
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ ఉత్థానపతనాలను ఒడిసిపట్టుకోవడం కత్తిమీదసామే. రికార్డుస్తాయిలకు చేరుకున్నకీలక సూచీలు లాభనష్టాల ఊగిసలాడాయి. అనూహ్య పరిణామాలతో మార్కెట్లో ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సందప ఆవిరై పోయింది. ముఖ్యంగా ఈ వారాంతంలో శుక్రవారం నాటి పరిణామాలు ఇన్వెస్టర్లను వణికించాయి. నిమిషాల వ్యవధిలోనే సంపద అలా మంచులా కరిగిపోయింది. ఇక మ్యూచువల్ ఫండ్ల సంగతి సరే.
ముఖ్యంగా ఈ వారంలోని నాలుగు రోజుల ట్రేడింగ్‌లో రూ. 5.66 లక్షల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఐటీ, హౌసింగ్ ఫైనాన్స్ ఇలా దాదాపు అన్ని సెక్టార్ల షేర్లు పాతాళానికి పరుగులు తీశాయి. ఇవాళ ఒక్కరోజే సెన్సెక్స్ 1100పాయింట్లకుపైగా ఢమాల్ అంది. అయితే, ఇది కొన్ని నిమిషాలలో మెరుగుపడినా..ఇన్వెస్టర్ల నష్టం మాత్రం తప్పలేదు. బీఎస్‌ఇలో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,66,187 కోట్లు కరిగిపోయింది. అటు నిఫ్టీది కూడా ఇదేబాట. ఈ వారంలో నిఫ్టీ 1249 పాయింట్లు అంటే 3.28 శాతం నష్టపోయింది శుక్రవారం ఒక్క రోజే 2,02,433 కోట్లు నష్టపోయారు. ఎస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాణా కపూర్ పదవీకాలం పొడిగించేందుకు ఆర్‌బీఐ ససేమిరా అనడంతో ఆ కంపెనీ షేర్ ఏకంగా 34 శాతం పడింది.