధపడతారని నివేదిక తెలిపింది. కాగా షుగర్ ఎక్కువగా తీసుకుంటే పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మనసిక సమస్యలు, డిప్రెషన్‌తో బాధపడతారని సైన్స్ రిపోర్ట్ జర్నల్ అధ్యయనం తెలిపింది. అయితే షుగర్(తీపి పదార్ధాలు) ను అప్పుడప్పుడు మితంగా తీసుకుంటే సమస్యలు ఉండకపోవచ్చని నివేదిక తెలిపింది.
మరోవైపు షుగర్ సమస్యతో బాధపడేవాళ్లు చాలా జగ్రత్తతో ఉండాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు. టైప్ 1డయాబెటిస్(మధుమేహం) సమస్యతో బాధపడేవారు ఇన్సూలిన్ మార్పులను గమనించాలి. లేకుంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే జీవక్రియల సమతూల్యత కోల్పోయి డిప్రెషన్ సమస్యకు దారితీయొచ్చని ప్లస్ వన్ జర్నల్ అధ్యయనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment