without permission
-
పోలీసులు చెప్పినా పవన్ వినలేదు: సీపీ శ్రీకాంత్
సాక్షి, విశాఖపట్నం: అనుమతి లేకుండా పవన్ కల్యాణ్ ర్యాలీ చేశారని వైజాగ్ సీపీ శ్రీకాంత్ అన్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పినా పవన్ వినలేదన్నారు. పవన్‌పై దాడి జరుగుతుందని సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు చేసిన తప్పుడు ప్రచారంతో జనసేన కార్యకర్తలు భారీగా వచ్చారు. ఎయిర్పోర్ట్ వద్ద పథకం ప్రకారమే దాడి జరిగిందని సీపీ తెలిపారు. దాడి ఘటనలో 9 మందిని అరెస్ట్ చేశామని, 100 మందిపై కేసు నమోదు చేశామని సీపీ వెల్లడించారు. చదవండి: అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట.. -
సమోసా తిన్నందుకు కొట్టి చంపేశాడు
భోపాల్: మానవత్వం మంటగలిసింది. డబ్బులివ్వకుండానే సమోసా తిన్నాడనే చిన్న కారణంతో దుకాణదారు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆదివారం ఈ దారుణం జరిగింది. చోళా ప్రాంతంలోని శంకర్‌నగర్‌లో హరిసింగ్ అహిర్వార్ దుకాణంలోకి మద్యం మత్తులో ఉన్న వినోద్ అహిర్వార్ (40) ప్రవేశించి సమోసాను తీసుకుని తినడం మొదలుపెట్టాడు. హరిసింగ్ కోపంతో తలపై కర్రతో కొట్టడంతో చనిపోయాడని పోలీసులు చెప్పారు. -
ప్రైవేటు ఆస్పత్రుల ఇష్టారాజ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోవిడ్ మహమ్మారిని అడ్డం పెట్టుకుని వైద్యం పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. మానవత్వాన్ని మర్చిపోయి ధనమే పరమావధిగా వ్యవహరిస్తున్న వైద్య యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. జిల్లాలో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ రెండు ఆస్పత్రులను సీజ్ చేసింది. మరికొన్ని ఆస్పత్రులలో తనిఖీలకు రంగం సిద్ధం చేస్తోంది. ఎవరైనా ప్రైవేటు ఆస్పత్రులలో అనుమతి లేకుండా కోవిడ్ వైద్యం చేసినా, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువ వసూలు చేసినా కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కోవిడ్ వైద్యానికి అనుమతి ఉన్న ఆస్పత్రులతో పాటు, ఆరోగ్యశ్రీకి అనుమతి ఉన్న ఆస్పత్రుల యాజమాన్యాలతో కలెక్టర్ రేవు ముత్యాలరాజు గురువారం సమావేశం కానున్నారు. ఏలూరు, భీమవరంలలో ఆస్పత్రుల సీజ్ ఇప్పటికే ఏలూరులోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రితో పాటు భీమవరంలోని గాయత్రీ హాస్పిటల్‌పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేసి వాటిలో అక్రమంగా కోవిడ్ చికిత్సలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో వాటిని సీజ్ చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆ ఆస్పత్రుల యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారు సమాధానం ఇచ్చిన తర్వాత క్రిమినల్ చర్యలకు ఉపక్రమించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. రోగుల నుంచి భారీగా డిపాజిట్లు: మురళీకృష్ణ ఆస్పత్రిలో తనిఖీలు చేసినప్పుడు ఒక్కో రోగిని చేర్చుకునే ముందు వారి వద్ద నుంచి 2 లక్షల రూపాయల వరకూ డిపాజిట్లు కట్టించుకున్నట్లు నిర్ధారణైంది. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 12 మంది వరకూ మృత్యువాత పడినట్లు సమాచారం. కనీసం వెంటిలేటర్ సదుపాయం కూడా లేకుండానే ఈ ఆస్పత్రి వైద్యం పేరుతో దోపిడీకి పాల్పడినట్లు అధికారుల తనిఖీలలో తేలింది. గాయత్రి ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల ఓ సచివాలయ ఉద్యోగి భర్త కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్పత్రి వైఫల్యం వల్లే తన భర్త చనిపోయాడంటూ ఆ మహిళ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా ప్రైవేటు వైద్యశాలల్లో అనుమతి లేకుండా కరోనా రోగులకు వైద్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా రెమిడిసివిర్ మందులు కూడా పెద్ద ఎత్తున వాడుతున్నట్లు తెలిసింది. ప్రైవేటుకు ప్రభుత్వ కిట్లు: ఇదే సమయంలో ప్రభుత్వం ఉపయోగిస్తున్న కోవిడ్–19 ఏజీ రాపిడ్ కిట్లను కూడా ప్రైవేటు ల్యాబ్‌లలో గుర్తించారు. ఈ కిట్లు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉంటాయి. ఈ కిట్లు అడ్దదారిలో ప్రైవేటు ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు వెళ్లిపోవడం వెనుక ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఉన్నట్లు స్పష్టంగా కనపడుతోంది. ఈ ఇంటిదొంగలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ కిట్లు మాయమయ్యాయి? ఎవరు సరఫరా చేస్తున్నారు? అన్న అంశాలపై విచారణ చేస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. అయితే ల్యాబ్ నిర్వాహకులు అనుమతులు లేకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రులు అసలు కోవిడ్ పరీక్షలు చేయకుండా సీటీ స్కాన్ చేసి దాని ద్వారా కోవిడ్ వైద్యం చేసేస్తున్నారు. ఫైర్ ఎన్వోసీ తప్పనిసరి : డీఎంహెచ్ఓ విజయవాడ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఫైర్ ఎన్వోసీ తప్పనిసరి చేసినట్లు డీఎంహెచ్ఓ కె.సునంద తెలిపారు. ఫైర్ సేఫ్టీ లేకపోతే కొత్తగా అనుమతులు ఇవ్వబోమని, ఇప్పుడు ఉన్న ఆస్పత్రులకు కూడా ఫైర్‌సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే ఆస్పత్రులు మూసివేస్తామని హెచ్చరించారు. అనుమతి లేకుండా వైద్యం చేసినా, రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడినా ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు కొనసాగిస్తామని చెప్పారు. -
నారాయణా.. అనుమతి ఉందా!
కర్నూలు సిటీ: కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రభుత్వ ఆదేశాలను, అధికారుల సూచనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నా బోర్డు అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఇందుకు గాయత్రి ఏస్టేట్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో కోచింగ్ ఇస్తుండటమే నిదర్శనం. దీంతో పాటు లక్ష్మీనగర్‌లోని ఓ నూతన భవనంలోకి ఇటీవల కోచింగ్ తరగతులను మార్చారు. అలాగే ఈద్గా సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ కూడా తరగతులు నిర్వహిస్తోంది. మిగిలిన కార్పొరేట్ కాలేజీల్లో తరగతులతో పాటే పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు పట్టనట్ల వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. నామ మాత్రపు తనిఖీలు.. జిల్లాలో ఇంటర్మీడియట్ కాలేజీలు 266 ఉండగా వీటిలో 226 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో ప్రైవేటు కాలేజీలు 105, కార్పొరేట్ కాలేజీలు 18 ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లో కేవలం ఇంటర్మీడియట్ విద్య అందించాలి. పోటీ పరీక్షల తరగతులు నిర్వహించకూడదని, ప్రతి కాలేజీని తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడంలేదు. స్థానిక గాయత్రి ఎస్టేట్‌లోని నారాయణ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ క్లాస్‌లు నిర్వహిస్తున్నా యాజమాన్యానికి నోటీస్‌లు ఇవ్వలేదు. నీట్, జేఈఈ లాంగ్‌టర్మ్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.70 వేల నుంచి లక్ష వరకు ఫీజులు వస్తున్నా ఆ విషయం తమ దృష్టికి రాలేందంటున్నారు. శ్రీచైతన్యలో తరగతులతో పాటే కోచింగ్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు నగరంలోని మరికొన్ని ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇదే తంతు జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. తనిఖీలు చేస్తున్నాం.. ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీలను తనిఖీ చేస్తున్నాం. కాలేజీల్లో పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నట్లు తెలిసి తనిఖీ చేసి విద్యార్థులను అడిగితే లేదని చెబుతున్నారు. గాయత్రి ఎస్టేట్‌లోని నారాయణ కాలేజీలో కోచింగ్ ఇస్తున్నట్లు తెలియడంతో తనిఖీలు చేసి తరగతులు నిర్వహించకూడదని ఆదేశించాం. అయితే వారు మరో భవనంలోకి మార్చినట్లు తెలిసింది. కొన్ని కాలేజీల్లో తరగుతులతో పాటు కోచింగ్ క్లాస్‌లు ఇస్తున్న మాట వాస్తవమే. విషయం బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – సాలబాయి, ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ ►రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ గుప్పిట్లో పెట్టుకొని నిబంధలకు విరుద్ధంగా కాలేజీలను నిర్వహిస్తున్నారని, ఏ కాలేజీలో కూడా కోచింగ్ పేరుతో తరగతులు నిర్వహించకూడదని, బోర్డు అధికారులు తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ►ప్రభుత్వ గుర్తింపు ఉన్న కాలేజీ దగ్గర విద్యార్థుల ఫొటోలతో ప్రచార బోర్డులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతి కాలేజీలో కేవలం తరగతులు మాత్రమే నిర్వహించాలి. పోటీ పరీక్షలకు తరగతులు నిర్వహించకూడదు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు తీరు మార్చుకోవాలి. అక్టోబర్ 22న ప్రైవేటు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ సాలబాయి సూచించారు. -
శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాను మరిపించే సీన్!!
శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో సీన్లా ఆ మెడికల్ షాపునకు ‘ఏసీఈ( ఏస్) ఆసుపత్రి అని బోర్డు తగిలించేశారు. ఏడు పడకల ఆసుపత్రిగా బిల్డప్ చేశారు. ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ల సహాయంతో రోగులను ఆసుపత్రికి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. జూనియర్ డాక్టర్లను ఆసుపత్రికి తీసుకొచ్చి.. అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నామని హడావుడి చేశారు. ‘మా ఆసుపత్రికి నెలకు ఐదుగురు రోగులను పంపిస్తే రూ.వెయ్యి గిఫ్ట్ కార్డు, పది మందికి రూ.2 వేలు, 15 మందికి రూ.3 వేలు, 25 మందికి రూ.6 వేలు గిఫ్ట్ కార్డు ఇస్తాం’ అంటూ ఆసుపత్రి యాజమాన్యం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటనలు వాట్సాప్‌లలో షేర్ చేశారు. ఇది గమనించిన జనం జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇవ్వడంతో.. వారు తనిఖీ చేశారు. ఆసుపత్రి పేరుతో వారు చేస్తున్న కార్యకలాపాలను చూసి కంగుతిన్నారు. సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం ): డిగ్రీ చదివి, మెడికల్ షాపు నిర్వహించుకునే రామచంద్రన్, రాజేష్‌లు రాజమహేంద్రవరం సీతం పేటలోని ఏసీఈ(ఏస్)ఆసుపత్రిని ప్రారంభించారు. వీరు జూనియర్ డాక్టర్లు పి.నిఖిల్, ఎం.రాజేంద్రలతో కలసి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. అంతేకాదు ఏడు పడకల ఆసుపత్రి అంటూ ఒక షాపులో ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి నుంచి ఏ విధమైన అనుమతులు తీసుకోకుండానే నిర్వహణకు సిద్ధమయ్యారు. మెడికల్ షాపు నిర్వహించే వారు ఏకంగా డాక్టర్ల అవతారం ఎత్తడంతో స్థానికులు ఈ ఆసుపత్రి వ్యవహారాన్ని వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు రంగంలోకి దిగి ఆసుపత్రిని తనిఖీ చేశారు. డాక్టర్‌కు చెల్లించే నెల జీతం రూ.1.50 లక్షలు ఏ విధంగా చెల్లిస్తున్నారో కూడా సరైన రికార్డులు వారు నిర్వహించడం లేదు. అనుమతి లేకుండా ఆసుపత్రి ఏర్పాటు జిల్లాలో ఏవిధమైన క్లినిక్‌లు, ఆసుపత్రులు ఏర్పాటు చేయాలన్నా జిల్లా వైద్యాధికారి(డీఎంఅండ్‌హెచ్‌ఓ) అనుమతి తప్పనిసరి. ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు, రోగులకు అందించే వైద్య సేవలు, వైద్య పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. వైద్య అధికారుల నుంచి ఏవిధమైన అనుమతులు లేకుండానే ఏసీఈ(ఏస్) ఆసుపత్రి ఏర్పాటు చేశారు. అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని ప్రకటనలు ఇచ్చిన ఆసుపత్రి యాజమాన్యం రోగుల చికిత్సకు ఉపయోగించే పరికరాలేవీ లేకుండానే ఆసుపత్రిని నిర్వహించడంపై వైద్యాధికారులే అవాకయ్యారు. అనుభవం లేకుండానే ఆసుపత్రి నిర్వహించి కోట్లకు పడగలెత్తాలనే లక్ష్యంతో సేవా రంగాన్ని వ్యాపారరంగంగా మార్చారంటూ వైద్య మండలి చైర్మన్ సాంబశివారెడ్డి వెల్లడించారు. ఆసుపత్రిని సీజ్ చేశాం ఈ ఆసుపత్రి నిర్వహణకు అనుమతి లేదు. రికార్డులూ సక్రమంగా లేవు. ఆసుపత్రి నిర్వహణ వ్యాపార దృక్పథంతో జరుగుతోంది. సరైన మౌలిక సదుపాయాలు, రోగులకు వైద్యం అందించే పరికరాలు లేకుండానే ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర వైద్యాధికారులకు నివేదిక అందిస్తున్నాం. – డాక్టర్ టి. రమేష్ కిషోర్, జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి -
టీడీపీ గుండెల్లో గుబులు
సాక్షి, విశాఖపట్నం : అక్రమ భవన నిర్మాణదారులు ఎంతటివారైనా ఉపేక్షించొద్దన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో మహా విశాఖ నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం దూకుడుగా వ్యవహరిస్తోంది. అధికారం ఉంది కదానీ.. నిబంధనలకు తిలోదకాలిస్తూ ఐదేళ్ల పాటు అడ్డగోలుగా వ్యవహరించిన టీడీపీ నేతల ఆగడాలకు ముకుతాడు పడుతోంది. మహా విశాఖ నగరంలో అనధికార నిర్మాణాలపై టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఉక్కుపాదం మోపుతున్నారు. ప్లాన్‌కు విరుద్ధంగా.. ఎక్కడ అనధికార నిర్మాణం కనిపించినా.. దాని వెనుక ఎంతటివారున్నా వెనుకాడకుండా కూలగొడుతున్నారు. టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగించిన దందాలకు చరమగీతం పాడుతున్నారు. టౌన్ ప్లానింగ్ అనే విభాగం ఉందన్న విషయం గుర్తులేనట్లుగా ఇష్టారాజ్యంగా అక్రమాల కోటలు కట్టేసి.. మోనార్క్‌ల్లా వ్యవహరించారు. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పట్టణ ప్రణాళికాధికారులు, సిబ్బంది ఉండిపోయారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కృష్ణా కరకట్టపై అనధికారికంగా నిర్మించిన ప్రజా వేదిక కూల్చివేతకు ఆదేశించి.. రాష్ట్రంలో ఎక్కడ ఈ తరహా నిర్మాణాలు కనిపించినా చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన సంకేతాలు.. టౌన్‌ప్లానింగ్‌లో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. వెంటనే అనధికార నిర్మాణాలపై చర్యలకు ఉపక్రమించేందుకు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దాదాపు 120కి పైగా భవనాలు, అదనపు అంతస్తుల్ని కూలగొట్టారు. ఈ క్రమంలో నగరం నడిబొడ్డున టీడీపీ నేతలు అడ్డగోలుగా నిర్మించిన అక్రమ భవనాలపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. పార్టీ కార్యాలయంతో మెదలు... దసపల్లా వివాదస్పద భూముల్లోని సర్వే నెంబర్ 1196/7లో 2వేల చదరపు గజాల స్థలాన్ని టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. దీనికోసం 2002లో అప్పటి టీడీపీ ప్రభుత్వం లీజుకిస్తున్నట్లు కట్టబెట్టింది. లీజుకు తీసుకున్న 2వేల చదరపు గజాల స్థలంతో పాటు మరో వెయ్యి గజాలకు పైగా కొండను తొలచేసే మరీ భవనం నిర్మించేశారు. 2016 ఏప్రిల్ 18న భవన నిర్మాణ ప్లాన్ కోసం టీడీపీ నేతలు జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని 19 వార్డులోని పందిమెట్టలో 2016 ఏప్రిల్ 27న టీడీపీ కార్యాలయాన్ని నిర్మించేందుకు నారాలోకేష్ శంకుస్థాపన చేశారు. స్టిల్ట్ ప్లస్ జీ ప్లస్ 2 అంతస్తులతో నిర్మించిన ఈ భవనాన్ని 2018 అక్టోబర్ 30న నారాలోకేష్ ప్రారంభించారు. అయితే.. 1086/0422/బీ/జెడ్3/ఆర్యూటీ/2016 దరఖాస్తులో లింక్ డాక్యుమెంట్ల విషయాన్ని ప్రస్తావించారే తప్ప.. దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు మాత్రం ఇప్పటికీ జీవీఎంసీకి అందివ్వలేదు. వీటిని అందిస్తే తప్ప ప్లాన్ అప్రూవ్ చేయమంటు అప్పట్లోనే జోన్–3 టౌన్‌ప్లానింగ్ అధికారులు సమాచారం ఇచ్చారు. అయినా.. ప్లాన్ అనుమతులతో సంబం ధం లేకుండానే భవనాన్ని నిర్మించేశారు. ప్లాన్ కోసం చేసిన దీంతో మరోసారి ఈ నెల 28న నోటీసులు సిద్ధం చేసుకున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు శనివారం కార్యాలయానికి టీడీపీ ప్రెసిడెంట్ పేరుతో ఉన్న నోటీసులను అక్కడ ఉన్న మేనేజర్‌కు అందించారు. వారం రోజుల్లోగా సంబంధిత డాక్యుమెంట్లు అందివ్వకపోతే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 452 (2) ప్రకారం సదరు భవనాన్ని అనధికారిక నిర్మాణంగా గుర్తించి కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫైల్ కమిషనర్ వద్ద.. గంటా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంతో పాటు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ అక్రమ నిర్మాణాల అంతు చూసేందుకు జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం సమాయత్తమైంది. ఇప్పటికే టీడీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసిన టౌన్‌ప్లానింగ్ అధికారులు.. మిగిలిన రెండు భవనాలకూ నోటీసులు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ ఫైల్ జీవీఎంసీ కమిషనర్ సృజన వద్ద ఉంది. ఆమె అనుమతి రాగానే ఈ అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్లానూ లేదు.. పన్నూ చెల్లించలేదు.. పార్టీ ప్రధాన కార్యాలయమే కాదు.. నేతల క్యాంపు కార్యాలయాలూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించేశారు. భీమిలిలో ఉన్న గంటా క్యాంపు కార్యాలయమే ఇందుకు ఉదాహరణ. 2014లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి భీమిలి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆనుకుని సుమారు అర ఎకరం స్థలంలో క్యాంపు కార్యాలయాన్ని అడ్డగోలుగా నిర్మించేశారు. ఇప్పటికీ దీనికి సంబం«ధించి అనుమతులకు సంబంధించిన పత్రాలేవీ జీవీఎంసీ వద్ద లేకపోవడం విడ్డూరం. 1997 నుంచి 2014 వరకు ఒకరి పేరుతో ఖాళీ స్థలాల పన్ను(వీఎల్టీ) చెల్లించిన పత్రాలున్నాయి. ఆ తర్వాత క్యాంపు కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున వ్యక్తి పేరుతో కరెంట్ బిల్లు వస్తోంది. భవనం నిర్మించినప్పటి నుంచి ఇంతవరకూ ఆస్తి పన్నుగానీ, నీటి పన్నుగానీ చెల్లించలేదు. ఈ విషయాన్ని అడిగేందుకు ఏడాదిన్నర క్రితం వెళ్లిన జీవీఎంసీ రెవెన్యూ అధికారులపై క్యాంపు కార్యాలయంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడటంతో అప్పటి నుంచి భవనం వైపు వెళ్లే సాహసం చెయ్యలేదు. నిబంధనలు గోవిందా... అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా వెంకట గోవింద్ సత్యనారాయణదీ అదే దారి. ప్రమాదకరమైన గెడ్డ పక్కనే నిబంధనలను పాటించకుండా.. ఆరంతస్తుల భవనాన్ని కట్టేస్తున్నా కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసేసుకున్నారు... కాదు కాదు.. అధికార మదంతో జీవీఎంసీ కళ్లు మూయించారు. ఎమ్మెల్యే గోవింద్‌కు ఆయన భార్య పి.విజయలక్ష్మి పేరిట నగరంలోని బీవీకే కళాశాల రోడ్లో సర్వే నెంబర్ 32లో 300 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. నిబంధనల మేరకు భవన నిర్మాణం జరిగితే ఎవరికీ ఇబ్బంది లేదు కానీ... సదరు ఎమ్మెల్యే మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా నిర్మాణం చేసేస్తున్నారు. ఆ స్థలం పక్కనే దక్షిణ భాగాన భారీ గెడ్డ ఉంది. వాస్తవానికి 168 జీవో ప్రకారం... బఫర్ జోన్ కింద గెడ్డకు పది అడుగుల దూరం, భవన నిర్మాణ కాంపౌండ్ నుంచి మరో పది అడుగులు.. మొత్తంగా 20 అడుగుల దూరం వదిలి నిర్మాణం చేపట్టాలి. కానీ ఎమ్మెల్యే ఈ నిబంధనను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీనిపై జీవీఎంసీ అధికారులడిగితే.. మా ఇష్టమంటూ హూంకరించారు. మరోవైపు 300 చదరపు గజాల స్థలంలో జీ ప్లస్ 2 భవన నిర్మాణానికే జీవీఎంసీ అధికారులు అనుమతులిచ్చారు. కానీ అక్కడ ఆరంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేస్తున్నారు. అక్రమంగా నిర్మించేస్తున్న ఈ భవనానికీ మూడింది. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గంటా క్యాంపు కార్యాలయం -
గంభీర్‌పై కేసు నమోదు
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఢిల్లీలోని జంగ్పూరలో గురువారం గంభీర్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశించడంతో ఢిల్లీ పోలీసులు గంభీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ పోలీసు చట్టంలోని 28/110 సెక్షన్ల కింద గంభీర్‌పై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ఈస్ట్) చిన్మయి బిశ్వాల్ శనివారం మీడియాకు తెలిపారు. దీనిపై ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి హరీశ్ ఖురానా స్పందిస్తూ...నాటి ర్యాలీపై గంభీర్ సంబంధిత అధికారులనుంచి అనుమతి తీసుకున్నారని, అయితే ఆ ర్యాలీని నిర్దేశిత సమయానికి మించి పొడిగించారని తెలిపారు. దీనిపై పార్టీ న్యాయ విభాగం అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గంభీర్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో అవాస్తవాలు/ వ్యత్యాసాలున్నాయని, రెండు చోట్ల ఓటు గుర్తింపు కార్డును కలిగి ఉన్నారని చట్ట రీత్యా ఇది నేరమని ఆప్ అభ్యర్థి అతీషీ ట్వీట్ చేశారు. -
దర్జాగా కబ్జా!
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లా కేంద్రం సరిహద్దు ప్రాంతాల్లో వెలసిన అక్రమ వెంచర్లపై అధికారుల నజర్ లేకపోవడంతో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రైవేటు పట్టా భూములతో పాటు అందినంత ప్రభుత్వ భూములను కబ్జా చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కడా లేనివిధంగా రియల్టర్లు సిండికేట్‌గా మారి వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. సిండికేట్ దగ్గరకు రావాలంటేనే అధికారులే ఆందోళన చెందే స్థాయికి ఎదగడంతో జిల్లా సమీపంలోని చెరువులు, కుంటలు అన్యాక్రాంతమై ప్రభుత్వ భూములు కుచించుకుపోతున్నాయి.రోజురోజుకు అక్రమంగా వెంచర్లు వెలుస్తున్నా వాటిని నిలువరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. రియల్టర్లుగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పలు పార్టీల నాయకుల చెలామణిలో ఉంటూ ఎప్పటికప్పుడు పుకార్లను షికార్లుగా మలుచుకుని ధరలు అమాంతం పెంచుకుంటూ లాభపడుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వెంచర్లు జిల్లా కేంద్రం సరిహద్దు ప్రాంతాలైన ఎండబెట్ల, దేశియిటిక్యాల, ఉయ్యలవాడ, మంతటి, గగ్గలపల్లి, నల్లవల్లి రోడ్డు వెంబడి ప్రధాన రహదారుల ఇరువైపులా పంట పొలాలను రియల్టర్లు కొనుగోలు చేసుకుని రియల్ దందాకు కొనసాగిస్తున్నారు. వీటితో పాటు ఒకప్పుడు వర్షపు నీటితో కళకళలాడిన చెరువు శిఖం భూములు, కుంటల భూముల్లోనూ రియల్టర్లు ప్లాట్లుగా మలిచి అందినకాడికి దండుకుంటున్నారు.ఫుల్ ట్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ శిఖం భూముల్లో మట్టిని పోసి ప్లాట్లుగా మార్చేశారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా పంట భూములన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే.. పంటలతో కళకళలాడిన పంట పొలాలు సైతం ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలంటే ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతులు పొందాల్సి ఉంది.అంతేకాక ఆయా భూముల్లో పబ్లిక్ అవసరాల కోసం 10 శాతం భూమి కేటాయించాల్సి ఉంది. ఎలాంటి అనుమతులు పొందకుండా ప్లాట్లను ఏర్పాటు చేస్తుండటంతో భవిష్యత్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అక్రమ వెంచర్ల రియల్టర్లపై అధికారులు నజర్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. -
109 కాలేజీలకు అనుమతులివ్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 109 జూనియర్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో బుధ వారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకుంటే సమీపంలో గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేర్పించే బాధ్యత సదరు యాజమాన్యానిదేనని ఆయన స్పష్టం చేశారు. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కాలేజీ అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,698 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిల్లో ఇప్పటివరకు 1,313 కాలేజీలకు మాత్రమే గుర్తింపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మిగతా 385 కాలేజీలకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క ఇంటర్ కాలేజీకీ హాస్టల్ నిర్వహించే అనుమతి లేదని స్పష్టం చేశారు. జూనియర్ కాలేజీల అనుమతులపై మంగళవారం సాక్షిలో ‘ఇంటర్ బోర్డు అధికారుల గుర్తింపు దందా’శీర్షికతో వచ్చిన వార్తపై బోర్డు కార్యదర్శి స్పందించారు. కాలేజీల గుర్తింపు కోసం దరఖాస్తు గడువును పలుమార్లు పెంచడంపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వ సూచనతోనే గడువును జూన్ 20 వరకు పెంచినట్లు చెప్పారు. వెబ్సైట్లో కాలేజీల వివరాలు.. గుర్తింపునకు అర్హతలేని కాలేజీల వివరాలను బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఈ నెల 20 వరకు గుర్తింపు గడువు ఉన్నందున జూన్ 21 నాటికి వెబ్సైట్లో అర్హత పొందిన, అర్హత పొందని కాలేజీల వివరాలు అందుబాటులో ఉంచుతామన్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా చిల్డ్రన్స్ హోం: ఇద్దరి అరెస్ట్
మల్కాజ్గిరి: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న చిల్డ్రన్స్ హోంపై బాలల సంరక్షణ అధికారులు దాడి చేశారు. మేడ్చల్‌జిల్లా మేడిపల్లి మండలం పర్వతపురంలో బాలల సంరక్షణ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. భార్యాభర్తలిద్దరు చిల్డ్రన్స్ హోమ్ నడుపుతున్నట్లు గుర్తించారు. జువైనల్ చట్టంలో ఉండాల్సిన నిబంధనలు కాని, చైల్డ్ వెల్ఫేర్ సంస్థ అనుమతులు కాని లేకుండా భార్యాభర్తలిద్దరు గుడ్‌విల్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అనే పేరుతో ఈ చిల్డ్రన్స్ హోమ్ నడుపుతున్నారని మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ తెలిపారు. దీంతో కడప జిల్లాకు చెందిన సంజీవయ్య, సులోచన దంపతులను అరెస్ట్ చేశామన్నారు. చిన్న పిల్లలతో మత ప్రార్ధనలు చేయిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులపై ఐపీసీ 342, 370, 153, (a),రెడ్ విత్ 120 (b) కింద కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. -
కాకినాడలో బలవంతపు కు.ని. ఆపరేషన్
-
ఇదెక్కడి న్యాయం?
– అనుమతి లేకుండానే పొలాల్లో విద్యుత్ స్తంభాలు - రైతులకు పరిహారం ఇవ్వకుండా మొండిచేయి – సుజ్లాన్ గాలిమరల కంపెనీ ఇష్టారాజ్యం – బాధిత రైతుల ఆవేదన గాలిమరల కంపెనీ ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. రైతుల నుంచి ఎటువంటి అనుమతీ తీసుకోకుండానే పొలాల్లో విద్యుత్ స్తంభాలు పాతేస్తోంది. ఇదేమని అడిగితే పోలీసులను ఉసిగొలుపుతోంది. న్యాయం చేయాల్సిన పోలీసులు కంపెనీ నిర్వాహకులకే వత్తాసు పలుకుతున్నారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోతోంది. చేసేది లేక బాధిత రైతులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. - అనంతపురం అర్బన్ రామగిరి మండలం పేరూరులో సుజ్లాన్ కంపెనీ గాలి మరల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ని ఫీడర్‌కు పంపేందుకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తోంది. పట్టా భూముల్లో వాటి యజమానుల అనుమతి తీసుకోకుండా కంపెనీ నిర్వాహకులు విద్యుత్ స్తంభాలు పాతుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక విద్యుత్ స్తంభాన్ని పొలంలో ఏర్పాటు చేసినందుకు రూ.60 వేలు, రెండు స్తంభాలు ఏర్పాటు చేస్తే రూ.1.20 లక్షలు సదరు రైతుకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా రైతులకు డబ్బు ఇవ్వకుండానే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తోంది. కొందరికి మాత్రం ఒక స్తంభానికి రూ.5 వేలు చొప్పున ఇస్తోంది. యజమానులు అనుమతి తీసుకోకనే... పేరూరులోని ఈశ్యరయ్యకు చెందిన సర్వే నంబరు 65–3బీలోని ఆరు ఎకరాలు, రామాంజికి చెందిన 64–2బీలో 4.79 ఎకరాలు, తిమ్మక్కకు చెందిన 75–3బీలో 8.33 ఎకరాలు, కేసీ మల్లికార్జునకు చెందిన సర్వే నంబరు 39–2బీ/5బీలో 4 ఎకరాల భూమిలో రైతుల అనుమతి లేకుండానే విద్యుత్ స్తంభాలు పాతారు. తమ గోడుని తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్‌కి చెప్పుకున్నా నాయ్యం జరగలేదని బాధితులు వాపోయారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లినా అదే పరిస్థితి ఉంటోందని, కనీసం కేసు కూడా తీసుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. పైపెచ్చు కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందికి గురిచేస్తున్నారని చెబుతున్నారు. ‘రైతులకు అన్యాయం చేస్తున్నారు’ అనుమతి లేకుండా పొలాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి రైతులకు గాలిమరల కంపెనీ అన్యాయం చేస్తోందని బాధిత రైతు కె.సి.మల్లికార్జున, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.చిన్నపెద్దన్న, రామగిరి మండల కన్వీనర్ నాగరాజు అన్నారు. పొలాలు తమవి కావంటూ విచారణ చేసిన పోలీసు అధికారులు నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసిందన్నారు. వాస్తవంగా తమ భూములు పెద్ద ఆస్తి అని, 1బీ, వెబ్‌ల్యాండ్‌లో కూడా తమ పేరిటే ఉన్నాయన్నారు. న్యాయం చేయాలని కోరితే పోలీసులు కూడా కంపెనీకి అనుకూలంగా వ్యహరిస్తే కేసు కూడా తీసుకోలేదన్నారు. ఇదేమని అడిగితే ఇబ్బంది పెట్టారని, దీంతో మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించామన్నారు. -
జోరుగా మట్టి దందా
పర్యావరణానికి పట్టిన చీడ పట్టించుకోని అధికారులు మెదక్ రూరల్: మెదక్ మండలంలోని హవేళి ఘణాపూర్ గ్రామశివారులో నుండి సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు మట్టిని జోరుగా తరలించారు. జేసిబిలతో తవ్వి టిప్పర్లలో జోరుగా తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి. గ్రామస్తుల సమాచారం మేరకు సోమవారం రాత్రి 7గంటల ప్రాంతంలో హవేళి ఘణాపూర్ గ్రామ వీఆర్ఓప్రభు అక్కడికి చేరుకొని ఆరు టిప్పర్లను అడ్డుకొని అక్కడి నుండి పంపించేయడం పట్ల గ్రామస్తులు మండిపడ్డారు. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే సంబంధిత వాహనాలను సీజ్చేయాల్సిందిపోయి వారికే వత్తాసు పలుకుతున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై తహశీల్దార్ అమినొద్దీన్ను సాక్షి వివరణ కోరగా పట్టా భూమి నుండే మట్టిని తరలిస్తున్నప్పటికీ అనుమతులు తీసుకోకపోవడంతో నిలిపివేశామన్నారు. -
అనుమతికి మించి !
నగరంలో వెలుస్తున్న నిర్మాణాలు ర్యాంపులతో రోడ్డు ఆక్రమణ సెల్లార్లు సైతం అద్దెలకు ! పట్టించుకోని అధికారులు కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్లో భవన యజమానులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఏటా వందల సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తుండగా..70 శాతం నిబంధనులకు విరుద్ధంగానే సాగుతున్నాయి. సెట్‌బ్యాక్ మొదలుకొని సెల్లార్లు, అనుమతి లేని అంతస్తులు కళ్ల ఎదుటే నిర్మిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీ నుంచి తీసుకున్న అనుమతికి నిర్మాణాలకు సంబంధం ఉండడం లేదు. సెల్లార్లకు అనుమతే లేదు కరీంనగర్ నగరపాలక సంస్థలో అసలు సెల్లార్లకు అనుమతులే లేవు. అయినా 100 గజాల స్థలంలోనూ సెల్లార్ నిర్మిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో 70 శాతానికి పైగా నిర్మాణాలకు సెల్లార్లు తీస్తున్నారు. పైగా సెమీ సెల్లార్ పేరుతో అధికారుల కళ్లకు ‘మామూలు’గానే గంతలు కడుతున్నారు. సెల్లార్ నిర్మించినా పార్కింగ్ చేసిన దాఖలాలు లేవు. వాటిని కూడా వ్యాపార అవసరాలు అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. పెద్దపెద్ద వాణిజ్య సముదాయాలకు కూడా సెల్లార్ పార్కింగ్లు లేవు. ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్ ఎదుట రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు సైతం అప్పుడప్పుడు హడావిడి చేస్తూ నోటీసులతో చేతులు దులుపుకుంటున్నారు. పెంట్‌హౌస్‌లపై చర్యల్లేవు భవన నిర్మాణాల్లో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. స్థలాన్ని బట్టి సిల్టుతో కలుపుకొని జీ+1 నుంచి జీ+4 వరకు అనుమతులు ఇస్తుంటారు. 100 గజాలలోపు స్థలం ఉంటే జీ+1, 200 గజాలపైన ఉంటే జీ+2, 500 గజాల స్థలం ఉంటే జీ+4 వరకు అనుమతులు మంజూరు చేస్తారు. అయితే భవనం చిన్నదైనా పెద్దదైనా అసలుకు కొసరు ఉండాల్సిందే అన్నట్లు నిర్మాణదారులు తయారయ్యారు. రెండు నుంచి నాలుగు అంతస్తుల వరకు ఉండే భవనాల్లో తప్పనిసరిగా పెంట్‌హౌస్ నిర్మిస్తున్నారు. అధికారులు అడ్డుకుంటే అయితే రాజకీయ పలుకుబడి, లేదంటే డబ్బు ఎరజూపి కాపాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ సెల్లార్లు, పెంట్‌హౌస్‌లపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. చర్యలు చేపడతాం – రవీందర్, ఏసీపీ నగరంలో సెల్లార్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్న పలు భవన యజమానులకు గతంలో నోటీసులు జారీ చేశాం. కొందరి నుంచి సమాధానం వచ్చింది. సెల్లార్లకే ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న పెంట్‌హౌస్‌లపై చర్యలు చేపడతాం. ఆన్లైన్ ద్వారా భవన అనుమతుల కోసం రెండు నెలల్లో 51 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి అనుమతులు ఇస్తాం. ఎలాంటి తప్పులు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటాం. -
విమానాశ్రయంలో అనుమతి లేని కార్ల పట్టివేత
శంషాబాద్: అనుమతి లేకుండా విమానాశ్రయంలోకి నడిపిస్తున్న 9 కార్లను గురువారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వాహనాలకు ఎలాంటి అనుమతి లేకున్నా.. డ్రైవర్లు ప్రయాణికుల నుంచి అదనంగా చార్జీలు వసూలు చేస్తూ అనుమతితో నడుస్తున్న ట్రావెల్స్ నిర్వాహకులకు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనదారులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. -
జోరుగా మినరల్ వాటర్ వ్యాపారం
పరిగి, న్యూస్‌లైన్: లాభాల వేటలో వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. వేసవిలో నీటికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీంతో బరిలోకి దిగిన వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛమైన మినరల్ నీరంటూ 20 లీటర్ల డ బ్బాకు రూ. 15 వసూలు చేస్తున్నారు. అయితే ఈ నీటి తయారీకి కనీస ప్రమాణాలు పాటించకున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పరిగి పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుండటం, కొత్తగా పలు విద్యా సంస్థలు కూడా వెలియడంతో జనాభా కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో పట్టణంలో మినరల్ వాటర్ వినియోగం పెరిగిపోయి వ్యాపారులకు కాసుల పంటపండిస్తోంది. పరిగి పట్టణంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆరు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాంట్ నుంచి రోజుకు 3వేల లీటర్ల వరకు నీటిని విక్రయిస్తున్నారు. ఆటోలు, ఇతర వాహనాల ద్వార డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే నీటిని సరఫరా చేసే కంపెనీ తమ బాటిళ్లపై కంపెనీ స్టిక్కర్ అతికించాలి. కాని పరిగిలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లకు చెందిన ఏ ఒక్కరూ బాటిళ్లకు స్టిక్కర్లు అతికించడం లేదు. ఇంటి దగ్గరకే నీరు వస్తుండటంతో ప్రజలు కూడా ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు. శుద్ధి చేసిన నీటిలో క్రిమికీటకాలు రాకుండా ఓ రసాయన పదార్థాన్ని కలుపుతారు. నీటిని ఫిల్టర్ చేశాక తిరిగి వాటిలో సమపాల్లలో మినరల్స్ కలపాల్సి ఉంటుంది. వీటని సంబంధిత కంపెనీలు ఆచరించటం లేదు. అంతేకాకుండా కనీసం బాటిళ్లను కూడా శుభ్రపర్చకపోవడంతో అవి నాచు పట్టి కనిపిస్తున్నాయి. గతంలో ఈ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఎవరూ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తేల్చారు. అయితే ఆ తర్వాత మాత్రం సదరు కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేవు.... పరిగి పట్టణంలో ఏర్పాటు చేసిన ఐదు మినరల్ వాటర్ ప్లాంట్లకు ఎలాంటి అనుమతులు లేవు. గ్రామ పంచాయతీ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు. తదుపరి పంచాయతీ నుంచి ప్లాంటును నిర్మించడానికి, నీటిని విక్రయించడానికి ఎలాంటి అనుమతులు పొందలేదు. రెండు ప్లాంట్లకు తప్పా మిగితావాటికి ఐఎస్ఐ సర్టిఫికెట్లు కూడా లేవు. ఐఎస్ఐ సర్టిఫికెట్ పొందాలంటే అన్ని రకాల పరీక్షలను ప్లాంటు ఎదుర్కొవాల్సి ఉంటు ంది. దీంతో ప్లాంట్ల నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నారు. నామమాత్రపు అనుమతులు తీసుకున్నవారు కూడా రెన్యువల్ చేసుకోవాల్సిన విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని, స్వచ్ఛమైన నీటిని పంపిణీ చేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
యథేచ్ఛగా అక్రమ రవాణా
తిరువూరు, న్యూస్‌లైన్ : జిల్లా సరిహద్దు ప్రాంతమైన తిరువూరు మీదుగా ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యం వేరుశనగ విత్తనాల లారీలు మహారాష్ట్రకు తరలిపోతున్నా రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 5న అగిరిపల్లి నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు రూ.18లక్షల విలువైన వేరుశనగ విత్తనాల సంచులు లారీలో తరలిస్తుండగా తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమకు రూ.18వేల మార్కెట్‌సెస్ చెల్లిస్తే లారీని వదిలేస్తామని ఏఎంసీ అధికారులు చెప్పగా, ఈ చెల్లింపులో జాప్యం జరగడంతో వ్యవసాయశాఖ ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు 6ఏ కేసు నమోదు చేశారు. నిజామాబాద్‌లోని సూపర్‌సీడ్స్ పేరుతో వారం తిరగకుండానే గురువారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మళ్లీ ఆగిరిపల్లి నుంచి నాందేడ్‌కు మరో రూ.18.70 లక్షల విలువైన వేరుశనగ విత్తనాలు రవాణా చేస్తుండగా తిరువూరు రాజుపేటలోని ఏఎంసీ చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు. ఈ విత్తనాల తరలింపునకు ప్రభుత్వపరంగా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఏఎంసీ అధికారులు రూ.18వేల మార్కెట్ సెస్ మాత్రమే వసూలు చేసి లక్షలాది రూపాయల విలువైన అక్రమ విత్తనాల రవాణాకు అనుమతించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాము మార్కెట్ సెస్ వసూలు చేసి వేరుశనగ లోడు లారీని వదిలేశామని, అది అక్రమ తరలింపా, సక్రమమా అనే విషయం తమకు సంబంధం లేదని తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్చార్జి కార్యదర్శి రంగారావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం... తిరువూరు మీదుగా వేరుశనగ విత్తనాలు తరచూ అక్రమంగా మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారులు పట్టించుకోవట్లేదు. గతంలో రెవెన్యూ, వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టులు తిరువూరులోని జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసి అక్రమరవాణాను అరికట్టారు. అయితే పదేళ్ల క్రితం ఈ చెక్‌పోస్టులను తొలగించారు. పౌరసరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించకపోవడంతో అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది. -
ఇష్టారాజ్యంగా టపాసుల విక్రయం
సాక్షి, మంచిర్యాల : దీపావళి టపాసుల విక్రయాలు పలు శాఖల అధికారులపై కాసుల వర్షం కురిపించింది. అనుమతి లేకుండానే ఏర్పాటైన స్టాళ్లను తొలగించాల్సిన రెవెన్యూ అధికారులు ‘మామూలు’గా తీసుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అనుమతి పొందిన తర్వాతే స్టాళ్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిన రెవెన్యూ అధికారులు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో మూడ్రోజుల క్రితమే జిల్లాలో టపాసుల స్టాళ్లు వెలిశాయి. తూర్పు జిల్లాలో.. తూర్పు జిల్లా పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూరులోని బహిరంగ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 54 షాపులు జాయింట్ కలెక్టర్ అనుమతి లేకుండానే కొనసాగుతున్నాయి. మంచిర్యాలలోని కాలేజీ రోడ్డు ప్రాంతంలో 16 షాపులు, బెల్లంపల్లిలోని తిలక్‌స్టేడియంలో 20, కాగజ్‌నగర్ గాంధీచౌక్‌లో 8, ఆసిఫాబాద్‌లో 9, చెన్నూరులో 2 దుకాణాలకు జాయింట్ కలెక్టర్ అనుమతి లభించలేదు. నిబంధనల ప్రకారం.. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, మున్సిపాలిటీలకు రూ.500 చలానా చెల్లించి.. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలి. తర్వాత రెవెన్యూ అధికారుల ద్వారా జాయింట్ కలెక్టర్ వద్దకు సంబంధిత ఫైలు పంపి వారి అనుమతి పొందిన తర్వాతే టపాసుల షాపులు నిర్వహించుకోవాలి. ఈ నెల 23న షాపు యజమానులు అన్ని శాఖల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ పొంది రెవెన్యూ అధికారులకు అందించారు. ఇంతవరకు షాపు నిర్వహణకు సంబంధించిన ఫైళ్లపై జాయింట్ కలెక్టర్ సంతకం కాలేదని విశ్వసనీయ సమాచారం. అయినా షాపు యజమానులు మాత్రం నిబంధనలు ఉల్లంఘించి టపాసులు విక్రయిస్తున్నారు. మందలింపుతోనే సరి! అనుమతి లేని విషయం తెలుసుకున్న స్థానికులు కొందరు శుక్రవారం మంచిర్యాల రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో మంచిర్యాలలోని కాలేజీ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్దకు వెళ్లిన స్థానిక రెవెన్యూ సిబ్బంది విక్రయాలు నిలిపేయాలని సున్నితంగా మందలించి తిరిగొచ్చేశారు. కానీ సిబ్బంది వెనుదిరిగిన వెంటనే యజమానులు అమ్మకాలు మళ్లీ ప్రారంభించారు. మరోపక్క.. నిబంధనల ప్రకారం టపాసుల షాపులు జనావాసాల్లో కాకుండా ఊరి బయట, జనావాసాల నుంచి దూరంలో ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాంతాల్లో నీళ్లు, ఫైర్ ఎక్సెంటషన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్కడా అలాంటి వసతులు కనిపించలేదు. ‘రెవెన్యూ’ అనుమతి ఉందో లేదో? ఈ విషయమై మంచిర్యాల అగ్నిమాపక శాఖ అధికారి, రాజన్నను వివరణ కోరగా.. మంచిర్యాలలో 16 షాపులకు గానూ నిర్వాహకులు రూ.500ల చలానాలు తమకు కట్టారని తెలిపారు. అయితే రెవెన్యూ శాఖ అధికారుల అనుమతి ఉందా లేదా అనేది తమకు తెలియదని వివరణ ఇచ్చారు. అలాగే ఆర్డీవో చక్రధర్‌రావు వివరణకు సంప్రదించగా ఆయన అందుబాటులో లేరు.