ఇలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తమను సంప్రదించడం మానేయడంతో టెస్లా ఇక్కడ పెట్టుబడుల పెట్టే అంశంలో ముందుకు వెళ్తుందని భారత్ ఆశించడం లేదు.
మస్క్ ఏప్రిల్ చివరిలో భారత పర్యటనను వాయిదా వేసుకున్న తరువాత మస్క్ బృందం తమతో తదుపరి సంప్రదింపులు జరపలేదని న్యూఢిల్లీలోని అధికారులు చెప్పినట్లు మనీ కంట్రోల్ కథనం పేర్కొంది. టెస్లాకు మూలధన సమస్యలు ఉన్నాయని, సమీప భవిష్యత్తులో భారత్‌లో కొత్త పెట్టుబడులు పెట్టే యోచన లేదని ప్రభుత్వానికి అర్థమైంది.
టెస్లా ప్రపంచవ్యాప్తంగా త్రైమాసిక డెలివరీలలో వరుసగా రెండవసారి క్షీణతను నివేదించడం, చైనాలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నందున భారత్‌పై ఆసక్తి తగ్గింది. ఆటోమొబైల్ రంగాన్ని పర్యవేక్షించే భారత భారీ పరిశ్రమల శాఖ, ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖల ప్రతినిధులు గానీ, టెస్లా గానీ దీనిపై స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment