
అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-16ను నడిపిన తొలి భారతీయుడిగానూ రతన్ టాటాదే రికార్డు. 2007లో ఆయన ఈ యుద్ధ విమానాన్ని నడిపించారు

రతన్ టాటాకు పదేళ్ల వయసుండగా తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత ఆయన నానమ్మ వరసైన నవజ్‌బాయి టాటా వద్ద పెరిగారు

అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యనభ్యసించిన టాటా ఆ తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్ విద్యను పూర్తి చేశారు

అంతర్జాతీయ ఐటీ కంపెనీ ఐబీఎంలో ఉద్యోగం లభించిన రతన్ టాటా దాన్ని కాదని టాటా స్టీల్‌లో పనిచేయడం మొదలుపెట్టారు. చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి వ్యాపారం గురించి ఆకళింపు చేసుకున్నారు

రతన్ టాటా నేతృత్వంలో టాటా గ్రూపు ఆదాయం నలభై రెట్లు పెరిగింది. 2016 నాటికి గరిష్ట ఆదాయం 103 బిలియన్ డాలర్లు

విద్య, ఆరోగ్యం విషయాల్లో రతన్ టాటాకు ఆసక్తిమెండు. ఆయన దాతృత్వ కార్యక్రమాల్లోనూ వీటికే పెద్దపీట వేశారు. కార్నెల్ యూనివర్శిటీలో విద్యనభ్యసించే భారతీయ విద్యార్థుల కోసం ఏకంగా 280 కోట్ల డాలర్లతో స్కాలర్‌షిప్ ఫండ్ ఏర్పాటు చేశారు

కుక్కలంటే మహా ప్రీతి ఈయనకు. టాటా గ్రూపు ప్రధాన కార్యాలయంలో ఏటా రుతుపవనాల సమయంలో వీధికుక్కలకు నీడనిచ్చే పద్ధతిని మొదలుపెట్టింది కూడా రతన్ టాటానే

నాలుగు సందర్భాల్లో పెళ్లికి చాలా దగ్గరగా వచ్చినా ఆజన్మాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు రతన్ టాటా

అంతర్జాతీయ కార్ బ్రాండ్లు జాగ్వర్, లాండ్ రోవర్లను టాటా మోటర్స్ కొనుగోలు చేయడంలో, కోరస్ స్టీల్ ఫ్యాక్టరీని టాటా స్టీల్స్ ద్వారా కొనుగోలు చేయడంలోనూ రతన్ టాటాది కీలకపాత్ర















