
కాలిఫోర్నియా: ఎలన్ మస్క్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్‌కి ఇకపై ఒక బుల్లి ఇంజనీర్ సేవలందించనున్నాడు. 14 ఏళ్ల వయసున్న కైరాన్ క్వాజి అనే ఇంజనీర్‌కి ఉద్యోగమిచ్చింది. స్పేస్ ఎక్స్ నిర్వహించిన సాంకేతిక పరీక్ష, ఇంటర్వ్యూల్లో క్వాజీ ఉత్తీర్ణుడు కావడంతో ఇంజనీర్‌గా నియమించినట్టు సంస్థ వెల్లడించింది. పదకొండేళ్లకే క్వాజీ ఇంజనీరింగ్‌లో చేరాడు.
కంప్యూటర్ సైన్స్‌లో పట్టా తీసుకున్న క్వాజీకి వెంటనే స్పేస్ ఎక్స్‌లో ఉద్యోగం లభించింది. అంగారక గ్రహంపైకి మనుషుల్ని తీసుకువెళ్లే ప్రాజెక్టులో క్వాజీ ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment