కత్రినా కైఫ్
సోషల్ మీడియా యాప్స్‌తో ఎక్కువ టైమ్ గడిపితే యూత్ రియల్ లైఫ్‌కు దూరమై డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదముందని చెబుతున్నారు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. ‘‘చాలా మంది యూత్ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు. ఈ ప్రభావం వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలా అని వారి సోషల్‌మీడియా అకౌంట్స్‌ను డిలీట్ చేయమని చెప్పడం లేదు. సోషల్ మీడియాకు తక్కువ టైమ్ కేటాయించమని చెబుతున్నాను. మిగిలిన టైమ్‌ను వారి లక్ష్యసాధన కోసం వినియోగిస్తే వారి జీవితం బాగుంటుందని నా అభిప్రాయం. భవిష్యత్‌లో నా పిల్లలను తçప్పకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతాను. ఫిజికల్ యాక్టివీటిస్‌కు దగ్గర చేస్తాను’’ అని చెప్పుకొచ్చారు కత్రినా కైఫ్.
Comments
Please login to add a commentAdd a comment