ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచే ఓటు వేస్తామని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతావిలియమ్స్,బుచ్‌విల్‌మోర్‌తెలిపారు. అంతరిక్షంనుంచిసునీత,విల్‌మోర్ శుక్రవారం(సెప్టెంబర్13)మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ‘పౌరులుగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యం. అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నా. ఐఎస్‌ఎస్‌లో ఉండి నా కుటుంబాన్ని, నా రెండు కుక్కలను చాలా మిస్సవుతున్నా.నాకే కాదు ఇది నా కుటుంబ సభ్యులకు కఠినమైన సమయం. అయితే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారు’అని సునీత అన్నారు.
మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను తన బ్యాలెట్ రిక్వెస్ట్ పంపినట్లు చెప్పారు.జూన్5న బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత, విల్‌మోర్‌లు సాంకేతిక కారణాల వల్ల షెడ్యూల్ ప్రకారం భూమికి తిరిగి రాలేకపోయారు.వీరిని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ మాత్రం సెప్టెంబర్ 6న భూమిపై దిగింది. ఇద్దరు వ్యోమగాములను స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్ 2025 ఫిబ్రవరిలో భూమికి తీసుకువస్తుందని నాసా వర్గాలు చెబుతున్నాయి.
ఆబ్సెంటీ ఓటింగ్ విధానంలో..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ప్రత్యక్షంగా ఓటు వేయలేని వారి కోసం ఆబ్సెంటీ ఓటింగ్‌తో పాటు ఓట్ బై మెయిల్ విధానాలు అందుబాటులో ఉన్నాయి.వీటిలో ఆబ్సెంటీ ఓటింగ్ విధానంలో అర్హత కలిగిన ఓటర్లు బ్యాలెట్ రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఓట్ బై మెయిల్ విధానం అందుబాటులో ఉంది.
ఈ విధానంలో రిజిస్టర్ ఓటర్లందరికీ ఎన్నికల మందే మెయిల్ పంపుతారు. దీని ద్వారా పౌరులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పోలింగ్ తేదీ కంటే ముందుగానే తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.
ఇదీ చదవండి.. అంతరిక్షం నుంచి ఐక్య గీతం
Comments
Please login to add a commentAdd a comment