ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న టెస్లా రాబోయే రోజుల్లో హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో చైనా కంపెనీ బివైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్) గట్టి పోటీ ఇస్తోంది. ఈ తరుణంలో మస్క్ హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ 2026 నాటికి టెస్లా హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
టెస్లా కంపెనీ త్వరలోనే హైడ్రోజన్ కార్ల ప్రాజెక్టు మీద పనిచేయనుంది. హైడ్రోజన్‌తో నడిచే మొదటి కారు 'మోడల్ హెచ్'ను 2026లో ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ కార్లను కేవలం అమెరికా మార్కెట్లో మాత్రమే లాంచ్ చేస్తారా?.. ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment