సాక్షి,ముంబై: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన అనంతరం మరో సంచలన వార్త వైరల్ అవుతోంది. మరో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించండి అంటూ ప్రముఖ ఇన్వెస్టర్ హెడ్జ్ ఫండ్ బిలియనీర్ క్రిస్టోఫర్ హోహ్న్ గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్‌పిచాయ్‌కి రాసిన లేఖ హల్ చల్ చేస్తోంది.
12వేల మంది ఉద్యోగులను తొలగింపు విషయంలో గూగుల్ నిర్ణయం సరైనదేననీ, అయితే ఇంకా తొలగించాల్సి ఉందని ఆయన కోరినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కువ జీతాలు తీసుకుంటున్న మరో వెయ్యిమందిని తొలగించాల్సి ఉందని సలహా ఇచ్చారట. అంతిమంగా నిర్వహణ ముందుకు సాగాలని తన లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు గూగుల్-మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌లో 6 బిలియన్ల డాలర్ల వాటా ఉన్న ది చిల్డ్రన్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజ్‌మెంట్ (టిసిఐ) వ్యవస్థాపకుడు లేఖను ఉటంకిస్తూ ది టెలిగ్రాఫ్ నివేదించింది.
గత సంవత్సరం, (2022) తనకు తానుగా రోజుకు 1.5 మిలియన్ యూరోలు తీసుకున్న క్రిస్ గత ఐదేళ్లలో ఆల్ఫాబెట్ తన హెడ్‌కౌంట్‌ని రెండింతలు చేసిందంటూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో 2021 నాటి ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా దాదాపు 20శాతం తగ్గింపు అవసరమని, ఆ దిశగా గూగుల్ మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే అధిక వేతన ఉద్యోగులపై దృష్టిపెట్టాలని, స్టాక్ ఆధారిత చెల్లింపులను గూగుల్ మోడరేట్ చేయాలని ఆయన హెచ్చరించారు.అంతేకాదు సమయం వచ్చినపుడు ఈ విషయాలపై సుందర్ పిచాయ్‌తో చర్చించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా జనవరి 21న, గూగుల్ ఉద్యోగుల తొలగింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment