చదువుకునే చాలామంది అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటారు. అది బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ప్రయత్నిస్తే తప్పకుండా సాధ్యమవుతుందంటున్నాడు.. పూణేకు చెందిన ఓ యువకుడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
పూణేకు చెందిన 'ధృవ్ లోయ' అమెరికాలో ఉద్యోగం కోసం ఐదు నెలలు శ్రమించాడు. జాబ్ కోసం 300 అప్లికేషన్స్, 500 కంటే ఎక్కువ ఈమెయిల్స్ పంపినట్లు వెల్లడించారు. ఇది మాత్రమే కాకుండా తాను 10 ఇంటర్వ్యూలకు కూడా హాజరైనట్లు పేర్కొన్నాడు. చివరకు ఆటోమొబైల్ దిగ్గజం టెస్లాలో టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్‌గా ఉద్యోగం సంపాదించాడు.
ఉద్యోగం సాధించిన తరువాత.. జాబ్ కోసం ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. ఇందులో తాను ఉద్యోగం సాధించడానికి చాలా కష్టపడినట్లు పేర్కొన్నాడు. మూడు ఇంటర్న్‌షిప్‌లు పొందినా, మంచి జీపీఏ ఉన్నప్పటికీ.. జాబ్ తెచ్చుకోవడానికి ఐదు నెలల సమయం పట్టిందని చెప్పాడు.
ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌పై మండిపడ్డ యూజర్: ఇంత అన్యాయమా అంటూ..
వీసా గడువు పూర్తయిపోతుందేమో అన్న భయం.. ఉద్యోగం లేకుండానే అమెరికా విడిచి వెళ్లిపోవాల్సి వస్తుందేమో అనేలా చేసింది. అయినా ప్రయత్నం ఆపకుండా.. అమెరికాలో ప్రతి డాలర్‌ను జాగ్రత్తగా వినియోగించాను. మిత్రుల అపార్ట్‌మెంట్‌లలో ఉండాల్సి వచ్చింది. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని టెస్లా కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాను. నాకు మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment