ఛత్తీస్‌గఢ్‌లో పలు దుకాణాలకు హోల్‌సేల్‌గా సమోసాలను విక్రయించే అజయ్ పాలి అలియాస్ సమోసా బాబా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. కవర్ధా జిల్లాకు చెందిన సమోసా బాబా.. రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ ఫారమ్‌ను కొనుగోలు చేశారు.
కవర్ధా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఈ సమోసా బాబా 20 ఏళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నారు. నగరంలోని జనం అజయ్‌పాలిని సమోసా బాబా అని పిలుస్తుంటారు. మొదట్లో ఒక సమోసా 50 పైసలకు విక్రయించే ఈయన ఇప్పుడు నగరంలోని పలు హోటళ్లకు తక్కువ ధరకు హోల్‌సేల్‌గా సమోసాలను విక్రయిస్తున్నారు.
ప్రస్తుతం రూ. 5కు ఒక సమోసా విక్రయించే అతని దుకాణం ముందు జనం క్యూ కడుతుంటారు. ఈ సమోసా బాబా ఇప్పటివరకు 12కి పైగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో కౌన్సిలర్, ఎంపీ వరకు జరిగిన పలు ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇప్పుడు రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నుంచి నాలుగోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక్కడి జనం బీజేపీ, కాంగ్రెస్‌ల పాలనను చూసి విసిగిపోయారని, ఇప్పుడు తనకు అవకాశం కల్పిస్తారని సమోసా బాబా చెబుతున్నారు. బడా నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోరని సమోసా బాబా ఆరోపిస్తున్నారు. తనను ఇక్కడి జనం గెలిపిస్తే, తనకు వచ్చే ఎంపీ జీతాన్ని ప్రజా సేవకు ఖర్చు చేస్తానన్నారు.
అజయ్ పాలీ 2008 నుండి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు, మునిసిపాలిటీ అధ్యక్ష, కౌన్సిలర్ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో సమోసా బాబా పోటీ చేశారు. తాజాగా ఆయన రూ. 25 వేలు వెచ్చించి లోక్‌సభ ఎన్నికల నామినేషన్ ఫారం కొనుగోలు చేశారు. ఎన్నికల ఫలితాల గురించి పట్టించుకోకుండా సమోసా బాబా పోటీ చేస్తూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment