అదానీ గ్రూప్ అధినేత, బిలియనీర్ గౌతం అదానీకి భారీ ఊరట లభించింది. ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ ఆరోపణల తరువాత మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను భారీగా కోల్పోయిన అదానీ గ్రూపు క్రమంగా కోలుకుంటోంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో గౌతమ్ అదానీ నేతృత్వంలోని సమ్మేళనానికి చెందిన లిస్టెడ్ సంస్థలు 12 శాతం ర్యాలీ అయ్యాయి.తాజాగా లాభాలతోసంస్థ ఎం క్యాప్ ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది.
అదానీ మార్కెట్ క్యాప్ రూ.11 లక్షల కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ ఫిబ్రవరి తర్వాత మొదటిసారిగా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను రూ.11 లక్షల కోట్ల మార్కును అధిగమించడం విశేషం. మొత్తం పది అదానీ గ్రూప్ కంపెనీలు - అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, అదానీ పవర్, ఎసిసి, అంబుజా, ఎన్‌డిటివి శుక్రవారం ట్రేడ్‌లో భారీ పెరుగుదలను నమోదు చేశాయి.
మరోవైపు అబుదాబి నేషనల్ ఎనర్జీ PJSC (TAQA) అదానీలో పెట్టుబడులపై మీడియా నివేదికల మధ్య అదానీ గ్రూప్ స్టాక్‌లు దలాల్ స్ట్రీట్స్‌లో మెరుపులు మెరిపించాయి. అదాని గ్రూప కంపెనీలో పెట్టుబడుల వార్తలపై అబుదాబి కంపెనీ స్పందించింది. ఆ వార్తల్లోవాస్తవం లేదని TAQA కొట్టిపారేసింది.ఈ వారం ప్రారంభంలో, యూఎస్ ఆధారిత బోటిక్ పెట్టుబడి సంస్థ రాజీవ్ జైన్ నేతృత్వంలోని GQG భాగస్వామి అదానీ పవర్ 31.2 కోట్ల ఈక్విటీ షేర్లను రూ. 9,000 కోట్లకు (1.1 బిలియన్ డాలర్ల) కొనుగోలు చేసింది.
కాగా ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు విడుదలైనప్పటి నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ రెండు నెలల్లోపే సమ్మేళనం స్టాక్‌లు 75 శాతానికి పడి పోయాయి. అదానీ గ్రూప్ అవకతవకలు, అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలు సత్యదూరమైనవని గౌతం అదానీ తీవ్రంగా ఖండించారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన మార్కెట్‌రెగ్యులేటరీ సెబీరిపోర్ట్‌ను త్వరలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచ నుంది.
Comments
Please login to add a commentAdd a comment