మల్కాజ్‌గిరి: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న చిల్డ్రన్స్ హోంపై బాలల సంరక్షణ అధికారులు దాడి చేశారు. మేడ్చల్‌జిల్లా మేడిపల్లి మండలం పర్వతపురంలో బాలల సంరక్షణ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. భార్యాభర్తలిద్దరు చిల్డ్రన్స్ హోమ్ నడుపుతున్నట్లు గుర్తించారు. జువైనల్ చట్టంలో ఉండాల్సిన నిబంధనలు కాని, చైల్డ్ వెల్ఫేర్ సంస్థ అనుమతులు కాని లేకుండా భార్యాభర్తలిద్దరు గుడ్‌విల్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అనే పేరుతో ఈ చిల్డ్రన్స్ హోమ్ నడుపుతున్నారని మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ తెలిపారు. దీంతో కడప జిల్లాకు చెందిన సంజీవయ్య, సులోచన దంపతులను అరెస్ట్ చేశామన్నారు. చిన్న పిల్లలతో మత ప్రార్ధనలు చేయిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులపై ఐపీసీ 342, 370, 153, (a),రెడ్ విత్ 120 (b) కింద కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment