right direction
-
లేఆఫ్స్: గూగుల్‌కు టాప్ ఇన్వెస్టర్ షాకింగ్ సలహా వైరల్
సాక్షి,ముంబై: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన అనంతరం మరో సంచలన వార్త వైరల్ అవుతోంది. మరో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించండి అంటూ ప్రముఖ ఇన్వెస్టర్ హెడ్జ్ ఫండ్ బిలియనీర్ క్రిస్టోఫర్ హోహ్న్ గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్పిచాయ్కి రాసిన లేఖ హల్ చల్ చేస్తోంది. 12వేల మంది ఉద్యోగులను తొలగింపు విషయంలో గూగుల్ నిర్ణయం సరైనదేననీ, అయితే ఇంకా తొలగించాల్సి ఉందని ఆయన కోరినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కువ జీతాలు తీసుకుంటున్న మరో వెయ్యిమందిని తొలగించాల్సి ఉందని సలహా ఇచ్చారట. అంతిమంగా నిర్వహణ ముందుకు సాగాలని తన లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు గూగుల్-మాతృ సంస్థ ఆల్ఫాబెట్లో 6 బిలియన్ల డాలర్ల వాటా ఉన్న ది చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ (టిసిఐ) వ్యవస్థాపకుడు లేఖను ఉటంకిస్తూ ది టెలిగ్రాఫ్ నివేదించింది. గత సంవత్సరం, (2022) తనకు తానుగా రోజుకు 1.5 మిలియన్ యూరోలు తీసుకున్న క్రిస్ గత ఐదేళ్లలో ఆల్ఫాబెట్ తన హెడ్‌కౌంట్‌ని రెండింతలు చేసిందంటూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో 2021 నాటి ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా దాదాపు 20శాతం తగ్గింపు అవసరమని, ఆ దిశగా గూగుల్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే అధిక వేతన ఉద్యోగులపై దృష్టిపెట్టాలని, స్టాక్ ఆధారిత చెల్లింపులను గూగుల్ మోడరేట్ చేయాలని ఆయన హెచ్చరించారు.అంతేకాదు సమయం వచ్చినపుడు ఈ విషయాలపై సుందర్ పిచాయ్‌తో చర్చించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా జనవరి 21న, గూగుల్ ఉద్యోగుల తొలగింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘సుప్రీం’ సరైన దిశలో సాగలేదు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో సుప్రీంకోర్టు కార్యకలాపాలు సరైన దిశలో సాగలేదని మాజీ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే నలుగురు జడ్జీలు జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. శుక్రవారం పదవీ విరమణ పొందిన ఆయన వార్తా సంస్థ ఏఎన్‌ఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు. ‘కోర్టు పనితీరుకు సంబంధించిన ఎన్నో విషయాల్ని జస్టిస్ మిశ్రా దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అందుకే ఇక ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకునే మీడియా సమావేశం నిర్వహించాం’ అని ఆయన వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించంగా..క్రమంగా మార్పు వస్తోందని తెలిపారు. అత్యున్నత న్యాయ వ్యవస్థపై వచ్చిన అవినీతి అరోపణలన్నీ నిరాధారమని కొట్టిపారేశారు. -
ప్రపంచంలో నిరాశవాదులే ఎక్కువ
చైనా, భారతీయులే ఎక్కువ ఆశావాదులు లండన్: ‘నీవున్న నీ దేశం సరైన పంథాలోనే వెళుతుందని నీవు భావిస్తున్నావా?’ అని ఏ దేశంలోనైనా ఆ దేశ పౌరుడినైనా ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం వస్తుంది? అవుననా, కాదనా? అవునని ఎక్కువ మంది చెబుతారా. కాదని ఎక్కువ మంది చెబుతారా? ప్రపంచంలో మూడింట రెండొంతలు మంది కాదనే చెబుతున్నారు. అంటే తమ దేశం సరైనా పంథాలో ప్రయాణించడం లేదన్నది వారి అభిప్రాయం. ఇప్సోస్, మోరిస్ సంస్థ ప్రపంచంలో 25 దేశాల్లో వేలాది ప్రజలను ప్రశ్నించడం ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా తమ దేశం సరైన పంథాలో వెళుతోందని 37 శాతం మంది చెప్పగా, లేదని 63 శాతం మంది చెప్పారు. తమ దేశం సరైనా పంథాలో ప్రయాణిస్తోందని భావిస్తున్న దేశీయుల్లో చైనా ప్రజలు అగ్రస్థానంలో ఉన్నారు. వారిలో ఏకంగా 90 శాతం మంది సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత స్థానాల్లో సౌదీ అరేబియా, భారత్, రష్యా, అర్జెంటీనా, కెనడా, పెరు, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. భారత్ సరైనా పంథాలో వెళుతోందని ఆ దేశ ప్రజల్లో 76 శాతం మంది అభిప్రాయపడగా, లేదని 24 శాతం మంది అభిప్రాయపడ్డారు. బ్రెజిల్ మినహా బ్రిక్ దేశాలు, దక్షిణ కొరియా మినహా ఆసియా పసిఫిక్ దేశాల ప్రజలు సానుకూలంగా, అంటే ఆశావాద దృక్ఫథంలో స్పందించగా, ఇతర ప్రాంతాల దేశాల ప్రజలు ప్రతికూలంగా స్పందించారు. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల ప్రజలు తమ దేశాల భవిష్యత్తుపై నిరాశ నిస్పృహలు వ్యక్తం చేశారు. అమెరికాలో సరైన పంథాలో నడుస్తోందని 35 శాతం మంది అభిప్రాయపడగా, లేదని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇది కొత్త అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ ఎన్నికాక ముందు నిర్వహించిన సర్వే. ఆ తర్వాత అక్కడి ప్రజల అభిప్రాయల్లో మార్పు వచ్చి ఉండవచ్చు. తమ దేశం సరైన పంథాలో నడవడం లేదని ఎక్కువ మంది భావించడానికి నిరుద్యోగమే ప్రధాన సమస్య. నిరుద్యోగం ప్రధాన కారణంగా 38 శాతం మంది చూపగా, దారిద్య్రం, సామాజిక అసమానతులని 34 శాతం మంది, ఆర్థిక, రాజకీయ అవినీతని 33 శాతం మంది, నేరం, హింసని 29 శాతం మంది, వైద్య సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం కారణమని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇలాంటి సర్వేను 2010వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది నిర్వహిస్తుండగా, గతేడాదితో పోలిస్తే ప్రపంచంలో నిరాశవాదుల సంఖ్య ఈ సారి 35 శాతం నుంచి 37 శాతంకు పెరిగింది.