breaking news
Tesla roadster car
-
ఏడేళ్లుగా వెయిటింగ్.. నా డబ్బు రీఫండ్ చేయండి
గ్లోబల్ మార్కెట్లో టెస్లా కార్లకు మంచి డిమాండ్ ఉంది. సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఈ కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ (Sam Altman) 2018 జూలైలో 50000 డాలర్లతో టెస్లా రోడ్‌స్టర్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకుని ఇన్నాళ్లయినా.. ఇప్పటికీ కారు డెలివరీ జరగలేదు, డబ్బు కూడా రీఫండ్ కాలేదు. ఈ విషయాన్ని ఆల్ట్మాన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసారు.శామ్ ఆల్ట్మాన్.. టెస్లా రోడ్‌స్టర్ బుకింగ్స్, రీఫండ్ కోసం అభ్యర్థించిన మెయిల్ స్క్రీన్షాట్లను కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో 2018 జులై 11న కారును బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను చెల్లించిన డబ్బును రీఫండ్ చేయమని కూడా మెయిల్ చేశారు. కానీ అతనికి అడ్రస్ నాట్ ఫౌండ్ అనే రిప్లై వచ్చింది.''టెస్లా రోడ్‌స్టర్ కారును కొనుగోలు చేయడానికి.. నేను ఉత్సాహంగా ఉన్నాను. కంపెనీ కారును డెలివరీ చేయడంలో జరిగిన ఆలస్యాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. కానీ 7.5 సంవత్సరాలు వేచి ఉండటం చాలా కాలంగా అనిపించింది'' అని కూడా శామ్ ఆల్ట్మాన్ మరో ట్వీట్ ద్వారా వెల్లడించారు.రద్దు చేసుకోవడం కష్టంటెస్లా రోడ్‌స్టర్ కారును బుక్ చేసుకున్న తరువాత.. బుకింగ్ క్యాన్సిల్ చేసుకున్న వారిలో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ మాత్రమే కాకుండా, ప్రముఖ యూట్యూబర్ మార్క్వెస్ బ్రౌన్లీ కూడా ఉన్నారు. ఈయన 2017లో రెండు టెస్లా రోడ్స్టర్లను రిజర్వ్ చేసుకున్నట్లు వెల్లడించారు. బుకింగ్ ప్రక్రియ సులభంగా జారిపోయింది. కానీ రిజర్వేషన్‌ను రద్దు చేసుకోవడం ఊహించిన దానికంటే చాలా కష్టమని బ్రౌన్లీ అన్నారు.టెస్లా రోడ్స్టర్టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. 2017లో రోడ్‌స్టర్‌ను పర్ఫామెన్స్ బేస్డ్ ఈవీగా ఆవిష్కరించారు. ఇది 1.9 సెకన్లలో 0 నుంచి 96 కి.మీ వేగాన్ని అందుకోగలదని.. గంటలు 402 కి.మీ గరిష్ట వేగంతో 997 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ స్పోర్ట్స్ కారు ఉత్పత్తిలోకి రాలేదు. 2024లో కూడా రోడ్‌స్టర్ బయటకు రాలేదని మస్క్ పేర్కొన్నారు. కాగా దీనిని ఎప్పుడు అధికారికంగా లాంచ్ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు.A tale in three acts: pic.twitter.com/ClRZBgT24g— Sam Altman (@sama) October 30, 2025 -
భూమిని ఢీ కొట్టనున్న కారు..!
ఫ్లారిడా, అమెరికా : ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టిన కారు భూమి ఢీ కొడుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. స్పేస్ ఎక్స్ కంపెనీ గత వారం టెస్లాకు చెందిన రోడ్‌స్టర్ కారును గత వారం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అంగారక కక్ష్యలోకి కారును ప్రయోగించగా.. అది కక్ష్యను దాటి ప్రయాణిస్తోంది. కక్ష్యను వదలి ప్రయాణిస్తున్న కారు 10 లక్షల ఏళ్ల తర్వాత భూమి లేదా శుక్ర గ్రహాన్ని ఢీ కొడుతుందని ముగ్గురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ఆ సమయానికి భూమిపై జీవరాశి ఉండకపోవచ్చునని కూడా అభిప్రాయపడ్డారు. కారు భూమి వైపు దూసుకొచ్చే సమయంలోగా మహా ప్రళయాలు సంభవించి మానవాళి అంతరించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అంతరిక్షం నుంచి భూమి వైపు ప్రయాణించే సమయంలో వేగానికి కారు మండిపోయి అగ్నిగోళంగా మారి ఢీ కొడుతుందని వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలు రాయల్ ఆస్ట్రనామికల్ సోసైటీ మేగజిన్‌లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం అంగారకుడి కక్ష్యలో తిరుగుతున్న టెస్లా కారు 2091లో భూమికి చేరువగా వస్తుందని పరిశోధకులు వివరించారు. ఫాల్కన్ హెవీ.. ఓ చరిత్ర స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన ఫాల్కన్ హెవీని మూడు ఫాల్కన్-9 రాకెట్లను కలిపి రూపొందించారు. ఫాల్కన్ హెవీని పునర్వినియోగించుకోవచ్చు. ప్రయోగ అనంతరం ముందుగా నిర్దేశించిన ప్రదేశానికి రాకెట్లు తిరిగి చేరుతాయి. దీని ఎత్తు 23 అంతస్తులు ఉంటుంది. ఫాల్కన్ హెవీ అత్యధికంగా లక్షా నలభై ఒక్క వేల పౌండ్ల పేలోడ్‌ను అంతరిక్షంలోకి మోసుకుని వెళ్లగలదు. -
చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్
-
చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ : అంతరిక్షంలో టెస్లా కారు
కెన్నడీ స్పేస్ సెంటర్, ఫ్లారిడా : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ప్రయోగం మంగళవారం విజయవంతమైంది. 18, 747 జెట్ లైనర్ల వేగంతో ఫాల్కన్ హెవీ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్.. కారును అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. అంగారకుడి కక్ష్యలోకి టెస్లా రోడ్‌స్టర్ కారు చేరనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష రంగంలో స్పేస్ ఎక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. ఫాల్కన్ హెవీ రాకెట్‌కు అమర్చిన 27 ఇంజిన్లను క్రమపద్దతిలో మండించిన శాస్త్రజ్ఞులు ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ఈ క్రమంలో ఇంజిన్ల నుంచి వెలువడి పొగ పెద్ద పర్వతంలా కనిపించింది. ఫాల్కన్ రాకెట్ చేసిన శబ్దానికి ఫ్లారిడా స్పేస్ కోస్ట్ కంపించిపోయింది. మొత్తం ఆరు గంటల పాటు కొనసాగిన ప్రయోగాన్ని శాస్త్రజ్ఞులు లైవ్‌లో తిలకించారు. చంద్రుడిపైకి అపోలో 11 అంతరిక్ష వ్యోమ నౌకను ప్రయోగించిన లాంచ్పాడ్ నుంచి ఈ ప్రయోగం చేయడం గమనార్హం. ప్రయోగ సమయంలో పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడ్డాయి. ఫాల్కన్ హెవీ.. ఓ చరిత్ర స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన ఫాల్కన్ హెవీని మూడు ఫాల్కన్ 9 రాకెట్లను కలిపి రూపొందించారు. అంతేకాకుండా పునర్వినియోగించుకోగల ప్రత్యేకత ఫాల్కన్ హెవీ సొంతం. 23 అంతస్తుల ఎత్తు ఉండే ఫాల్కన్ హెవీ ప్రయోగం తర్వాత కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు తిరిగి చేరుకున్నాయి. అయితే, ఒక రాకెట్ సముద్రంలో దిగాల్సివుండగా మధ్యలోనే కుప్పకూలిపోయింది. ఫాల్కన్ హెవీ అత్యధికంగా 1,41, 000 పౌండ్ల పేలోడ్‌ను అంతరిక్షంలోకి మోసుకుని వెళ్లగలదు.


