- నో క్యాష్ బ్యాంకుల వద్ద
- వేలాడదీసిన బోర్డులు
- ధర్నాలకు దిగిన ఖాతాదారులు
- ఏటీఎంల వద్ద అవే అవస్థలు
పాత పాట... అదే మాట
Published Thu, Dec 15 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
నగదు లేదు. క్యాష్ రాలేదు.. ఉంటే ఇవ్వకుండా ఎందుకు ఉంటాం.. ఇవీ జిల్లాలోని పలు బ్యాంకుల వద్ద ఆయా బ్యాంకు అధికారులు, సిబ్బంది ఖాతాదారులతో చెబుతున్న మాటలు. పెద్దనోట్ల రద్దు, అనంతరం నెలకొన్న నగదు కొరత సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఏరోజుకారోజు వచ్చిన నగదును బ్యాంకులు ఖాతాదారులకు పంపిణీ చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెండు రోజులుగా జిల్లాకు నగదు రాకపోవడంతో ఖాతాదారులు, పింఛ¯ŒSదారుల కష్టాలు అధికమయ్యాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే బ్యాంకుల వద్ద క్యూలలో ఉంటున్నారు. 10 గంటలకు బ్యాంకు సిబ్బంది వచ్చి ’నో క్యాష్’ బోర్డులు పెడుతుండడంతో ఖాతాదారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గురువారం కపిలేశ్వరపురం మండలం అంగర ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ ‘ఈ రోజు క్యాష్ రాలేదని’ ప్రకటించడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు తాళాలు మేనేజర్ తీస్తుండగా ఖాతాదారులు అడ్డుకున్నారు. అంగర గాంధీ సెంటర్‌లో సుమారు గంటపాటు రాస్తారోకో చేశారు. మధ్యాహ్నం వరకు బ్యాంక్ తెరుచుకోలేదు. మేనేజర్, ఎస్‌సై, వైఎస్‌ఆర్‌సీపీ కో ఆర్డినేటర్ లీలాకృష్ణలు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. బ్యాంకులో ఉన్న మిగులు క్యాష్‌ని ఏటీఎంలో పెట్టేందుకు, శుక్రవారం క్యాష్ ఇచ్చేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడడంతో ఖాతాదారులు ఆందోళన విరమించారు.
నో క్యాష్ బోర్డులు...
∙ పెదపూడి మండలం జి.మామిడాడ ఎస్‌బీఐ, రంగంపేట ఆంధ్రా బ్యాంక్‌లో, బిక్కవోలు మండలం పందలపాక ఆంధ్రాబ్యాంక్‌లో నో క్యాష్ బోర్డులు పెట్టారు. బిక్కవోలు ఎస్‌బిఐలోను, అనపర్తిలో ఎస్.బి.ఐ, ఆంధ్రాబ్యాంకులో ఉదయం నగదు ఇచ్చి మధ్యాహ్నం నుంచి నో క్యాష్ బోర్డులు పెట్టడంతో ఖాతాదారులు, పింఛ¯ŒSదారులు ఉసూరుమంటూ వెనుతిరిగారు.
∙ పి.గన్నవరం ఎస్‌బిఐలో పింఛన్లు మాత్రమే ఇస్తున్నారు. ఖాతాదారులకు నో క్యాష్ అని చెబుతున్నారు. గంటిపెదపూడి ఎస్‌బిఐలో, అయినవిల్లి మండలం నేదునూరులో ఇండియ¯ŒS బ్యాంక్‌లో ఉదయం నుంచే నో క్యాస్ బోర్డులు పెట్టగా రంపచోడవరం ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్‌లో మధ్యాహ్నం వరకు నో క్యాష్ బోర్డులు పెట్టారు. విత్‌డ్రాల కోసం జనం బారులుదీరారు. అమలాపురం ఎస్‌బీఐలో నగదు లేకపోవడంతో బ్యాంకు, ఏటీఎం వద్ద క్యూలైన్లో నిలుచున్న వారు నిరాశతో వెళ్లిపోయారు.
ఖాతాదారుల ధర్నాలు : ఏళే«శ్వరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నగదు విత్‌డ్రాలు రూ.2 వేలు ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఖాతాదారులు ధర్నా చేశారు. ధర్నాకు మద్దతుగా టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సామర్లకోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన ద్వారాన్ని మధ్యాహ్నం 3.00 గంటలకు మూసివేశారు. దీంతో అప్పటి వరకు క్యూలో ఉన్న ఖాతాదారులు అరుపులు కేకలతో ఆందోళనకు దిగడంతో మేనేజర్ శ్రీనివాస్ బయటకు వచ్చి బ్యాంక్ సమయం మించిపోతున్న కారణంగా గేటు వేశామని చెప్పి, క్యూలో ఉన్నవారందరికీ టోకెన్లు ఇవ్వడంతో ఖాతాదారులు శాంతించారు. రాజమహేంద్రవరం కంబాలచెరువు ఎస్బీఐ ఏటీఎం వద్ద ప్రజలు ఇబ్బందులు పడకుండా షామియానా, కుర్చీలు బ్యాంకు అధికారులు వేయించారు. అరకొరగా పనిచేస్తున్న ఏటీఎంల వద్ద చాంతాడంత క్యూలు కొనసాగాయి.
Advertisement
Advertisement