శూన్యంలోకి ప్రవేశించిన అనంతరం భూమిని చిత్రీకరించిన కారు
కెన్నడీ స్పేస్ సెంటర్, ఫ్లారిడా : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ప్రయోగం మంగళవారం విజయవంతమైంది. 18, 747 జెట్ లైనర్ల వేగంతో ఫాల్కన్ హెవీ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్.. కారును అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. అంగారకుడి కక్ష్యలోకి టెస్లా రోడ్‌స్టర్ కారు చేరనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష రంగంలో స్పేస్ ఎక్స్ కొత్త చరిత్ర సృష్టించింది.
ఫాల్కన్ హెవీ రాకెట్‌కు అమర్చిన 27 ఇంజిన్లను క్రమపద్దతిలో మండించిన శాస్త్రజ్ఞులు ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ఈ క్రమంలో ఇంజిన్ల నుంచి వెలువడి పొగ పెద్ద పర్వతంలా కనిపించింది. ఫాల్కన్ రాకెట్ చేసిన శబ్దానికి ఫ్లారిడా స్పేస్ కోస్ట్ కంపించిపోయింది. మొత్తం ఆరు గంటల పాటు కొనసాగిన ప్రయోగాన్ని శాస్త్రజ్ఞులు లైవ్‌లో తిలకించారు.
చంద్రుడిపైకి అపోలో 11 అంతరిక్ష వ్యోమ నౌకను ప్రయోగించిన లాంచ్‌పాడ్ నుంచి ఈ ప్రయోగం చేయడం గమనార్హం. ప్రయోగ సమయంలో పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడ్డాయి.
ఫాల్కన్ హెవీ.. ఓ చరిత్ర
స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన ఫాల్కన్ హెవీని మూడు ఫాల్కన్ 9 రాకెట్లను కలిపి రూపొందించారు. అంతేకాకుండా పునర్వినియోగించుకోగల ప్రత్యేకత ఫాల్కన్ హెవీ సొంతం. 23 అంతస్తుల ఎత్తు ఉండే ఫాల్కన్ హెవీ ప్రయోగం తర్వాత కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు తిరిగి చేరుకున్నాయి. అయితే, ఒక రాకెట్ సముద్రంలో దిగాల్సివుండగా మధ్యలోనే కుప్పకూలిపోయింది. ఫాల్కన్ హెవీ అత్యధికంగా 1,41, 000 పౌండ్ల పేలోడ్‌ను అంతరిక్షంలోకి మోసుకుని వెళ్లగలదు.
Comments
Please login to add a commentAdd a comment