
ఎలన్ మస్క్ గురించి తెలియని వారెవరుండరు బహుశా...! నిజజీవితంలో ప్రజలు ఎలన్‌మస్క్‌ను మార్వెల్ సూపర్ హీరో క్యారెక్టర్ ది ఐరన్ మ్యాన్‌తో పోలుస్తుంటారు. టెస్లా రాకతో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో గణనీయమైన మార్పులకు కారణమయ్యాడు ఎలన్ మస్క్. సుమారు 100 మిలియన్ డాలర్లతో 2002లో స్పేస్‌ఎక్స్ స్థాపించి అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయనాలను లిఖించాడు.
చదవండి: కంపెనీల మధ్య పోటాపోటీ..! నిన్న అమితాబ్ బచ్చన్..నేడు రణ్‌వీర్‌సింగ్..!
100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి...
తాజాగా ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ విలువ సుమారు 100 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలో అత్యంత విలువైన రెండో ప్రైవేట్ కంపెనీగా స్పేస్‌ఎక్స్ నిలిచింది. స్పేస్ ఎక్స్ షేర్ విలువ ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే గణనీయంగా 33 శాతం మేర పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన మొదటి కంపెనీగా టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్ 140 బిలియన్ డాలర్లతో నిలిచింది.
స్పేస్ ఎక్స్ ఓ సంచలనం..!
స్పేస్ ఎక్స్‌ను స్థాపించి తొలి ప్రయోగంలో విఫలమైన ఎలన్ మస్క్ పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగి వెనుకడుగు వేయకుండా తన ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అంతరిక్ష రంగంలో స్పేస్‌ఎక్స్ ఓ సంచలనం. అతి తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలను చేయడంలో స్పేస్ ఎక్స్ పాత్ర ఎంతగానో ఉంది.
చదవండి: నాలుగు రోజుల్లో సుమారు రూ.20 వేల కోట్లు..!
Comments
Please login to add a commentAdd a comment