
టాటా గ్రూప్ పేరు తెలియని భారతీయుడు దాదాపు ఉండరు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే జీవితకాలంలో చాలాసార్లు టాటా ఉత్పత్తులు వాడుతుంటాం. ఈ కంపెనీని విజయవంతంగా నడిపించిన రతన్‌టాటా జయంతి ఈరోజు

ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినిపిస్తోంది

దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది

టాటా కంపెనీ మొదట ఒక టెక్స్‌టైల్ మిల్‌గా ప్రారంభమైంది

జంషెడ్జీ టాటా ఈ గ్రూప్‌ను 1868లో ప్రారంభించారు

ఈ కంపెనీ తరతరాలుగా తమ వారసుల చేతులు మారుతూ వచ్చింది

మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్‌లైన్స్ కంపెనీని ప్రారంభించింది టాటా సంస్థే

రెండో ప్రపంచ యుద్ధం తరువాత దాన్ని ఎయిరిండియా పేరుతో జాతీయం చేశారు

2022లో ఎయిరిండియా సంస్థను టాటా తిరిగి దక్కించుకుంది

ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, దేశంలోనే మొదటగా తాజ్ హోటల్‌ను స్థాపించింది కూడా టాటా కంపెనీయే

ఇలా మన దేశానికి ఈ సంస్థ ఎన్నో కొత్త వ్యాపారాలను పరిచయం చేసింది టాటా గ్రూప్

దేశ నిర్మాణం, అభివృద్ధిలో టాటాల పాత్ర ఎంతగానో ఉంది. టాటా గ్రూప్ సంస్థకు చాలా మంది సారథ్యం వహించినా రతన్ టాటాకు ప్రత్యేక స్థానం ఉంది

ఆయన అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అక్టోబర్‌లో కన్నుమూశారు

వ్యాపారంలో ఎందరికో నైతిక విలువలు నేర్పిన అజరామరుడు రతన్ టాటా