ప్రతీకాత్మక చిత్రం
లక్ష్మీపురం(గుంటూరు): తీవ్ర మనోవేదన భరించలేకపోతున్నానని, చావడానికి అనుమతివ్వాలని కోరుతూ ఓ రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి గుంటూరు అర్బన్ ఎస్పీకి పోలీస్ గ్రీవెన్స్‌లో విన్నవించుకున్నాడు. జగన్నాథరావు 1978లో కుటుంబ సభ్యులను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు అతన్ని మొదట్లో వెలివేసినా తర్వాత దగ్గరై కొంత ఆస్తి ఇచ్చారు. దానిని జగన్నాథరావు భార్య పేరుతో రిజిస్టర్ చేశాడు. అయితే 2011 జూన్‌లో ఆయన భార్య అతనిపై 498ఎ కేసు పెట్టడంతో పాటు కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటకు పంపింది. నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌లో ఉన్న అతని ఇళ్లు స్వాధీనం చేసుకుంది.
‘నాకు నా భార్యాబిడ్డలంటే చాలా ఇష్టం.. వారిపై నేను కేసులు పెట్టలేను.. వాళ్లు లేకుండా బతకలేను.. తీవ్ర మనోవేదనతో నరకయాతన అనుభవిస్తున్నా.. నాకు మరణించేందుకు అనుమతివ్వండి’ అంటూ అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయరావుకు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment