US appeals court affirms $140 million penalty on TCS - Sakshi
Sakshi News home page

టెక్‌ దిగ్గజం టీసీఎస్‌కు భారీ షాక్‌.. ఇదేం పద్ధతంటూ కోర్టు చివాట్లు!

Published Tue, Jul 25 2023 4:47 PM | Last Updated on Tue, Jul 25 2023 7:09 PM

Us Court Of Appeals Agreed With The District Court 140 Million Penalty On Tcs - Sakshi

ప్రముఖ దేశీయ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌కు అమెరికాలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా హెల్త్‌ కేర్‌ విభాగానికి చెందిన ‘ఎపిక్‌ సిస్టమ్‌’ అనే సంస్థ స్థానిక జిల్లా కోర్టులో టీసీఎస్‌కు వ్యతిరేకంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కేసు వేసింది. ఈ కేసులో జిల్లా కోర్టు టీసీఎస్‌కు విధించిన 140 మిలియన్ డాలర్ల జరిమానాను యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఏకిభవించింది. డిస్ట్రీక్‌ కోర్ట్‌ టీసీఎస్‌’కు విధించిన ఫైన్‌ రాజ్యాంగబద్ధమైందని సమర్ధించింది.  

మనుషులు తమ తెలివితేటలతో సృష్టించే ఆవిష్కరణల్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (IP) లేదా మేధో సంపత్తి అంటారు. ఇప్పుడిదే అంశంలో టీసీఎస్‌ తీరును తప్పుబడుతు ఎపిక్‌ సిస్టమ్‌ కంపెనీ యూఎస్‌ జిల్లా కోర్టును ఆశ్రయించింది. ఆ కేసులో విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్‌ కోర్టు టీసీఎస్‌కు 140 మిలియన్‌ డాలర్లను ఫైన్‌ విధించింది. 

ఈ తీర్పును సవాలు చేస్తూ టీసీఎస్‌ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ ఎదుట తన వాదనల్ని వినిపించింది. విచారణ సందర్భంగా ‘‘అమెరికా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఆదేశాలను పాటించడంలో జిల్లా కోర్టు విఫలమైందని, నష్టపరిహారాన్ని 10 నుంచి 25 మిలియన్ డాలర్లకు తగ్గించడానికి నిరాకరించిందని టీసీఎస్ వాదించింది. అయితే, భారీ (140 మిలియన్ డాలర్ల) జరిమానా విషయంలో జిల్లా కోర్టు తీర్పును సమర్ధిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇంత‌కీ ఆ టీసీఎస్‌, ఎపిక్‌ స్టిస్టం కేసేంటీ 
2014లో ఎపిక్‌ సిస్టం, టాటా అమెరికా (టీసీఎస్‌) లు కలిపి ఓ సంస్థకు (మ్యూచువల్ క్లయింట్‌)కు సేవలందిస్తున్నాయి. ఆ సమయంలో టీసీఎస్‌ అనుమతి లేకుండా ఫేక్‌ ఐడీలతో తమ వెబ్ పోర్టల్‌ను యాక్సెస్ చేసుకొని 6,000 వేల ఫైళ్ల సమాచారాన్ని తస్కరించింది. అదే సమాచారంతో తమ (ఎపిక్‌ సిస్టం) సొంత కాంపిటీటర్‌ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాప్ట్‌వేర్‌ను డెవలప్‌ చేయడానికి ఉపయోగించుకుందని ఎపిక్ సిస్టం ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయాలని అమెరికా జిల్లా కోర్టును కోరింది.  

టీసీఎస్‌ ఉద్దేశ పూర్వకంగానే 
ఇక ఈ కేసుపై 11 పదకొండు మంది జడ్జీలు విచారణ చేపట్టే యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్‌ ద సెవెన్త్‌ సర్క్యూట్‌ (యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్) సైతం టీసీఎస్‌ను తప్పుబట్టింది. 

సెవెన్త్ సర్క్యూట్ కోర్ట్‌ ఆర్డర్‌లో టీసీఎస్‌ ఉద్యోగులు ఎపిక్ వెబ్ పోర్టల్‌ను అనధికారికంగా చూసే యాక్సెస్‌ ఉంది. ఉద్దేశపూర్వకంగా పదేపదే ఎపిక్ అభివృద్ధి చేసిన రహస్య సమాచారాన్ని యాక్సెస్ చేసి డౌన్‌లోడ్‌ చేశారు, ఆపై ఎపిక్‌తో పోటీ పడటానికి ప్రయత్నించడానికి ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగించారో వివరించింది.

అంతేకాదు టీసీఎస్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తీసుకున్న చర్యల్ని సైతం కోర్ట్‌ వెల్లడించింది. విజిల్ బ్లోయర్‌ను కట్టడి చేయడం, సంబంధిత పత్రాలను భద్రపరచడంలో విఫలం కావడం, ఎపిక్ ప్రశ్నించినప్పుడు అబద్ధం చెప్పనట్లు పేర్కొంది. టీసీఎస్‌ ప్రవర్తనను కోర్టు పదేపదే, ఉద్దేశపూర్వకంగా, చిరాకుగా అభివర్ణించింది.

ఓ వైపు సమర్ధిస్తూనే 
ఎపిక్‌ సంస్థకు జగింది నష్టమేనని సమర్ధిస్తూనే టీసీఎస్‌కు ఇంత తక్కువ జరిమానా ఎందుకు విధించాల్సి వచ్చిందో తీర్పులో కోర్టు స్పష్టత ఇచ్చింది. ‘టీసీఎస్ ప్రపంచంలోని అతిపెద్ద టెక్‌ కంపెనీ. అందువల్ల తాము విధించే భారీ జరిమానా తీవ్ర ప్రతికూల ప్రభావాల్ని చూపిస్తాయని’ పేర్కొంది. టీసీఎస్ దుష్ప్రవర్తనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుది తీర్పును వెలువరించింది. ఇక, ఈ కేసు సంబంధిత అంశాలపై టీసీఎస్‌ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

చదవండి👉 రూ.100కోట్ల జాబ్స్‌ స్కామ్‌.. టీసీఎస్‌లో మరో కీలక పరిణామం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement