బాహుబలి సమోసా.. తిన్నారంటే రూ. 51,000 మీవే.. కానీ ఒక్క షరతు! | You Can Win Rs 51,000 If You Eat This 8 Kg Bahubali Samosa in 30 Minutes | Sakshi
Sakshi News home page

Bahubali Samosa Challenge: తిన్నారంటే రూ. 51,000 మీవే.. కానీ ఒక్క షరతు!

Published Fri, Jul 8 2022 3:50 PM | Last Updated on Fri, Jul 8 2022 4:59 PM

You Can Win Rs 51,000 If You Eat This 8 Kg Bahubali Samosa in 30 Minutes - Sakshi

సమోసా.. భారతీయులు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్‌లో మొదటి వరుసలో ఉంటుంది. స్నేహితులతో సరదాగా బేకరీకి వెళ్లిన, ఆఫీస్‌లో క్యాంటీన్‌కు వెళ్లినా ఆర్డర్‌ చేసే ఫుడ్‌ ఐటమ్స్‌లో సమోసా తప్పక ఉంటుంది. ఆలు, ఆనియన్‌, కార్న్‌ సమోసా.. పేర్లు ఏవైనా చాలా మందికి ఇది ఫేవరెట్‌ స్నాక్‌. తాజాగా ఉత్తర ప్రదేవ్‌లోని మీరట్‌లో బహుబలి సమోసా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అసలు దీని స్టోరి ఏంటో తెలుసుకుందాం

మీరట్‌లోని లాల్‌కుర్తి బజార్‌లో కౌశల్ స్వీట్స్ పేరుతో షాపు నిర్వహిస్తున్న శుభం.. బహుబలి సమోసా పేరుతో ఫుడ్‌ చాలెంజ్‌ విసిరారు. అది మనం తినే సాధారణ సమోసాల్లా ఉండదు. ఏకంగా 8 కేజీల బరువు ఉంటుంది. ఇత పెద్ద సమోసాను తిన్న వారికి రూ. 51,000 అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ  సమోసాను కేవలం 30 నిమిషాల్లో మాత్రమే పూర్తి చేయాలి.
చదవండి: భారీ వర్షాలతో జనాలు బెంబేలెత్తిపోతుంటే.. అతను మాత్రం భలే ఎంజాయ్‌ చేస్తున్నాడు

ఈ విషయంపై షాప్‌ యజమాని మాట్లాడుతూ.. నిత్యం ఏదో కొత్తదనాన్ని తీసుకురావాలనే ఉద్ధేశ్యంతోనే సమోసా చాలెంజ్‌ను విసురుతున్నట్లు  తెలిపారు. అందుకే బాహుబలి సమోసాను తయారు చేసినట్లు పేర్కొన్నారు. ముందుగా నాలుగు కిలోల సమోసాతో చాలెంజ్‌ ప్రారంభించామని ఇప్పుడు 8 కిలోలకు  పెంచినట్లు వెల్లడించారు. ఎనిమిది కిలోల సమోసా ధర దాదాపు రూ. 1,100 ఉంటుందని, ఇందులో ఆలు, చీజ్‌, డ్రరై ఫ్రూట్స్‌ నింపినట్లు తెలిపారు. అంతేగాక  త్వరలో 10 కిలలో సమోసా చేయనున్నట్లు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

మీకు ఓ విషయం చెప్పలేదు కదూ.. ఇప్పటి వరకు ఈ చాలెంజ్‌ను చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఎవరూ గెలవలేదట. ఆరగంటలో తినలేకపోయి ఓడిపోయారట. మరి మీరు కూడా ప్రయత్నించాలనుకుంటే మీరట్‌ వెళ్లాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement