NASA It Would Land An Ice Seeking Rover On A Region Of The Moon - Sakshi
Sakshi News home page

Moon Site For Ice-Hunting: స్పేస్‌ఎక్స్‌ టూరిజంలా త్వరలో మూన్‌ టూరిజం

Published Tue, Sep 21 2021 10:25 AM | Last Updated on Tue, Sep 21 2021 4:42 PM

NASA It Would Land An Ice Seeking Rover On A Region Of The Moon - Sakshi

ప్రైవేట్‌ ఏజెన్సీ స్పేస్‌ఎక్స్‌ ‘ఇన్‌స్పిరేషన్‌4’.. చరిత్ర సృష్టించిన సంగతి తెలిసింది. ఆ సంఘటన మరువక ముందే నాసా చంద్రుని పై మనుష్యులను తీసుకువచ్చే ప్రణాళికలో భాగంగా సరికొత్త రోవర్‌ టెక్నాలజీతో సమగ్ర పరిశోధనలకు శ్రీకారం చుట్టింది.​ ఈ మేరకు చంద్రుని పై మానువుడి నివశించడానికీ యోగ్యమైనదేనా కాదా అనేదాని గురించి పరిశోధనలు చేసే క్రమంలో కొన్ని ఆసక్తి రేకెత్తించే పరిశోధనలు గురించి నాసా వివరిస్తోంది. అవేంటో చూద్దాం.

వాషింగ్టన్‌: చంద్రుని దక్షిణ ధృవంగా పిలచే పురాతన బిలం పైకి మంచు జాడను అన్వేషించే రోవర్‌ను 2023 కల్లా ల్యాండింగ్‌ చేయనున్నట్లు నాసా సోమవారం ప్రకటించింది. ఈ పురాతన బిలం దక్షిణ ధృవం వద్ద రెండు భారీ ఖగోళ శకలాలు ఢీ కొనడంతో ఏర్పడిందని నాసా ప్లానేటరీ డివిజన్‌ డైరక్టర్‌ లోరీ గ్లేజ్‌ వెల్లడించారు.

(చదవండి:  బైడెన్‌ కునికి పాట్లు!)

సౌర వ్యవస్థలో ఇది అత్యంత శీతల ప్రాంతం కాబట్టి ఇక్కడ మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉంటుందని అన్నారు. పైగా అక్కడ వాతవారణ పరిస్థితులు అస్థిరంగా ఉంటాయని చెబుతున్నారు. ఇంతవరకు చంద్రుని కక్ష్యలో పరిభ్రమించే సెన్సర్‌ ఉపగ్రహం సాయంతో దూరం నుంచే పరిశోధనలు చేసినట్లు పేర్కొంది. ఇక పై చంద్రుని ఉపరితలంపై  నేరుగా ఈ సరికొత్త టెక్కాలజీతో రూపొందించిన రోవర్‌ సాయంతో పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఈ రోవర్‌ చంద్రుని భూభాగంపై అనేక అడుగులు దిగువ వరకు రంధ్రలు చేసి మరింత సమగ్రంగా పరిశోధనలు చేస్తుందని గ్లేజర్‌ పేర్కొన్నారు. 

ఈ రోవర్‌ చంద్రుని ఉపరితలం పై మంచు నీరు జాడును నిర్థారించడమే కాక దీన్ని రాకెట్‌ ఇంధనంగా మార్చి అరుణ గ్రహంపై వెళ్లడానికి ఉపకరించే సమగ్ర సమన్వయ వ్యవస్థలా పనిచేయగలదని నాసా బావిస్తుందని అన్నారు. అరుణ గ్రహం భూమికి అతి చేరువలో రెండు లక్షల మైళ్లు లేదా 1.3 సెకన్ల కాంతి దూరంలో ఉందిని చెప్పారు. అంతేకాదు ఈ రోవర్‌ను ధృవ అస్థిర స్వయం పరిశోధన రోవర్‌ లేదా వైపర్‌గా పిలుస్తారని చెప్పారు. ఇది 50 గంటల వరకు పనచేయగలిగే బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉందని పైగా అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను కూడా తట్టుకునేలా రూపోందించినట్లు వెల్లడించారు. చార్జింగ్‌ కోసం సౌలార్‌ వ్యవస్థపై ఆధారపడుతుందని, పైగా సూర్యుడు ఎటువైపు ఉంటే అటూవైపుగా బ్యాటరీ ప్యానెల్‌ని మార్చుకుంటుందని పేర్కొన్నారు.

ఈ రోవర్‌ సాయంతో చంద్రుని ఉపరితలంపై ఏఏ ప్రాంతాల్లో మంచు నీరు లభిస్తోంది ? ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది? ఎలా ఆవిరవుతోంది ? ఎటు వెళ్లుతోంది? తదితర పరోశోధనలు చేస్తున్నట్లు వివరించారు. సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించిన స్పేస్‌ఎక్స్‌ ‘ఇన్‌స్పిరేషన్‌4’ ప్రయోగం విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాసా మానవులను చంద్రుని పైకి తీసుకు వచ్చే ప్రణాళికలో భాగాంగా ఈ పరిశోధనలు చేపట్టిందని లోరీ గ్లేజ్‌ పేర్కోన్నారు.

(చదవండి: స్పెయిన్‌లో అగ్నిపర్వతం విస్పోటనం)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement