
భోపాల్: మానవత్వం మంటగలిసింది. డబ్బులివ్వకుండానే సమోసా తిన్నాడనే చిన్న కారణంతో దుకాణదారు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆదివారం ఈ దారుణం జరిగింది. చోళా ప్రాంతంలోని శంకర్‌నగర్‌లో హరిసింగ్ అహిర్వార్ దుకాణంలోకి మద్యం మత్తులో ఉన్న వినోద్ అహిర్వార్ (40) ప్రవేశించి సమోసాను తీసుకుని తినడం మొదలుపెట్టాడు. హరిసింగ్ కోపంతో తలపై కర్రతో కొట్టడంతో చనిపోయాడని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment