వేయించుకు తినండి | How to prepare Moong Dal Samosa | Sakshi
Sakshi News home page

వేయించుకు తినండి

Published Sat, Jun 22 2019 3:08 AM | Last Updated on Sat, Jun 22 2019 3:08 AM

How to prepare Moong Dal Samosa - Sakshi

ఇలా అయినా వానలు బాగా పడతాయని కిచెన్‌లో చేస్తున్న హోమమిది. తిన్నంతసేపూ ఎండని మరచిపోతాం. ఎందుకంటే వేయించుకుని తింటే వేడివేడిగా ఉంటుంది.
వేడివేడిగా ఉన్నప్పుడు వానపడాలని కోరుకుంటాం కదా...మీ మనోవాంఛా ఫల సిద్ధిరస్తు!

మూంగ్‌  దాల్‌ సమోసా
కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; చల్లటి నీళ్లు – తగినన్ని (పిండి కలపడానికి).

ఫిల్లింగ్‌ కోసం: పొట్టు పెసర పప్పు – 3 కప్పులు; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; గరం మసాలా – 3 టీ స్పూన్లు; మిరప కారం – 3 టీ స్పూన్లు; మెంతి పొడి – 1 టీ స్పూను; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; ఆమ్‌చూర్‌ పొడి – ఒక టీ స్పూను

తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి

-చల్లటి నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి అరగంట సేపు పక్కన ఉంచాలి

– పిండిని ఉండలు చేసుకుని, చపాతీలా గుండ్రంగా ఒత్తి, రెండు భాగాలు అయ్యేలా మధ్యకు కట్‌ చేయాలి

–ఒక భాగాన్ని తీసుకుని అంచుల దగ్గర తడి చేసి, కోన్‌ ఆకారంలో చుట్టి, అంచుల దగ్గర గట్టిగా అదమాలి

-పొట్టు పెసర పప్పును మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా అయ్యేలా మిక్సీ పట్టాలి

-స్టౌ మీద బాణలి వేడయ్యాక నూనె వేయాలి

-జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి

  -మిక్సీ పట్టిన పెసర పప్పు రవ్వను జత చేసి దోరగా వేయించాలి

-గరం మసాలా, మిరప కారం, మెంతి పొడి, ధనియాల పొడి, ఉప్పు, ఆమ్‌చూర్‌ పొడి జత చేసి మరోమారు వేయించి దింపి చల్లారనివ్వాలి

-తయారుచేసి ఉంచుకున్న సమోసా మౌల్డ్‌లోకి ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఉంచి, అంచులు మూసేయాలి

-ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి

-స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి

- పేపర్‌ న్యాప్‌కిన్‌ మీదకు తీసుకోవాలి.
 

రా బనానా అండ్‌ కోకోనట్‌ కచోరీ
కావలసినవి: అరటికాయలు – 4 (పెద్దవి); బియ్యప్పిండి – 3 టేబుల్‌స్పూన్లు; ఉప్పు – తగినంత; పచ్చి మిర్చి తరుగు – ఒక టేబుల్‌ స్పూన్‌

ఫిల్లింగ్‌ కోసం: వేయించిన పల్లీల పొడి – 4 టేబుల్‌ స్పూన్లు; పచ్చి మిర్చి పేస్ట్‌ – ఒక టేబుల్‌ స్పూను; తాజా కొబ్బరి తురుము – ఒక కప్పు; కిస్‌మిస్‌ – ఒక టేబుల్‌ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – తగినంత; పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర – 2 టేబుల్‌ స్పూన్లు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.
యోగర్ట్‌ కోసం: పెరుగు – 100 గ్రా.; ఉప్పు – తగినంత; పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు; వేయించిన పల్లీల పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; వేయించిన నువ్వులు – ఒక టేబుల్‌ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్‌ – ఒక టేబుల్‌ స్పూను; దానిమ్మ గింజలు – కొద్దిగా
తయారీ: -అరటి కాయలను ఉడికించి తొక్క తీసి చేతితో మెత్తగా మెదపాలి

-ఒక పాత్రలో అరటి కాయ ముద్ద, బియ్యప్పిండి, పచ్చి మిర్చిపేస్ట్, ఉప్పు, ఒక టేబుల్‌ స్పూను నూనె వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.

ఫిల్లింగ్‌ తయారీ: - ఒక పాత్రలో కొబ్బరి తురుము, పచ్చి మిర్చి పేస్ట్, పల్లీల పొడి, వేయించిన నువ్వులు, కిస్‌మిస్, జీలకర్ర, కరివేపాకు, పంచదార, నిమ్మ రసం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి
- అరటి కాయ మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి
- చేతికి నూనె పూసుకుని, ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని కచోరీ ఆకారంలో చేయాలి
- ఫిల్లింగ్‌ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా కచోరీ లో నింపి, గుండ్రంగా చే సి, పైన బియ్యప్పిండి అద్ది పక్కన ఉంచాలి

-ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి

-స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న కచోరీలను వేసి దోరగా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి

-యోగర్ట్‌లో ముంచి అందించాలి.

బ్యాంగ్‌ బ్యాంగ్‌
కావలసినవి:బేబీ పొటాటోస్‌ – పావు కేజీ; ఉప్పు – తగినంత; – 2 (ముక్కలు చేయాలి); పసుపు – అర టీ స్పూను; బొంబాయి రవ్వ – ఒక టేబుల్‌ స్పూను; నెయ్యి – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – మూడు; వెల్లుల్లి తరుగు – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు.

తయారీ: ∙బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించాలి ∙చల్లారాక తొక్క తీయాలి

-ఒక పాత్రలో ఉప్పు, పంచదార, ఎండు మిర్చి ముక్కలు, పసుపు, బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి ∙బంగాళ దుంపలను అందులో వేసి దొర్లించాలి

-స్టౌ మీద బాణలిలో పాన్‌ ఉంచి వేడయ్యాక పచ్చి మిర్చి వేసి వేయించాలి

-బేబీ పొటాటోలను వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి

-మధ్యమధ్యలో కలుపుతుండాలి

-బంగాళ దుంపలు బంగారు రంగులోకి మారగానే దింపేయాలి.

– నిర్వహణ
వైజయంతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement