వాషింగ్టన్: ఎలాన్ మస్క్ కలల ప్రాజెక్ట్‌కు చుక్కెదురైంది. ప్రతిష్టాత్మక స్పేస్‌ఎక్స్ స్టార్ షిప్ ప్రొటోటైప్ బుధవారం ల్యాండింగ్‌కు యత్నిస్తూ పేలిపోయింది. టెక్సాస్‌లోని బోకాచికా రాకెట్ కేంద్రం నుంచి విజయవంతంగా లాంచైన అనంతరం 6 నిమిషాల 42 సెకండ్లు పయనించి స్ట్రాటోస్పియర్‌ను చేరింది, అనంతరం క్రమంగా దిగువకు వస్తూ లాంచింగ్ ప్యాడ్‌ను తాకిన వెంటనే పేలిపోయింది. అంతరిక్షంలోకి మనుషులను తీసుకుపోయేందుకు మస్క్ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా ప్రొటోటైప్‌ను పరీక్షించింది. కంపెనీ కొత్తగా తయారు చేసిన రాప్టర్ ఇంజిన్లను ఉపయోగించి 41 వేల అడుగుల ఎత్తును చేరడం ఈ ప్రయోగ ఉద్దేశం. కానీ ఎంత ఎత్తుకు షిప్ పయనించిందో కంపెనీ వెల్లడించలేదు. లాంచింగ్ సమయంలో ఫ్యూయల్ హెడర్ ట్యాంక్ ఒత్తిడి తక్కువగా ఉందని, దీంతో లాండింగ్ వేగం పెరిగి పేలిపోయిందని మస్క్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment