P & G
-
ప్రొక్టెర్ అండ్ గ్యాంబుల్స్ అతి పెద్ద కర్మాగారం తెలంగాణలో
ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్స్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)లో దిగ్గజ కంపెనీ ప్రొక్టెర్ అండ్ గ్యాంబుల్స్ (పీ అండ్ జీ)కి ఇండియాలో అతి పెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కి తెలంగాణ వేదికగా మారింది. ఈ సంస్థకు చెందిన ప్లాంట్‌ను ఇటీవల విస్తరించారు. దీంతో ఇండియాలోనే పీ అండ్ జీకి అతి పెద్ద సెంటర్‌గా తెలంగాణ నిలిచింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ఈ సంస్థకు ప్లాంట్ ఉంది. ఇటీవల లిక్విడ్ డిటర్జెంట్ తయారీ కోసం ఈ ప్లాంటును విస్తరించారు. దీంతో 170 ఎకరాల్లోక సువిశాల కర్మాగారంగా పీ అండ్ జీ అవతరితంచింది. నూతనంగా నిర్మించిన డిటర్జెంట్ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్ మే 2న ఆవిష్కరించారు. పీ అండ్ జీ నుంచి ఏరియల్, టైడ్ వంటి డిటర్జెంట్ లిక్విడ్స్, పౌడర్లు మార్కెట్లో ఉన్నాయి. 2014లో పీ అండ్ జీ ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయగా తాజాగా రూ.200 కోట్లతో దాన్ని మరింతగా విస్తరించింది. ఈ సిటీలో రేడియంట్ ఫ్యాక్టరీ నగర శివారల్లో ఈ సిటీలో రేడియంట్ సంస్థ తమ ఫ్యాక్టరీని విస్తరించింది. వంద కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విస్తరణ పనులు చేపడుతోంది. దీని వల్ల కొత్తగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ విస్తరణతో ఫ్యాక్టరీ తయారీ సామర్థ్యం ఏడాదికి నాలుగున్నర లక్షల టీవీ సెట్లకు చేరుకుంది. రాబోయే రోజుల్లో దేశంలో తయారయ్యే టీవీల్లో నాలుగో వంతు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి కానున్నాయి. చదవండి: ట్రూజెట్‌లో విన్‌ఎయిర్‌కు మెజారిటీ వాటాలు -
వ్యోమగాములను సైతం అవాక్కయేలా చేయనున్న టైడ్!
వాషింగ్టన్: టైడ్... అవాక్కయారా... అంటూ వచ్చే యాడ్ మనందరికీ సుపరిచితమే.. మీ దుస్తుల్లో మురికిని తొలగించి, తెల్లగా చేసే ఈ డిటర్జెంట్ ఇప్పుడు మీ ఇంట్లోనే కాకుండా, అంతరిక్షంలో కూడా వ్యోమగాములు ధరించే దుస్తుల్లో కూడా మురికిని తొలగించనుంది. భవిష్యత్తులో టైడ్ డిటర్జెంట్ మెరుపు శుభ్రతతో.. వ్యోమగాములను కూడా అవాక్కయేలా చేయనుంది. అందుకోసం టైడ్ డిటర్జెంట్‌ను ఉత్పత్తి చేస్తోన్న కంపెనీ ప్రోక్టర్ అండ్ గాంబుల్(పీ అండ్ జీ) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అంతరిక్షంలో ఉతకడం కష్టం...! అంతరిక్షంలో నీటికి ఎక్కువగా కొరత ఉంటుంది. దీంతో వ్యోమగాములు ధరించిన దుస్తులను వాష్ చేయరు. వాటిని స్పేస్ స్టేషన్లో ఒక కవర్లో ఉంచి తిరిగి కొన్ని రోజుల తరువాత ధరిస్తారు. ఎక్కువగా మురికి అయితే వాటిని అంతరిక్షంలోనే వదులుతారు. దీంతో టన్నుల కొద్ది దుస్తులు వృథా అవుతాయి. కాగా ప్రస్తుతం పీ అండ్ జీ సంస్థ అంతరిక్షంలో వ్యోమగాములు ధరించే దుస్తుల మురికిని తొలగించడానికి ఒక డిటర్జెంట్ ఫార్ములాపై పనిచేస్తోంది. ఈ డిటర్జెంట్ ఫార్ములాతో సుమారు 15 లీటర్ల నీరును వాడి దుస్తుల మురికి తొలగించవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నీటి వాడకాన్ని ఇంకా తగ్గించి దుస్తుల మురికి తీసే డిటర్జెంట్పై పీ అండ్ జీ పనిచేస్తోంది. అంతేకాకుండా అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేని చోట డిటర్జెంట్ ఏవిధంగా పనిచేస్తాయో విషయంపై నాసా శాస్త్రవేత్తలు పరిశోధించనున్నారు. కొత్త డిటర్జెంట్ ఫార్ములాతో భారీగా నీరు పొదుపు.. సాధారణంగా డిటర్జెంట్‌తో మురికిని తొలగించడానికి సుమారు 70 లీటర్ల నీరు అవసరమౌతుందని పీ అండ్ జీ కంపెనీ తెలిపింది. వ్యోమగాములకు తయారుచేసే డిటర్జెంట్‌తో భూమ్మీద కూడా అతి తక్కువ నీటితో దుస్తుల మురికిని తీయవచ్చునని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా నీటిని పొదుపు చేయవచ్చునని పేర్కొంది. నాసా అంగారక గ్రహంపైకి మానవసహిత అంతరిక్షనౌకలను ప్రయోగించాలని చూస్తోంది. ప్రయోగ సమయంలో వ్యోమగాములు సుదీర్ఘకాలం పాటు ప్రయాణించాలి. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అంతరిక్షనౌకలో దుస్తులను తీసుకెళ్లడం అంతా సులువుకాదు. దీంతో నాసా ప్రముఖ డిటర్జెంట్ కంపెనీ పీ అండ్ జీతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే టైడ్ డిటర్జెంట్ వ్యోమగాములను కూడా అవ్వాకయ్యేలా చేస్తుంది. చదవండి: మార్స్ పై రోవర్ నిజంగానే సెల్ఫీ తీసుకుందా..! -
పెట్టుబడుల పెంపుపై దృష్టి...
ప్రధాని నరేంద్రమోదీతో న్యూఢిల్లీలో మంగళవారం ప్రోక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) ప్రెసిడెంట్ అండ్ సీఈఓ డేవిడ్ టేలర్ నేతృత్వంలోని కంపెనీ అత్యున్నత స్థాయి బృందం సమావేశమయ్యింది. ప్యాకేజ్డ్ గూడ్స్ రంగంలో అంతర్జాతీయ దిగ్గజంగా పేరున్న పీ అండ్ జీ... భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి డేవిడ్ టేలర్ ఈ సందర్భంగా ప్రధానితో చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా దేశంలో శానిటరీ వేస్ట్ రీసైక్లింగ్ టెక్నాలజీ వినియోగం వృద్ధిపై కంపెనీ దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి ప్రభుత్వ కార్యక్రమాలు తమను ఆకర్షిస్తున్నట్లు డేవిడ్ టేలర్ పేర్కొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2013లో సంస్థ భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది.