వాషింగ్టన్: టైడ్... అవాక్కయారా... అంటూ వచ్చే యాడ్ మనందరికీ సుపరిచితమే.. మీ దుస్తుల్లో మురికిని తొలగించి, తెల్లగా చేసే ఈ డిటర్జెంట్ ఇప్పుడు మీ ఇంట్లోనే కాకుండా, అంతరిక్షంలో కూడా వ్యోమగాములు ధరించే దుస్తుల్లో కూడా మురికిని తొలగించనుంది. భవిష్యత్తులో టైడ్ డిటర్జెంట్ మెరుపు శుభ్రతతో.. వ్యోమగాములను కూడా అవాక్కయేలా చేయనుంది. అందుకోసం టైడ్ డిటర్జెంట్‌ను ఉత్పత్తి చేస్తోన్న కంపెనీ ప్రోక్టర్ అండ్ గాంబుల్(పీ అండ్ జీ) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
అంతరిక్షంలో ఉతకడం కష్టం...!
అంతరిక్షంలో నీటికి ఎక్కువగా కొరత ఉంటుంది. దీంతో వ్యోమగాములు ధరించిన దుస్తులను వాష్ చేయరు. వాటిని స్పేస్ స్టేషన్‌లో ఒక కవర్‌లో ఉంచి తిరిగి కొన్ని రోజుల తరువాత ధరిస్తారు. ఎక్కువగా మురికి అయితే వాటిని అంతరిక్షంలోనే వదులుతారు. దీంతో టన్నుల కొద్ది దుస్తులు వృథా అవుతాయి. కాగా ప్రస్తుతం పీ అండ్ జీ సంస్థ అంతరిక్షంలో వ్యోమగాములు ధరించే దుస్తుల మురికిని తొలగించడానికి ఒక డిటర్జెంట్ ఫార్ములాపై పనిచేస్తోంది. ఈ డిటర్జెంట్ ఫార్ములాతో సుమారు 15 లీటర్ల నీరును వాడి దుస్తుల మురికి తొలగించవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నీటి వాడకాన్ని ఇంకా తగ్గించి దుస్తుల మురికి తీసే డిటర్జెంట్‌పై పీ అండ్ జీ పనిచేస్తోంది. అంతేకాకుండా అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేని చోట డిటర్జెంట్ ఏవిధంగా పనిచేస్తాయో విషయంపై నాసా శాస్త్రవేత్తలు పరిశోధించనున్నారు.
కొత్త డిటర్జెంట్ ఫార్ములాతో భారీగా నీరు పొదుపు..
సాధారణంగా డిటర్జెంట్‌తో మురికిని తొలగించడానికి సుమారు 70 లీటర్ల నీరు అవసరమౌతుందని పీ అండ్ జీ కంపెనీ తెలిపింది. వ్యోమగాములకు తయారుచేసే డిటర్జెంట్‌తో భూమ్మీద కూడా అతి తక్కువ నీటితో దుస్తుల మురికిని తీయవచ్చునని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా నీటిని పొదుపు చేయవచ్చునని పేర్కొంది. నాసా అంగారక గ్రహంపైకి మానవసహిత అంతరిక్షనౌకలను ప్రయోగించాలని చూస్తోంది. ప్రయోగ సమయంలో వ్యోమగాములు సుదీర్ఘకాలం పాటు ప్రయాణించాలి. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అంతరిక్షనౌకలో దుస్తులను తీసుకెళ్లడం అంతా సులువుకాదు. దీంతో నాసా ప్రముఖ డిటర్జెంట్ కంపెనీ పీ అండ్ జీతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే టైడ్ డిటర్జెంట్ వ్యోమగాములను కూడా అవ్వాకయ్యేలా చేస్తుంది.
వ్యోమగాములను సైతం అవాక్కయేలా చేయనున్న టైడ్!
Published Sun, Jun 27 2021 7:40 PM | Last Updated on Sun, Jun 27 2021 8:08 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment