No money
-
డాక్టర్ చదువుకు డబ్బుల్లేక..కూలి పనులకు..
హుస్నాబాద్ రూరల్: వైద్యురాలు కావాలన్నది ఆ అడవి బిడ్డ తపన.. అందుకోసం కూలి పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్లో 447 మార్కులు సాధించింది. ప్రైవేటు కాలేజీలో సీటు రావడంతో ఫీజులకు డబ్బుల్లేక.. ఎప్పట్లాగే తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన లావుడ్య లక్ష్మి, రమేశ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. దంపతులు కూలిపని చేస్తూ కూతుళ్లను చదివిస్తున్నారు. పెద్ద కూతురు బీ–ఫార్మసీ చేస్తోంది. చిన్న కూతురు దేవిని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి గురుకులంలో చేరి్పంచి చదివించారు.పదో తరగతి, ఇంటర్మిడియెట్‌లో మంచి మార్కులు సాధించిన దేవి.. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఏడాదిగా తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తూనే నీట్‌కు సిద్ధమైంది. నీట్లో 447 (2లక్షల 80 వేల ర్యాంకు) మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వస్తుందని అశించిన లావుడ్య దేవికి.. సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో సీటు వచి్చంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకు ఏటా రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో.. చేసేదిలేక దేవి కూలి పనులకు వెళ్తోంది. ఆస్తులు అమ్మి ఫీజు కడదామంటే అడవిలో పెంకుటిల్లు ఒకటే దిక్కు. దానిని కొనేవారు కూడా ఎవరూ లేరు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశయం నెరవేరుతుందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
‘ఉగ్ర’ దేశాలపై ఆర్థిక ఆంక్షలు: అమిత్ షా
న్యూఢిల్లీ: ఉగ్రవాద మూకలకు స్వర్గధామాలుగా మారిపోయిన దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించాల్సిందేనని కేంద్రం హోంశాఖ మత్రి అమిత్ షా అన్నారు. పరోక్షంగా పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకున్నాయని ఆరోపించారు. ఆయన శనివారం ఢిల్లీలో ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఉగ్రవాదానికి అంతర్జాతీయ సరిహద్దులుండవు. దాని నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాలి. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలి. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నాయి. వారి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయి’’ అని పాకిస్తాన్‌ను ఉద్దేశించి విమర్శించారు. ‘‘టెర్రరిజం రాజకీయ అంశం కాదు. పౌరుల రక్షణ, ప్రజాస్వామిక హక్కులకు సంబంధించినది. లాభాపేక్ష లేని సంస్థల ముసుగులో ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేయకుండా చర్యలు తీసుకోవాలి. కౌంటర్–టెర్రర్, ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను బలోపేతం చేసుకోవాలి’’ అని అమిత్ షా తెలిపారు. -
సమోసా తిన్నందుకు కొట్టి చంపేశాడు
భోపాల్: మానవత్వం మంటగలిసింది. డబ్బులివ్వకుండానే సమోసా తిన్నాడనే చిన్న కారణంతో దుకాణదారు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆదివారం ఈ దారుణం జరిగింది. చోళా ప్రాంతంలోని శంకర్‌నగర్‌లో హరిసింగ్ అహిర్వార్ దుకాణంలోకి మద్యం మత్తులో ఉన్న వినోద్ అహిర్వార్ (40) ప్రవేశించి సమోసాను తీసుకుని తినడం మొదలుపెట్టాడు. హరిసింగ్ కోపంతో తలపై కర్రతో కొట్టడంతో చనిపోయాడని పోలీసులు చెప్పారు. -
కోర్టు ఫీజుల కోసం నగలు అమ్ముకున్నా: అంబానీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సోదరుడు,అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీ సంచలన విషయం ప్రకటించారు. అప్పులతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయంటూ తన దగ్గర ఏమీ లేదంటూ మరోసారి చేతులెత్తేశారు. కేవల ఒక కారుతో చాలాసాధారణ జీవితాన్ని గడుపుతున్నానని వాపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఖర్చులను సైతం తన భార్య, ఇతర కుటుంబ సభ్యులు భరిస్తున్నారని, తన వద్ద చిల్లి గవ్వ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు 2020 జనవరి-జూన్ మధ్య కాలంలో చట్టపరమైన ఖర్చుల కోసం 9.9 కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిపారు. మూడు చైనా బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూకే కోర్టు విచారణకు హాజరైన అనిల్ అంబానీ ఈ విషయం ప్రకటించారు. విచారణలో భాగంగా యుకె కోర్టు లగ్జరీకార్ల సముదాయం గురించి అంబానీని ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఒకకారును మాత్రమే ఉపయోగిస్తున్నానని,రోల్స్ రాయిస్ కారు లేనే లేదంటూ మీడియా ఊహాగానాలను అనిల్ తోసిపుచ్చారు. అంతేకాదు ఆదాయాలు లేక విలాస జీవితం గాకుండా ఒక సాధారణ మనిషిగా జీవిస్తున్నానని తెలిపారు. అలాగే తన భార్య నగలు అమ్మి కోర్టు ఖర్చులు భరిస్తున్నట్టు అనిల్ అంబానీ తెలిపారు. తన తల్లికి 500 కోట్ల రూపాయలు, కుమారుడు అన్మోల్కు 310 కోట్ల రూపాయలు బాకీ ఉన్నానన్నారు. టీనా అనిల్ అంబానీ కలెక్షన్ గురించి కూడా బ్యాంకుల తరపున వాదిస్తున్న కౌన్సిల్ ప్రశ్నించింది. అయితే అదంతా టీనాకు చెందిందే అని, కేవలం టీనా భర్తగా తన పేరు ఉందని చెప్పుకొచ్చారు. 110,000 డాలర్ల విలువైన ఆర్ట్ పీస్ మాత్రమే తనదని వెల్లడించారు. ఆర్ధిక సంక్షోభం కారణంగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా 2019 , 2020 లో తనకు ఎలాంటి ఫీజులు రాలేదని ఆయన కోర్టుకు తెలిపారు. దక్షిణ ముంబైలోని తన ఇంటికి కరెంటు ఖర్చు గత ఎనిమిది నెలల్లో 60.6 లక్షలని ప్రకటించారు. ప్రైవేట్ హెలికాప్టర్, భార్యకు బహుమతిగా ఇచ్చిన ప్రైవేట్ లగ్జరీ యాచ్ట్ వినియోగం ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. దక్షిణ ముంబైలోని తన ఇంటిలో ఎనిమిది నెలల్లో 60.6 లక్షల రూపాయల విద్యుత్ ఖర్చులను అనిల్ అంబానీ ప్రకటించారు. మరోవైపు అనిల్ అంబానీ వాస్తవాలను దాచిపెడుతున్నారని బ్యాంకుల తరఫున హాజరైన బంకిమ్ థంకీ క్యూసీ ఆరోపించారు. తమకు రావాల్సిన రుణ బకాయిలను చట్టపరమైన మార్గాల ద్వారా పొంది తీరుతామని వ్యాఖ్యానించారు. కాగా ఫోర్బ్స్ ప్రకారం, 2008 లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ఆరవ ధనవంతుడిగా అలరారిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. దీనికి 2012లో అనిల్ అంబానీ తన రిలయన్స్ టెలికామ్ వ్యాపారం విస్తరణ కోసం మూడు చైనా బ్యాంకుల నుండి 700 మిలియన్ డాలర్ల రుణానికి వ్యక్తిగత హామీ ఇచ్చారు. ప్రస్తుతం రిలయన్స్ టెలికామ్ కంపెనీ దివాలా తీసింది. దీంతో ఆ బ్యాంకులు అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించాయి. మూడు చైనా బ్యాంకులు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ ముంబై బ్రాంచ్, చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా అనిల్ అంబానీపై 700 మిలియన్ డాలర్ల రుణం కోసం దావా వేసిన సంగతి తెలిసిందే. జూన్12 లోపు మూడు చైనా బ్యాంకులకు రూ .5,281 కోట్ల రుణాన్ని, రూ.7 కోట్లు చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని మే 22న ఆదేశించింది. కాని పక్షంలో తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను అఫిడవిట్ ద్వారా ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. ఈ చెల్లింపుల్లో అంబానీ విఫలం కావడంతో చైనా బ్యాంకులు మరోసారి బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించాయి. -
మళ్లీ మొదలైన నోట్ల కష్టాలు
-
పాత పాట... అదే మాట
నో క్యాష్ బ్యాంకుల వద్ద వేలాడదీసిన బోర్డులు ధర్నాలకు దిగిన ఖాతాదారులు ఏటీఎంల వద్ద అవే అవస్థలు సాక్షి, రాజమహేంద్రవరం : నగదు లేదు. క్యాష్ రాలేదు.. ఉంటే ఇవ్వకుండా ఎందుకు ఉంటాం.. ఇవీ జిల్లాలోని పలు బ్యాంకుల వద్ద ఆయా బ్యాంకు అధికారులు, సిబ్బంది ఖాతాదారులతో చెబుతున్న మాటలు. పెద్దనోట్ల రద్దు, అనంతరం నెలకొన్న నగదు కొరత సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఏరోజుకారోజు వచ్చిన నగదును బ్యాంకులు ఖాతాదారులకు పంపిణీ చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెండు రోజులుగా జిల్లాకు నగదు రాకపోవడంతో ఖాతాదారులు, పింఛ¯ŒSదారుల కష్టాలు అధికమయ్యాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే బ్యాంకుల వద్ద క్యూలలో ఉంటున్నారు. 10 గంటలకు బ్యాంకు సిబ్బంది వచ్చి ’నో క్యాష్’ బోర్డులు పెడుతుండడంతో ఖాతాదారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గురువారం కపిలేశ్వరపురం మండలం అంగర ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ‘ఈ రోజు క్యాష్ రాలేదని’ ప్రకటించడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు తాళాలు మేనేజర్ తీస్తుండగా ఖాతాదారులు అడ్డుకున్నారు. అంగర గాంధీ సెంటర్లో సుమారు గంటపాటు రాస్తారోకో చేశారు. మధ్యాహ్నం వరకు బ్యాంక్ తెరుచుకోలేదు. మేనేజర్, ఎస్సై, వైఎస్ఆర్సీపీ కో ఆర్డినేటర్ లీలాకృష్ణలు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. బ్యాంకులో ఉన్న మిగులు క్యాష్‌ని ఏటీఎంలో పెట్టేందుకు, శుక్రవారం క్యాష్ ఇచ్చేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడడంతో ఖాతాదారులు ఆందోళన విరమించారు. నో క్యాష్ బోర్డులు... ∙ పెదపూడి మండలం జి.మామిడాడ ఎస్బీఐ, రంగంపేట ఆంధ్రా బ్యాంక్‌లో, బిక్కవోలు మండలం పందలపాక ఆంధ్రాబ్యాంక్‌లో నో క్యాష్ బోర్డులు పెట్టారు. బిక్కవోలు ఎస్బిఐలోను, అనపర్తిలో ఎస్.బి.ఐ, ఆంధ్రాబ్యాంకులో ఉదయం నగదు ఇచ్చి మధ్యాహ్నం నుంచి నో క్యాష్ బోర్డులు పెట్టడంతో ఖాతాదారులు, పింఛ¯ŒSదారులు ఉసూరుమంటూ వెనుతిరిగారు. ∙ పి.గన్నవరం ఎస్బిఐలో పింఛన్లు మాత్రమే ఇస్తున్నారు. ఖాతాదారులకు నో క్యాష్ అని చెబుతున్నారు. గంటిపెదపూడి ఎస్బిఐలో, అయినవిల్లి మండలం నేదునూరులో ఇండియ¯ŒS బ్యాంక్‌లో ఉదయం నుంచే నో క్యాస్ బోర్డులు పెట్టగా రంపచోడవరం ఆంధ్రాబ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్‌లో మధ్యాహ్నం వరకు నో క్యాష్ బోర్డులు పెట్టారు. విత్‌డ్రాల కోసం జనం బారులుదీరారు. అమలాపురం ఎస్బీఐలో నగదు లేకపోవడంతో బ్యాంకు, ఏటీఎం వద్ద క్యూలైన్లో నిలుచున్న వారు నిరాశతో వెళ్లిపోయారు. ఖాతాదారుల ధర్నాలు : ఏళే«శ్వరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నగదు విత్‌డ్రాలు రూ.2 వేలు ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఖాతాదారులు ధర్నా చేశారు. ధర్నాకు మద్దతుగా టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సామర్లకోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన ద్వారాన్ని మధ్యాహ్నం 3.00 గంటలకు మూసివేశారు. దీంతో అప్పటి వరకు క్యూలో ఉన్న ఖాతాదారులు అరుపులు కేకలతో ఆందోళనకు దిగడంతో మేనేజర్ శ్రీనివాస్ బయటకు వచ్చి బ్యాంక్ సమయం మించిపోతున్న కారణంగా గేటు వేశామని చెప్పి, క్యూలో ఉన్నవారందరికీ టోకెన్లు ఇవ్వడంతో ఖాతాదారులు శాంతించారు. రాజమహేంద్రవరం కంబాలచెరువు ఎస్బీఐ ఏటీఎం వద్ద ప్రజలు ఇబ్బందులు పడకుండా షామియానా, కుర్చీలు బ్యాంకు అధికారులు వేయించారు. అరకొరగా పనిచేస్తున్న ఏటీఎంల వద్ద చాంతాడంత క్యూలు కొనసాగాయి. -
ఖాళీ !
విజయవాడ, గుంటూరు నగరాల్లో 3 ఏటీఎంలలోనే నగదు మిగిలిన ప్రాంతాల్లో ‘నో క్యాష్’ బోర్డులే ఆదివారం సరదాలు, సంతోషాలకు బ్రేక్ 33 రోజులైనా ప్రజలను వీడని కరెన్సీ కష్టాలు నేడు కూడా బ్యాంకులకు సెలవు.. ఆందోళనలో జనం సాక్షి, అమరావతి బ్యూరో : ‘నోట్ల రద్దు ఆషామాషీ నిర్ణయం కాదు. అనేక ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులు మరింత పెరుగుతాయి. కానీ 50 రోజుల్లో నోట్ల కష్టాలు సర్దుకుంటాయి. కళ్లముందే పరిస్థితి మెరుగుపడుతుంది..’ అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం రోజురోజుకూ నోట్ల కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. సెలవు అయినా ఆదివారం చేతిలో డబ్బులు లేక ప్రజలు అల్లాడిపోయారు. రెండు జిల్లాల్లో 1,778 ఏటీఎం కేంద్రాలు ఉండగా, పది కూడా పనిచేయడం లేదు. విజయవాడ, గుంటూరు నగరాల్లో కేవలం మూడు ఏటీఎం కేంద్రాలు మాత్రమే పనిచేశాయి. దీంతో డబ్బులు లేక జాలీగా గడపాల్సిన ఆదివారం అందరూ ఖాళీగా ఉండాల్సి వచ్చింది. 33 రోజులు గడిచినా... రూ.500, రూ.1,000 నోట్లు రద్దుచేసి 33 రోజులు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు డబ్బు వస్తున్నప్పటికీ లైనులో నిలుచున్నవారిని కొన్ని గంటల్లోనే ‘నో క్యాష్’ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఇప్పుడు వరుస సెలవుల కారణంగా రెండు జిల్లాల్లో బ్యాంకులు మూసివేశారు. ఏటీఎంలలోనూ నగదు నిల్వలు లేవు. సోమవారం కూడా బ్యాంకులకు సెలవు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు నగరాల్లో.. పదుల సంఖ్యలోనే..! విజయవాడ, గుంటూరు నగరాల్లో ఆదివారం ఉదయం నుంచే ఏ ప్రాంతంలో ఏటీఎంలు పని చేస్తున్నాయని ప్రజలు ఆరా తీయడం కనిపింది. గుంటూరులో నగరంపాలెంలోని ఎస్బీఐ ప్రధాన శాఖకు చెందిన ఒక్క ఏటీఎం మాత్రమే పనిచేసింది. దీంతో అక్కడ ప్రజలు బారులుతీరారు. విజయవాడ నగరంలోని బందరు రోడ్డులో కోస్టల్ బ్యాంకు ఏటీఎం, బీఆర్టీఎస్ రహదారి సమీపంలోని మధురానగర్‌లో ఒక ఏటీఎం మాత్రమే పనిచేశాయి. అక్కడ భారీ క్యూలైన్ కనిపించింది. మిగిలిన ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిచ్చాయి. సాయంత్రం కొన్ని ఏటీఎం కేంద్రాలు పని చేసినా, గంట వ్యవధిలోనే నగదు ఖాళీ అయ్యింది. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఏటీఎంలు పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూఅదే తీరు! రెండు జిల్లాలోని మిగిలిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒకటి, రెండు మినహా దాదాపు అన్ని బ్యాంకుల ఏటీఎంలు మూతపడ్డాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం 48 ఏటీఎం కేంద్రాలు ఉండగా.. ఆదివారం ఒక్కటీ పనిచేయలేదు. విజయవాడ తూర్పు, పశ్చిమ, గన్నవరం, పెడన, పామర్రు, నూజివీడు, మైలవరం, కైకలూరు, నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.అవనిగడ్డలో ఐదు రోజులుగా ఒక్క ఏటీఎం కూడా పని చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గుడివాడ నియోజకవర్గంలో 51 ఏటీఎంలు ఉండగా, పట్టణంలోని ఎస్బీఐ ప్రధాన శాఖ ఏటీఎం మాత్రమే పనిచేసింది. తిరువూరు పట్టణంలో రెండు ఏటీఎంలు ఉదయం కొద్దిసేపు పనిచేశాయి. కృష్ణా జిల్లాలో మొత్తం నాలుగు ఏటీఎంలు పనిచేశాయి. గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. -
పెళ్లి అని చెప్పినా.. డబ్బివ్వలేదు
మల్కాజిగిరి: ఆయన భాద్యతలు స్వీకరించినపుడు ఎందరికో డబ్బులు వారి ఖాతాల నుంచి సకాలంలో అందజేసి ఉంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం నోట్ల మార్పిడి, రద్దు నిర్ణయంతో ఈ రోజు ఆయనే తాను పనిచేసిన శాఖలో.. తన ఖాతాలోని డబ్బులు తీసుకోలేని పరిస్థితి. మరి కొన్ని గంటల్లో కూతురి పెళ్లి ఉన్నా.. చేతిలో డబ్బు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారాయన. మల్కాజిగిరి సాయిపురికాలనీకి చెందిన సి.విజయ్‌కుమార్ సబ్ పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహించి 2010లో పదవీవిరమణ పొందారు. అప్పుడు వచ్చిన డబ్బులు సుమారు నాలుగున్నర లక్షలను మల్కాజిగిరి పోస్టాఫీస్‌లో ఎంఐఎస్ స్కీమ్‌లో తన కూతురి పేరిట జమచేశారు. 2016 సెప్టెంబర్‌లో స్కీమ్ గడువు ముగియడంతో ఎస్బీ ఖాతా ప్రారంభించి డబ్బులు అందులో జమచేశారు. ఆదివారం కూతురు వివాహం ఉండడంతో మూడు రోజుల క్రితం తనకు రూ.2.50 లక్షలు ఇవ్వాలని అధికారులను కోరారు. కేవైసీ ప్రతాలతో పాటు పెళ్లి కార్డు జతచేసి ఇవ్వాలని అధికారులు అడిగారు. అయితే, నగదు తక్కువగా ఉందని చెప్పడంతో కనీసం లక్ష రూపాయలైనా సర్దాలని ఆయన కోరారు. శనివారం వస్తే నగదు ఇస్తామని చెప్పిన అధికారులు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా నగదు ఇవ్వలేదని విజయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవైసీ పత్రాలు కూడా అందజేశానని, డబ్బులు ఎవరెవరికి ఇవ్వాలో వారి పేర్లు కూడా ఇవ్వడానికి అంగీకరించానన్నారు. పైగా తాను డబ్బులు ఇవ్వాల్సిన వారికి బ్యాంక్ ఖాతాలేదని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని చెప్పడం దారుణమన్నారు. డబ్బులు ఉన్నా కూతురి పెళ్లికి నలుగురి వద్ద అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బ్యాంకులు ఖాళీ
అవే కష్టాలు... అవే సమస్యలు... బ్యాంకుకెళ్తే... లెక్కలేనన్ని నిబంధనలు. ఏటీఎంలకెళ్తే క్యాష్‌రాదు. తీరా అందులోంచి వచ్చే రెండువేల నోటుకు చిల్లర దొరక్క అష్టకష్టాలు. ఇదీ జిల్లాలో మంగళవారం నాటి పరిస్థితి. పనిచేస్తున్న అరకొర ఏటీఎంల వద్ద ఇప్పటికీ బారులు తీరిన జనం కనిపిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మరో రెండు రోజుల్లో ఒకటో తేదీ వస్తే అప్పటి పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కడంలేదు. విజయనగరం అర్బన్:కేంద్ర ప్రభుత్వం వెయి.. ఐదువందల నోట్లు రద్దు చేసి 20 రోజులు దాటుతున్నా ఇంకా కరెన్సీ కోసం ఇక్కట్లు తప్పటం లేదు. నోట్లు లేక బ్యాంకులు, మార్కెట్లు వెలవెలబోతున్నాయి. జిల్లాలోని 76 గ్రామీణ వికాస బ్యాంకులు, 16 జిల్లా సహకార బ్యాంకుల్లో దాదాపు లావాదేవీలు స్తంభించాయి. మిగిలిన అన్ని జాతీయ బ్యాంకుల్లోనూ కరెన్సీ నిండుకుంది. ఈ పరిస్థితి జిల్లా అంతటా గత రెండురోజులుగా కనిపిస్తోంది. రద్దు చేసిన పాత రూ. 500లు, రూ. 1,000 నోట్లతో ఒక వైపు బ్యాంకు చెస్టులు నిండిపోతే మరోవైపు రూ.100 నోట్లు, రూ.2 వేల నోట్లు లేక బ్యాంకుల్లో లావాదేవీలు నిలిచిపోయారుు. డిపాజిట్లపైనే... ఆధారం సాధారణంగా బ్యాంక్‌లకు వచ్చిన జమలనే 80 శాతం చెల్లింపులకు వినియోగిస్తారు. పాత నోట్లు దాదాపు 80 శాతం మార్పిడి అరుున ఈ పరిస్థితుల్లో చెల్లింపు కోసం జమయ్యే సొమ్ములపైనే బ్యాంకులు ఆధారపడుతున్నారుు. సోమవారం నాటికే జిల్లాలోని అధికశాతం బ్యాంకుల్లో సొమ్ము నిండుకోవడంతో కొద్దో గొప్పో బ్యాంకులకు జమ అవుతున్నా దానినే ఖాతాదారుల అవసరం మేరకు చెల్లిస్తున్నారు. వ్యక్తిగతంగా వారానికి రూ.24 వేలు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అధిక శాతం బ్యాంకుల్లో ఖాతాదారులు అడిగిన మేరకు సొమ్ములు ఇవ్వకుండా రూ. 1,000, రూ. 2,000లు ఇచ్చి సరిపెట్టారు. బ్యాంకింగ్ రంగంలో రారాజులా నిలిచిన ఎస్బీఐ బ్రాంచ్‌ల్లో సైతం నగదు నిల్వలు నిండుకున్నారుు. పట్టణంలోని ఒక ప్రధాన బ్యాంచ్‌లో మంగళవారం పనిగంటలు ముగిసే సమయానికి కనిష్ట లావాదేవీలు రూ.20 లక్షలు చేయాల్సి ఉండగా కేవలం రూ.5 లక్షలకే పరిమితమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 289 ఏటీఎంలలో కేవలం 152 మాత్రమే పనిచేశారుు. వీటిలో 60 ఏటీఎంలలో మాత్రమే రూ.100 నోట్లురాగా, మిగిలిన అన్నింటిలోనూ రూ. 2,000 వచ్చినట్లు తెలుస్తోంది. నగదు పెట్టిన మూడు గంటల్లో సంబంధిత ఏటీఎంలు ఖాళీ అవుతున్నారుు. అరకొరగా సాగిన ఈ సర్వీసులు సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇబ్బందుల్ని తీర్చలేదు. రూ.500 కొత్త నోట్లు వచ్చాయంటూ ప్రచారం జిల్లాకు కొత్తగా రూ. 500ల నోట్లు వందకోట్లు విలువ గలవి వచ్చాయని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటి వరకూ ఏ బ్యాంకుకూ విడుదల కాలేదు. ఇప్పుడే విడుదల చేస్తే ఆ మొత్తం సైతం రెండు రోజుల్లో అరుుపోతుందనీ, వచ్చే నెల జీతాలకు ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో బ్యాంకులకు నగదు విడుదల చేయలేదనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు ఇబ్బంది కలగని విధంగా డిసెంబర్ 1కి కొత్త రూ.500 నోట్లు బ్యాంకులకు విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ కారణంగా సోమ, మంగళ, బుధవారాల్లో జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో జమ అయ్యే మొత్తాల నుంచే మరలా చెల్లింపులు చేసుకునే పరిస్థితి ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అదే విధంగా మార్కెట్లో చిల్లరలేక, రూ.2 వేల నోటు మార్చుకునే విధానంలేని పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి, కార్మిక వర్గాలు నాలుగు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడిన వెంటనే హర్హం వ్యక్తం చేసిన అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు కరెన్సీ కష్లాలతో వ్యతిరేకత కనబరుస్తున్నారు. నల్లకుబేరులను చేసేది ఏమీ లేదని, సామాన్యులే కరెన్సీ కష్టాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తాగడానికి డబ్బుల్లేక వ్యక్తి ఆత్మహత్య
తాళ్లపూడి : మండలంలోని అన్నదేవరపేట గ్రామంలో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. తాళ్లపూడి ఎస్సై జె.సతీష్ తెలిపిన కథనం ప్రకారం.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన మజ్జి సింహచలం (50) గొర్రెలను కాసుకుంటూ జీవిస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తాగడానికి డబ్బుల్లేకపోవడంతో మనస్తాపానికి గురై ఒంటి పై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను మరణించాడు. మృతుడికి భార్య ఉన్నారు. -
ప్రచారం తప్ప.. పైసా విదల్చలేదు
–అట్టహాసంగా ‘దోమలపై దండయాత్ర’ నిధులు – విడుదల కాక పంచాయతీల అవస్థలు – దోమల మందుతో సరిపెడుతున్న వైనం భీమవరం: ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నా దోమల నివారణకు పంచాయతీలకు పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. నిధులు పరిపుష్టిగా ఉన్న పురపాలక సంఘాలు, మేజర్ పంచాయతీల్లో అరకొరగా పనులు చేపడతున్నా.. మైనర్ పంచాయతీల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా ఉందని సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలంలో వాధ్యుల నివారణకు ఏటా ప్రభుత్వం పంచాయతీకి రూ.10 వేలు నిధులు మంజూరు చేస్తుంది. ఈ ఏడాది దోమల బెడద, వ్యాధుల విజృంభణ ఎక్కువగా ఉండటంతో మరో రూ.5 వేలు అదనంగా కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిని సర్పంచ్, ఏఎన్ఎం జాయింట్ ఆపరేషన్‌తో నిధులు ఖర్చు చేసే వెసులుబాటు ఉంది. అయితేఇప్పటివరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనుల నిర్వహణ ఎలా అంటూ సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. మొక్కుబడిగా దోమ మందు పంపిణీ పంచాయతీలకు నామమాత్రంగా దోమ ల మందు పంపిణీ చేశారని, మందు పిచికారీకి కూలీ ఖర్చులు తాము భరిం చాల్సి వస్తోందని సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు. గ్రామాల్లో నిత్యం సంచరించే ఏఎన్ఎంలు ఆయా గ్రామాలకు అవసరమైన దోమల మందును అంచనావేసి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ద్వారా డీఎంహెచ్‌వో కార్యాలయానికి నివేదిక పంపారు. దీంతో గ్రామాలకు ఎబిట్ (దోమల నివారణ) మందును ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే బ్లీచింగ్ జాడ లేదని సర్పంచ్‌లు చెబుతున్నారు. సమిధలవుతున్న విద్యార్థులు దోమలపై దండయాత్ర కార్యక్రమానికి విద్యార్థులు సమిధలవుతున్నారు. నిధు లు విడుదల కాకపోవడంతో అధికారు లు, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో గ్రా మాల్లో ర్యాలీలు నిర్వహించి మమ అనిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాన్ని విద్యా, స్వచ్ఛంద సంస్థల భుజాలపై పెట్టడంతో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను సమిధలుగా చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెం దుతున్నారు. ఎండావానా తేడా లేకుండా గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ బ్లీచింగ్ చెల్లించడం, డ్రెయిన్లలో చెత్త తీయించడం వంటి పనులు విద్యార్థులతో చేయిస్తున్నారని పలువురు తల్లిదం డ్రులు ఆరోపిస్తున్నారు -
పంటలు ఎండి.. అప్పులు తీరక...
– రంగాపూర్‌లో రైతు ఆత్మహత్య – మిన్నంటిన కుటుంబసభ్యుల రోదనలు అచ్చంపేట రూరల్ : ఆ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం.. ఆ రైతు తమకున్న పొలంలో పంటలు వేసినా వర్షాభావంతో ఎండిపోయాయి.. దీంతో వాటికోసం చేసిన అప్పులు తీర్చలేక అతను ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.. వివరాలిలా ఉన్నాయి. అచ్చంపేట మండలంలోని రంగాపూర్‌కు చెందిన కేతావత్ టీక్యా (35) కు శివారులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. అందులో ఈసారి ఖరీఫ్ సీజన్లో పత్తి, మిరప వేశాడు. వీటికోసం సుమారు మూడు లక్షలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి తెచ్చాడు. వర్షాలు సరిగ్గా కురియకపోవడంతో పంటలు ఎండిపోతుండటం, చేసిన అప్పులు తీర్చడం ఎలాగని మనోవేదనకు గురైన అతను శనివారం మధ్యాహ్నం పొలంలోనే పురుగుమందు తాగాడు. కొద్దిసేపటికి చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మతి చెందాడు. ఈయనకు భార్య బుజ్జితోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనతో వారు బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్ఐ ఖాద్రీ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
ఆ ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదట!
అతనో ప్రైవేటు ఎంప్లాయి. పేరు నరేష్. వ్యక్తిగత పని నిమిత్తం బయటకు బయలుదేరాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. దారిలో ఏటిఎంలో తీసుకుందాంలే అనుకున్నాడు. ఓ ఏటీఎంలోకి వెళ్లాడు. అందులో డబ్బుల్లేక ఖాళీ రశీదు వచ్చింది. దీంతో మరో ఏటీఎంకి వెళ్లాడు అదే పరిస్థితి. ఇంకో ఏటీఎం మెట్లెక్కాడు. ఫలితం లేదు. ఇది ఒక్క నరేష్ ఇబ్బందే కాదు. మనలో చాలామంది అవస్థ. ప్రస్తుతం జిల్లాలోని ఏటీఎంలలో నగదు కొరత తీవ్రంగా ఉంది. పాలకోడేరు : పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏటీఎంలలో డబ్బులు ఉండడం లేదు. ఎప్పుడు కార్డు పెట్టినా ఖాళీ రశీదులే వస్తున్నాయి. ఫలితంగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో చేతిలో చిల్లిగవ్వ లేక సతమతమవుతున్నారు. జిల్లాలో మొత్తం అన్ని బ్యాంకుల ఏటీఎంలు కలిపి 500 వరకూ ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఇదే దుస్థితి నెలకొంది. ఏటీఎంలలో నగదు ఎలా పెడతారంటే.. ఓ ప్రాంతంలోని బ్యాంకు మెయిన్ బ్రాంచి తన పరిధిలోని కొన్ని బ్రాంచీల ఏటీఎంలకు నగదు సరఫరా చేస్తుంది. ఈ ఏటీఎంలలో నగదు పెట్టేందుకు ఓ ప్రైవేటు ఏజెన్సీతో కాంట్రాక్టు కుదుర్చుకుంటుంది. ఆ ఏజెన్సీ సిబ్బంది బ్యాంకు నుంచి నగదు తీసుకెళ్లి ఆ ఏటీఎంలలో పెడుతుంటారు. బ్యాంకుల్లో డబ్బుల్లేవా ! బ్యాంకుల్లో డబ్బుల్లేకపోవడమే ఏటీఎంలలో నగదు కొరతకు కారణంగా కనిపిస్తోంది. ఆర్బీఐ తాజాగా విధించిన నిబంధనల వల్ల బ్యాంకింగ్ లావాదేవీలపై ఖాతాదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా కార్యకలాపాలు మందగించాయి. దీనివల్ల బ్యాంకుల్లో డబ్బు రొటేషన్ కావడం లేదు. దీనికితోడు బ్యాంకులు ఇచ్చిన రుణాలూ రికవరీ కావడం లేదు. ఫలితంగా నగదు కొరత తలెత్తింది. ఒక్కోసారి అసలు డబ్బుల్లేని దుస్థితి నెలకొంటోంది. ఆర్బీఐ నిబంధనలు ఇవీ.. ♦ బ్యాంకుల్లో రూ. 50వేలు పైబడి లావాదేవీలు జరిపితే పాన్‌కార్డు నంబరు జతచేయాలి ♦ పాన్‌కార్డు లేకుంటే ఫారమ్-60ని పూర్తి చేసి సమర్పించాలి. ♦ రూ.25వేలకు మించి డీడీ తీయాలంటే ఆ సొమ్మును ఖాతాలో వేసి ఆ తర్వాత డెబిట్ చేసుకుని డీడీ తీయాలి. ♦ డిపాజిట్లపై వడ్డీ చెల్లింపుల విషయంలోనూ రూ. 10వేలు దాటితే పాన్ కార్డు నంబర్ ఇవ్వాలి. ♦ రూ. 5వేలు మించి లావాదేవీలు జరపాలంటే ఎస్బీఐలో గ్రీన్‌కార్డు పొందాలి. ఇలాంటి నిబంధనలతోపాటు బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఆదాయపుపన్ను శాఖ ఆరా తీస్తుందనే భయం వల్ల కూడా ఖాతాదారులు బ్యాంకింగ్ కార్యకలాపాలపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే బ్యాంకుల్లో తీవ్ర డబ్బు కొరత తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. నిబంధనలు సడలించాలని డిమాండ్ ఆర్బీఐ విధించిన నిబంధనలు సడలించాలని ఖాతాదారులు కోరుతున్నారు. రూ. రెండు లక్షల లావాదేవీల వరకూ ఈ నిబంధనలను వర్తింపజేయరాదని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడే బ్యాంకింగ్ కార్యకలాపాలు పుంజుకుంటాయని సూచిస్తున్నారు. ఏటీఎంలలో డబ్బులు ఉండడం లేదు ఏటీఎంల నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు. అన్ని బ్యాంకులదీ ఇదే పరిస్థితి. వాటిల్లోకి వెళితే డబ్బులు రావడం లేదు. ఖాళీ రశీదులే వస్తున్నాయి. అదేమని అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటీవల కాలంలో తరుచూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. - సోము కుసుమ గుప్త, శృంవృక్షం తంటాలు పడ్డాను పనిమీద పూలపల్లి వెళ్లాను. వాహనంలో పెట్రోల్ అయిపోయింది. ఏటీఎం కార్డు ఉందనే భరోసాతో ఉన్నా. తీరా ఏటీఎంలోకి వెళితే డబ్బులు లేక చాలా తంటాలు పడ్డాను. అప్పు చేయాల్సి వచ్చింది. - మేడపాటి సాగర్, వీరవల్లిపాలెం, వీరవాసరం మండలం సమస్య మా దృష్టికి వచ్చింది ఏటీఎం కేంద్రాల్లో డబ్బు కొరత సమస్య మా దృష్టికి వచ్చింది. బ్యాంకర్ల సమావేశంలో ఈ విషయంపై చర్చించా. ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలలో సమస్యను వెంటనే పరిష్కరిస్తాను. ఇతర బ్యాంకు ఏటీఎంలలో వచ్చేవారం నుంచి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తాను. - సుబ్రహ్మణ్యేశ ్వరరావు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, ఏలూరు -
సంక్షేమానికి నిధుల క్షామం
సామాజిక న్యాయం, సామాజిక సామరస్య సూత్రాల ఆధారంగా సమాజంలోని అంతరాలను తొలగించడానికి కృతనిశ్చయంతో ఉన్నామని బీజేపీ ఎన్నికల ప్రణాళిక పేర్కొంది. కానీ మోదీ ప్రభుత్వ బడ్జెట్ అందుకు పూర్తి విరుద్ధంగా సాగింది. బలహీన, బడుగువర్గాల సంక్షే మం పట్ల గతంకన్నా మరింత అధ్వాన వైఖరిని చేపట్టింది. కార్పొరేట్ కుబేరులకు పెద్దపీట వేసి, పేద, అణగారిన వర్గాలకు అన్యాయం చేసింది. ప్రణాళికా వ్యయంలో కోత విధించి రాష్ట్రాల నిధుల వాటాను పెంచడం పేదల సంక్షేమ పథకాల మీద తీవ్ర దుష్ర్పభావం చూపబోతున్నది. ‘‘వివిధ కులాల, తెగల సమూహమే భారతదేశం అనే విషయాన్ని నేను నొక్కి చెప్పదలచుకున్నాను. ఈ సామాజిక సమూహాల ప్రగతిలో, స్థాయిలో తారతమ్యాలున్నాయి. వీరందరినీ ఒకే స్థాయిలోకి, సమానత్వంలోకి తేవాల నుకుంటే వారి వారి అవసరాలనుబట్టి విభిన్నమైన చర్యలు తీసుకోవాల్సి ఉం టుంది.’’ 1939 ఫిబ్రవరి, 21న బొంబాయి ప్రెసిడెన్సీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల్లో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అన్న మాటలివి. దేశ సామాజిక స్థితిగతులనుబట్టి బడ్జెట్ రూపకల్పన జరగాలంటూ 75 ఏళ్ల క్రితం అంబేద్కర్ పలికిన హితవును మనం మరిచామో, మననంలో ఉంచుకున్నామో పరిశీలించాల్సి ఉంది. ఇటువంటి స్ఫూర్తితోనే భారత రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక రక్షణలను కల్పించారు. 4వ షెడ్యూల్లోని ఆదేశిక సూత్రాలలో పొందుపరచిన అంశాలు కూడా అవే. భారత రాజ్యాం గం ఒక వ్యక్తి అభిప్రాయం కాదు. నాడు దేశమంతటికీ ప్రాతినిధ్యం వహిం చిన రాజ్యాంగ సభ చర్చించి రూపొందించినది. అందులోని 38, 46 ఆర్టికల్స్ ప్రకారం వెనుకబడిన వర్గాలకు, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఆర్థిక రంగాల్లో ప్రత్యేక హక్కులను కల్పించాలని పేర్కొన్నారు. అంతే కాకుండా దీనిని ప్రభుత్వం ఒక బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. వాటి ఆధారం గానే గత 65 ఏళ్లుగా అరకొరగానైనా కొన్ని పథకాలు అమలు జరుగు తున్నాయి. వాటి కోసం ప్రత్యేక బడ్జెట్ రూపకల్పన కూడా చేస్తున్నారు. ప్రత్యేక మంత్రిత్వశాఖల ద్వారా ఆ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలలో ప్రధాన పాత్రను పోషిస్తున్నది. సంక్షేమానికి చెల్లుచీటీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ బలహీన, బడుగువర్గాల సంక్షే మం పట్ల గతంకన్నా మరింత అధ్వాన వైఖరిని చేపట్టింది. సంపన్న కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేసింది. పేద, అణగారిన వర్గాలకు తీరని అన్యాయం చేసింది. పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడానికి ఉద్దేశించిన సమగ్ర శిశు అభివృద్ధి పథకానికి (ఐసీడీఎస్) నిధుల కేటాయింపులో సగం కోత విధించారు. గత ఏడాది రూ.16,000 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.8,000 కోట్లకు తగ్గిం చారు. ఇది ముఖ్యంగా పేద మహిళలు, పిల్లలపై తీవ్ర దుష్ర్పభావాన్ని కలిగిస్తుంది. తల్లి తీసుకునే ఆహారాన్ని బట్టే పిల్లల ఎదుగుదల ఉంటుంది. ముఖ్యంగా మెదడు ఎదుగుదలలో సగం తల్లి గర్భంలోనే జరుగుతుందని, మిగిలిన సగభాగం మూడేళ్ల వయసులోపు జరుగుతుందని తేలింది. ఇప్పుడు ఐసీడీఎస్ బడ్జెట్‌ను సగానికి సగం తగ్గించడంవల్ల కొన్ని కోట్ల మంది శిశువులు, మహిళలపై ఆ ప్రభావం పడక తప్పదనేది కఠోర వాస్తవం. అదే విధంగా బడిపిల్లల మధ్యాహ్న భోజన పథకానికి నిధులను కూడా రూ.13,000 కోట్ల నుంచి రూ.9,000 కోట్లకు కుదించారు. మధ్యాహ్న భోజన పథకం మంచి ఫలితాలను ఇస్తున్న సమయమిది. పేద పిల్లలు ఇంట్లో సరైన తిండిలేక, సమయానికి బడికి రాక క్రమంగా బాలకార్మికులుగా మారిపోతు న్నారు. దానికి విరుగుడుగా వచ్చిన ఈ పథకం అమలు వల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతు న్నాయి. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ రంగం కూడా ఇదే విధమైన వివక్షకు గురైంది. వైద్యం, ఆరోగ్యం ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలకు అందని ద్రాక్షగా ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో సాధారణ జ్వరాలతో చనిపోయే దుస్థితికి మనం తలదించుకోకతప్పదు. అటువంటి ముఖ్యమైన రంగానికి నిధులను రూ.35,163 కోట్ల నుంచి రూ.29,653 కోట్లకు తగ్గిం చారు. విద్యారంగానికి ఆసరాగా ఉంటున్న సర్వశిక్షా అభియాన్‌కు రూ.6,000 కోట్ల కోత విధించారు. ఫలితంగా విద్యారంగంలో, ముఖ్యంగా ప్రాథమిక విద్యలో మౌలిక సదుపాయాల కల్పనకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థుల స్కాలర్షిప్పులకు కేటాయింపులు పెరగలేదు. ఇది దళిత, ఆదివాసీ విద్యార్థుల విద్యావకాశాలపై తీవ్ర చెడు ప్రభావం చూపవచ్చు. ఉన్నత విద్యలో పరిశోధనా విద్యార్థులకు అందించే రాజీవ్‌గాంధీ ఫెలో షిప్పులలో తీవ్ర కోత పడే అవకాశం ఉంది. కొండెక్కిన సామాజిక న్యాయం ఇక ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా రూపొందించే సబ్ ప్లాన్ విషయంలో పెద్ద కుట్ర జరిగింది. గత ఏడాదితో పోలిస్తే కేటాయింపుల్లో 50 శాతం కోత పెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో గానీ, ఎకనమిక్ సర్వేలో గానీ దళితులు, ఆది వాసీల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. పైగా బీజేపీ ఎన్నికల ప్రణాళికలో వెలిబుచ్చిన అభిప్రాయాలకు, వాస్తవంగా జరుగుతున్నదానికి పొంతనలేదు. ‘‘సామాజిక న్యాయం, సామాజిక సామరస్య సూత్రాల ఆధారంగా సమాజంలోని అంతరాలను తొలగించడానికి బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఆర్థికన్యాయం, రాజకీయ సాధికారతతో కూడిన సామాజిక న్యాయం మరింత శక్తివంతమయ్యేందుకూ, అస్తిత్వ రాజకీయాల తాత్కాలిక ఉపశమ నాలకు బదులుగా సమాజంలోని అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీల సమగ్రాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. విద్య, వైద్యం, ఉపాధి విష యాలలో సమానావకాశాలను అందించడానికి సమతుల్యతను పాటిస్తాం’’ అని ఆ పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించుకున్నది. కానీ ఆచరణలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. గతంలో ఉన్న అవకాశాలను కూడా తగ్గించింది. కుబేరులకు వరాల వాన ఈ కోతలకు కారణమేమిటి? భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంటే పారి శ్రామిక, వాణిజ్య రంగాల మీద ఎక్కువ భారం పడాలి. కానీ అది జరగలేదు. పైగా దాదాపు రూ. 5,89,285 కోట్లు పారిశ్రామిక, వాణి జ్య వర్గాలకు పన్నుల రద్దు ద్వారానో, ప్రోత్సాహకాల పేరుతోనో లాభం చేకూరింది. ఆ వర్గాలకు ఇలా కానుకగా అందించినది బడ్జెట్ మొత్తంలో 30 శాతం! అంటే మోదీ ప్రభుత్వం ఆ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పైగా ఆరున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్న ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం మరో మోసానికి తెరలేపింది. దాని స్థానంలో ‘నీతి ఆయోగ్’ పేరుతో మరొక కొత్త సంస్థను ఆరంభించింది. ‘నీతి ఆయోగ్’ సిఫారసు ప్రకారం రాష్ట్రాలకు కేంద్ర రాబడిలోని వాటాను గణనీయంగా పెంచింది. దీని వలన ప్రణాళికా వ్యయంలో రూ.1,09,000 కోట్ల రూపా యల కోత పడింది. ఫలితంగా వివిధ సామాజిక రంగాలకు గణనీయంగా బడ్జెట్ తగ్గింది. విద్యారంగానికి కేటాయింపులు తగ్గడానికి కారణం రాష్ట్రాల వాటా పెరగడమేనని కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ బహిరంగంగానే ప్రకటించారు. రాష్ట్రాల నిధులు పెంపు... సంక్షేమానికి ముప్పు ప్రణాళికా వ్యయం తగ్గించడం ద్వారా రాష్ట్రాల వాటాని పెంచడం వాంఛనీ యం కాదు. ఇది సామాజిక సంక్షేమ రంగం మీద, పేదల సంక్షేమ పథకాల మీద తీవ్ర ప్రభావం చూపబోతున్నది. గత అనుభవాల దృష్ట్యా చాలా రాష్ట్రాలు తమ బడ్జెట్లలో సామాజిక రంగానికి పెద్ద ఎత్తున నిధుల కోత విధిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, నిర్మాణరంగంపై కేంద్రీకరణ పేరిట కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేంద్ర నిధులలో రాష్ట్రాల వాటా భారీగా పెరిగినా అవి వాటిని అలాగే ఖర్చు చేస్తాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు కూడా నిర్లక్ష్యం చేయడంతో సంక్షేమ రంగం పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్పుల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తూవస్తోంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రంగం మీద ఖర్చు చేయకపోతే ఉన్నత విద్య చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లేకుండా పోయే ప్రమాదం ఉంది. అపసవ్య దిశలో మోదీ సర్కారు రాజ్యాంగ రచన సమయంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై చాలా చర్చ జరి గింది. రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇస్తూనే కేంద్రం శక్తివంతం కావాలని, నిపుణులు సూచించారు. ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల భవిష్యత్తును రాష్ట్రాల చేతుల్లో పెట్టకూడదని, దానివల్ల ఆధిపత్య కులాలు అణగారిన వర్గాలను ఎదగనీయకుండా అడ్డుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ వర్గాల సంక్షే మం, అభివృద్ధి ప్రధానంగా కేంద్రం బాధ్యతగా ఉండాలని, దానివల్ల ఒకే జాతీయ విధానం ఏర్పడి, నిష్పక్షపాతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల హక్కుల రక్షణ సాధ్యమవుతుందని రాజ్యాంగ రచనా సభ అభి ప్రాయపడింది. ప్రస్తుత మోదీ ప్రభుత్వ పాలన సరిగ్గా దానికి అపసవ్య దిశగా సాగుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన ఈ అన్యాయాన్ని మోదీ ప్రభు త్వం సరిదిద్దుకునేలా అన్ని వర్గాలు, పార్టీలు, సంస్థలు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -మల్లేపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ నం: 9705566213) -
మెడికో విద్యార్ధి ఆత్మహత్య