Research agency
-
నల్లమలలో కొత్త మొక్క
జడ్చర్ల టౌన్: నల్లమల అడవుల్లో సరికొత్త మొక్కను కనుగొన్నట్టు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర ప్రొఫెసర్ సదాశివయ్య వెల్లడించారు. తన పరిశోధక బృందంతో కలిసి గుర్తించిన ఆ మొక్కకు యూఫోర్బియా తెలంగాణేన్సిస్గా నామకరణం చేసినట్టు ప్రకటించారు. శుక్రవారం ఆ వివరాలను విలేకరులకు తెలిపారు. సదాశివయ్య బృందం, ఏపీ రాష్ట్ర జీవవైవిధ్య మండలి సభ్యుడు డాక్టర్ ప్రసాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం నుంచి నిర్మలా బాబురావు, రామకృష్ణ సంయుక్తంగా నల్లమల అటవీ ప్రాంతంలో గడ్డి జాతులపై పరిశోధన చేస్తున్నారు. అటవీశాఖ సహకారంతో చేపట్టిన ఈ పరిశోధనలో ఒక కొత్త మొక్కను గుర్తించారు. అది రాజస్తాన్‌లో ఉండే యూఫోర్బియా జోధ్పూరెన్సిస్ అనే మొక్కను పోలి ఉందని.. కానీ కొన్ని లక్షణాల్లో వైవిధ్యం ఉండటంతో కొత్త మొక్కగా తేల్చామని పరిశోధక బృందం తెలిపింది. ఈ మొక్కల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, కేవలం రెండు ప్రాంతాల్లోనే లభ్యమవుతుండటంతో అంతరించిపోతున్న మొక్కల జాబితా కింద చెప్పవచ్చన్నారు.కొత్త మొక్కను కనుగొన్న పరిశోధక బృందాన్ని ఉన్నతవిద్యా శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ అభినందించారు. మరింత అధ్యయనం చేస్తాం.. నల్లమలలో కనుగొన్న కొత్త మొక్కపై మరింత అధ్యయనం అవసరమని సదాశివయ్య చెప్పారు. ఈ మొక్క సుమారు 30 సెంటీమీటర్ల పొడవు పెరిగి, మొత్తం పాల వంటి లేటెక్స్ (చిక్కని ద్రవం) ను కలిగి ఉంటుందన్నారు. ఈ మొక్క ఔషధ గుణాలు కలిగి ఉండే అవకాశాలు ఎక్కువన్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణ అడవుల్లో 5 కొత్త మొక్కలను కనుగొన్నామని, రాష్ట్రంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అటవీ ప్రదేశాలు చాలా ఉన్నాయని వివరించారు. కాగా.. నల్లమల అటవీప్రాంతం జీవ వైవిధ్యానికి కేంద్రమని, గతంలో అనేక ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వల్ల పరిశోధనలు జరగలేదని నాగర్‌కర్నూల్ డీఎఫ్ఓ రోహిత్ గోపిడి చెప్పారు. ప్రస్తుతం మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేసే అవకాశం ఉందన్నారు. -
సోలార్ పవర్లో భారత్ రికార్డ్ ! మెర్కామ్ ఇండియా రీసెర్చ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా సోలార్ ఆధారిత విద్యుదుత్పత్తి శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ కాలంలో ఏకంగా మూడు రెట్లకు పైగా (335 శాతం) అదనపు సామర్థ్యం.. అంటే 7.4 గిగావాట్లు కొత్గగా సమకూరినట్టు మెర్కామ్ ఇండియా రీసెర్చ్ ఓ నివేదిక రూపంలో తెలిపింది. ఏడాది క్రితం (2020) ఇదే కాలంలో 1.73 గిగావాట్ల సామర్థ్యమే ఏర్పడినట్టు పేర్కొంది. ‘‘2021 మూడో క్వార్టర్లో (జూలై–సెప్టెంబర్) 2,835 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యం కొత్తగా సమకూరింది. అంతకుముందు జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఇది 14 శాతం అధికం. వార్షికంగా క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఏర్పాటైన సామర్థ్యంతో పోలిస్తే 547 శాతం అధికం’’ అని వివరించింది. ముడి సరుకుల తయారీ వ్యయాలు పెరగడం, మాడ్యూళ్ల అందుబాటు, ధరల్లో ఎన్నో అస్థితరలు, కొన్ని రాష్ట్రాల్లో రవాణా చార్జీలు పెరగడం వంటి సవాళ్లు ఉన్నా కానీ సోలార్ ఇన్స్టాలేషన్లు పెరిగినట్టు తెలిపింది. 2022లోనూ జోరే ‘‘విడిభాగాల అధిక ధరలు, రాజస్థాన్‌లో ట్రాన్స్మిషన్ అంశాలు ఉన్నా కానీ.. 2022 సంవత్సరం కూడా ఇన్స్టాలేషన్ల పరంగా ఎంతో బలంగా ఉంటుంది. చెల్లింపుల సమస్యలు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సవాళ్లు వృద్ధికి అవరోధాలుగా ఉన్నాయి. మోనో పెర్క్మాడ్యూళ్ల ధరలు సగటున 15 శాతం పెరిగాయి. ఒక్కో కంటెయినర్ చార్జీలు కూడా 9,000 డాలర్లకు పెరిగింది’’ అని మెర్కామ్ క్యాపిటల్ గ్రూపు సీఈవో రాజ్‌ప్రభు తెలిపారు. 2022 ఏప్రిల్ నుంచి 40 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని అమలు చేయనుండడంతో దేశీయ తయారీదారులు దీన్నుంచి లబ్ది పొందేందుకు ఇన్స్టాలేషన్లను వేగంగా ఏర్పాటు చేస్తున్నట్టు మెర్కామ్ వివరించింది. దిగుమతులు ప్రియం కానున్నందున వచ్చే ఏడాది రెండో త్రైమాసికం నుంచి కొనుగోళ్ల విధానాల్లో సమూల మార్పు చోటు చేసుకోనున్నట్టు అంచనా వేసింది. చదవండి: సోలార్ రంగంలో పెట్టుబడుల వెల్లువ -
స్పేస్ఎక్స్ టూరిజంలా త్వరలో మూన్ టూరిజం
ప్రైవేట్ ఏజెన్సీ స్పేస్ఎక్స్ ‘ఇన్స్పిరేషన్4’.. చరిత్ర సృష్టించిన సంగతి తెలిసింది. ఆ సంఘటన మరువక ముందే నాసా చంద్రుని పై మనుష్యులను తీసుకువచ్చే ప్రణాళికలో భాగంగా సరికొత్త రోవర్ టెక్నాలజీతో సమగ్ర పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు చంద్రుని పై మానువుడి నివశించడానికీ యోగ్యమైనదేనా కాదా అనేదాని గురించి పరిశోధనలు చేసే క్రమంలో కొన్ని ఆసక్తి రేకెత్తించే పరిశోధనలు గురించి నాసా వివరిస్తోంది. అవేంటో చూద్దాం. వాషింగ్టన్: చంద్రుని దక్షిణ ధృవంగా పిలచే పురాతన బిలం పైకి మంచు జాడను అన్వేషించే రోవర్‌ను 2023 కల్లా ల్యాండింగ్ చేయనున్నట్లు నాసా సోమవారం ప్రకటించింది. ఈ పురాతన బిలం దక్షిణ ధృవం వద్ద రెండు భారీ ఖగోళ శకలాలు ఢీ కొనడంతో ఏర్పడిందని నాసా ప్లానేటరీ డివిజన్ డైరక్టర్ లోరీ గ్లేజ్ వెల్లడించారు. (చదవండి: బైడెన్ కునికి పాట్లు!) సౌర వ్యవస్థలో ఇది అత్యంత శీతల ప్రాంతం కాబట్టి ఇక్కడ మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉంటుందని అన్నారు. పైగా అక్కడ వాతవారణ పరిస్థితులు అస్థిరంగా ఉంటాయని చెబుతున్నారు. ఇంతవరకు చంద్రుని కక్ష్యలో పరిభ్రమించే సెన్సర్ ఉపగ్రహం సాయంతో దూరం నుంచే పరిశోధనలు చేసినట్లు పేర్కొంది. ఇక పై చంద్రుని ఉపరితలంపై నేరుగా ఈ సరికొత్త టెక్కాలజీతో రూపొందించిన రోవర్ సాయంతో పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఈ రోవర్ చంద్రుని భూభాగంపై అనేక అడుగులు దిగువ వరకు రంధ్రలు చేసి మరింత సమగ్రంగా పరిశోధనలు చేస్తుందని గ్లేజర్ పేర్కొన్నారు. ఈ రోవర్ చంద్రుని ఉపరితలం పై మంచు నీరు జాడును నిర్థారించడమే కాక దీన్ని రాకెట్ ఇంధనంగా మార్చి అరుణ గ్రహంపై వెళ్లడానికి ఉపకరించే సమగ్ర సమన్వయ వ్యవస్థలా పనిచేయగలదని నాసా బావిస్తుందని అన్నారు. అరుణ గ్రహం భూమికి అతి చేరువలో రెండు లక్షల మైళ్లు లేదా 1.3 సెకన్ల కాంతి దూరంలో ఉందిని చెప్పారు. అంతేకాదు ఈ రోవర్‌ను ధృవ అస్థిర స్వయం పరిశోధన రోవర్ లేదా వైపర్‌గా పిలుస్తారని చెప్పారు. ఇది 50 గంటల వరకు పనచేయగలిగే బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉందని పైగా అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను కూడా తట్టుకునేలా రూపోందించినట్లు వెల్లడించారు. చార్జింగ్ కోసం సౌలార్ వ్యవస్థపై ఆధారపడుతుందని, పైగా సూర్యుడు ఎటువైపు ఉంటే అటూవైపుగా బ్యాటరీ ప్యానెల్‌ని మార్చుకుంటుందని పేర్కొన్నారు. ఈ రోవర్ సాయంతో చంద్రుని ఉపరితలంపై ఏఏ ప్రాంతాల్లో మంచు నీరు లభిస్తోంది ? ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది? ఎలా ఆవిరవుతోంది ? ఎటు వెళ్లుతోంది? తదితర పరోశోధనలు చేస్తున్నట్లు వివరించారు. సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించిన స్పేస్ఎక్స్ ‘ఇన్స్పిరేషన్4’ ప్రయోగం విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాసా మానవులను చంద్రుని పైకి తీసుకు వచ్చే ప్రణాళికలో భాగాంగా ఈ పరిశోధనలు చేపట్టిందని లోరీ గ్లేజ్ పేర్కోన్నారు. (చదవండి: స్పెయిన్‌లో అగ్నిపర్వతం విస్పోటనం) -
మేనిఫెస్టో రూపకల్పనలో కాంగ్రెస్ కొత్త పుంతలు
న్యూఢిల్లీ: పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో కాంగ్రెస్ పార్టీ కొత్త పుంతలు తొక్కుతోంది. గత విధానాలకు భిన్నంగా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన విషయాలను గుర్తించేందుకు ఒక రీసెర్చ్ ఏజెన్సీని పార్టీ నియమించింది. మేనిఫెస్టోలో ఏ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి, పథకాల అమలుకు సంబంధించిన గణాంకాలు, ఓటర్ల మనోభావాలు మొదలైన అంశాలపై ఆ ఏజెన్సీ నివేదిక సమర్పిస్తుంది. మేనిఫెస్టో కమిటీ సభ్యుడు, ఆర్థికమంత్రి చిదంబరం సూచనతో ఏజెన్సీ సహకారం తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. దాంతోపాటు కార్పొరేట్ రంగ అభిప్రాయాలను కనుక్కునేందుకు ఇద్దరు సీనియర్ నేతలను పార్టీ నియమించింది. వారు కార్పొరేట్ దిగ్గజాలను, ఫిక్కీ, సీఐఐ లాంటి సంస్థలను సంప్రదించి కార్పొరేట్ రంగ ఆకాంక్షలను తెలుసుకుంటారు. అలాగే, పార్టీ రాష్ట్ర శాఖల నుంచి సలహాలు, సూచనలు తీసుకునే విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు.