
టెక్సాస్: ఎలన్ మస్క్‌కు చెందిన స్పేప్‌ఎక్స్ మరోసారి నాసా నుంచి భారీ ప్రాజెక్టును సొంతం చేసుకుంది. గురు గ్రహానికి చెందిన యూరోపా మూన్ ఉపగ్రహంపై నాసా దృష్టిసారించింది. యూరోపా మూన్ ఉపగ్రహంపై మానవుడు నివసించేందుకు అనువైన గ్రహంగా ఉంటుందని నాసా ఆశాభావం వ్యక్తం చేసింది. యూరోపా ఉపగ్రహంపై పరిశోధనలను చేపట్టడానికి నాసా పూనుకుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు దక్కింది. స్పేస్ ఎక్స్‌తో సుమారు 178 మిలియన్ డాలర్ల( రూ. 1324 కోట్లు)తో నాసా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
యూరోపా క్లిప్పర్ మిషన్‌ను 2024 అక్టోబర్‌లో ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ప్రయోగించినున్నట్లు నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. తాజాగా స్పేస్ ఎక్స్ ఇప్పటికే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు కార్గో వస్తువులను చేరవేస్తుంది. అంతేకాకుండా పలుమార్లు వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు చేరవేసింది. 1972 తరువాత తిరిగి చంద్రుడిపైకి నాసా వ్యోమగాములను తీసుకెళ్లే ఆర్టిమిస్ ప్రోగ్రాంలో భాగంగా సుమారు 2.9 బిలియన్ డాలర్ల కాంట్రక్ట్‌ను కూడా స్పేస్‌ఎక్స్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment