Epic Systems
-
టెక్ దిగ్గజం టీసీఎస్‌కు భారీ షాక్.. ఇదేం పద్ధతంటూ కోర్టు చివాట్లు!
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్‌కు అమెరికాలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా హెల్త్ కేర్ విభాగానికి చెందిన ‘ఎపిక్ సిస్టమ్’ అనే సంస్థ స్థానిక జిల్లా కోర్టులో టీసీఎస్‌కు వ్యతిరేకంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కేసు వేసింది. ఈ కేసులో జిల్లా కోర్టు టీసీఎస్‌కు విధించిన 140 మిలియన్ డాలర్ల జరిమానాను యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఏకిభవించింది. డిస్ట్రీక్ కోర్ట్ టీసీఎస్’కు విధించిన ఫైన్ రాజ్యాంగబద్ధమైందని సమర్ధించింది. మనుషులు తమ తెలివితేటలతో సృష్టించే ఆవిష్కరణల్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (IP) లేదా మేధో సంపత్తి అంటారు. ఇప్పుడిదే అంశంలో టీసీఎస్ తీరును తప్పుబడుతు ఎపిక్ సిస్టమ్ కంపెనీ యూఎస్ జిల్లా కోర్టును ఆశ్రయించింది. ఆ కేసులో విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్ కోర్టు టీసీఎస్‌కు 140 మిలియన్ డాలర్లను ఫైన్ విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ టీసీఎస్ యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఎదుట తన వాదనల్ని వినిపించింది. విచారణ సందర్భంగా ‘‘అమెరికా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఆదేశాలను పాటించడంలో జిల్లా కోర్టు విఫలమైందని, నష్టపరిహారాన్ని 10 నుంచి 25 మిలియన్ డాలర్లకు తగ్గించడానికి నిరాకరించిందని టీసీఎస్ వాదించింది. అయితే, భారీ (140 మిలియన్ డాలర్ల) జరిమానా విషయంలో జిల్లా కోర్టు తీర్పును సమర్ధిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంతకీ ఆ టీసీఎస్, ఎపిక్ స్టిస్టం కేసేంటీ 2014లో ఎపిక్ సిస్టం, టాటా అమెరికా (టీసీఎస్) లు కలిపి ఓ సంస్థకు (మ్యూచువల్ క్లయింట్)కు సేవలందిస్తున్నాయి. ఆ సమయంలో టీసీఎస్ అనుమతి లేకుండా ఫేక్ ఐడీలతో తమ వెబ్ పోర్టల్‌ను యాక్సెస్ చేసుకొని 6,000 వేల ఫైళ్ల సమాచారాన్ని తస్కరించింది. అదే సమాచారంతో తమ (ఎపిక్ సిస్టం) సొంత కాంపిటీటర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాప్ట్‌వేర్‌ను డెవలప్ చేయడానికి ఉపయోగించుకుందని ఎపిక్ సిస్టం ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయాలని అమెరికా జిల్లా కోర్టును కోరింది. టీసీఎస్ ఉద్దేశ పూర్వకంగానే ఇక ఈ కేసుపై 11 పదకొండు మంది జడ్జీలు విచారణ చేపట్టే యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ద సెవెన్త్ సర్క్యూట్ (యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్) సైతం టీసీఎస్‌ను తప్పుబట్టింది. సెవెన్త్ సర్క్యూట్ కోర్ట్ ఆర్డర్లో టీసీఎస్ ఉద్యోగులు ఎపిక్ వెబ్ పోర్టల్‌ను అనధికారికంగా చూసే యాక్సెస్ ఉంది. ఉద్దేశపూర్వకంగా పదేపదే ఎపిక్ అభివృద్ధి చేసిన రహస్య సమాచారాన్ని యాక్సెస్ చేసి డౌన్లోడ్ చేశారు, ఆపై ఎపిక్‌తో పోటీ పడటానికి ప్రయత్నించడానికి ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగించారో వివరించింది. అంతేకాదు టీసీఎస్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తీసుకున్న చర్యల్ని సైతం కోర్ట్ వెల్లడించింది. విజిల్ బ్లోయర్‌ను కట్టడి చేయడం, సంబంధిత పత్రాలను భద్రపరచడంలో విఫలం కావడం, ఎపిక్ ప్రశ్నించినప్పుడు అబద్ధం చెప్పనట్లు పేర్కొంది. టీసీఎస్ ప్రవర్తనను కోర్టు పదేపదే, ఉద్దేశపూర్వకంగా, చిరాకుగా అభివర్ణించింది. ఓ వైపు సమర్ధిస్తూనే ఎపిక్ సంస్థకు జగింది నష్టమేనని సమర్ధిస్తూనే టీసీఎస్‌కు ఇంత తక్కువ జరిమానా ఎందుకు విధించాల్సి వచ్చిందో తీర్పులో కోర్టు స్పష్టత ఇచ్చింది. ‘టీసీఎస్ ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీ. అందువల్ల తాము విధించే భారీ జరిమానా తీవ్ర ప్రతికూల ప్రభావాల్ని చూపిస్తాయని’ పేర్కొంది. టీసీఎస్ దుష్ప్రవర్తనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుది తీర్పును వెలువరించింది. ఇక, ఈ కేసు సంబంధిత అంశాలపై టీసీఎస్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. చదవండి👉 రూ.100కోట్ల జాబ్స్ స్కామ్.. టీసీఎస్‌లో మరో కీలక పరిణామం! -
టీసీఎస్‌కు స్వల్ప ఊరట
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు ఓ కేసులో విధించిన జరిమానాను అమెరికా కోర్టు సగానికి తగ్గించింది. వాణిజ్య రహస్యాలకు సంబంధించి ఎపిక్ సిస్టమ్స్ కార్పొరేషన్ దాఖలు చేసిన కేసులో 940 మిలియన్ డాలర్ల (రూ.6,016 కోట్లు) జరిమానా చెల్లించాలని గతంలో అమెరికా కోర్టు టీసీఎస్తోపాటు టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్‌ను ఆదేశించింది. దీనిపై టీసీఎస్ చేసిన అభ్యర్థనను పాక్షికంగా ఆమోదిస్తూ, జరిమానాను 420 మిలియన్ డాలర్ల(రూ.2,688 కోట్లు)కు తగ్గిస్తూ అమెరికాలోని వెస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆఫ్ విస్కాన్సిన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని టీసీఎస్ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. అయితే, విచారణలో తాము అందజేసిన ఆధారాల ప్రకారం చూస్తే మొదటి సారి తీర్పు, రెండోసారి జరిమానా తగ్గిస్తూ ఇచ్చిన ఆదేశాలు ఏవీ సమర్థనీయంగా లేవని, వీటిపై ఉన్నత న్యాయ స్థానంలో అప్పీలు చేయవచ్చంటూ న్యాయ సలహా అందినట్టు టీసీఎస్ పేర్కొంది. టీసీఎస్, టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్‌లకు వ్యతిరేకంగా ఎపిక్ 2014లో మాడిసన్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాణిజ్య రహస్యాలను, సున్నిత సమాచారం, డాక్యుమెంట్లును తస్కరించినట్టు ఆరోపించింది. దీంతో సాఫ్ట్‌వేర్‌ను దొంగిలించినందుకు 240 మిలియన్ డాలర్లు(రూ.1,536 కోట్లు), మరో 700 మిలియన్ డాలర్ల(రూ.4,480 కోట్లు)ను నష్ట పరిహారంగా చెల్లించాలని అక్కడి కోర్టు ఆదేశించింది. -
టీసీఎస్‌కు భారీ ఫైన్..
న్యూయార్క్\ముంబై: భారతదేశం నుంచి సర్వీసెస్ సెక్టార్లో ప్రథమంగా చెప్పుకునే కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్). ప్రపంచంలోని అన్ని దిగ్గజ కంపెనీలకు సర్వీసెస్‌ను అందించే టీసీఎస్‌కు యూఎస్ ఫెడరల్ కోర్టు ఏకంగా 940 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. హెల్త్ కేర్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అనుమతి లేకుండా తీసుకున్నందుకు అమెరికాలో టాటాకు చెందిన టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌ను వెస్టర్న్ అమెరికాలోని విస్కన్సిన్ జిల్లాలో ఉన్న ఫెడరల్ కోర్టు ఎపిక్ సిస్టమ్స్‌కు 240 మిలియన్ డాలర్లను చెల్లించాలని ఆదేశించింది. ఈ సాఫ్ట్వేర్ తయారీ ప్రక్రియను 2012లో ఇరు కంపెనీలు ప్రారంభించాయి. ఒరేగాన్ కైసర్ పర్మనెంట్లోని కన్సల్టెంట్లను క్లయింట్లుగా ఎరిక్ సిస్టమ్స్ నియమించుకుంది. వీరు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన 6,477 డాక్యుమెంట్లను ( వీటిలో 1,687 డాక్యుమెంట్లు ఎరిక్ సిస్టమ్స్‌కు చెందినవి) తీసుకున్నారు. ఈ కేసును రెండు వారాల పాటు విచారించిన ఫెడరల్ జడ్జి విలియం ఎమ్.కాన్లీ ఎరిక్ అనుమతి లేకుండా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకున్నందుకు శిక్షగా 700 మిలియన్ డాలర్లు, నష్ట పరిహారంగా 240 మిలియన్ డాలర్లను టాటా ఇంటర్నేషనల్ ఎరిక్ కంపెనీకి చెల్లించాలని తీర్పునిచ్చారు. తమ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని ప్రత్యర్ధి కంపెనీ మెడ్ మంత్ర అనే హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసుకున్నాయని ఎపిక్ ఆరోపిస్తోందని తెలిపారు. ఎపిక్‌కు చెందిన సమాచారాన్ని కైసర్ పర్మనెంటే కంపెనీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు టీసీఎస్‌కు చెందిన ఉద్యోగి ఆ సమాచారాన్ని మరో ఇద్దరు ఉద్యోగులతో పంచుకున్నారని కోర్టుకు తెలిపింది. కొన్నేళ్లుగా కష్టపడి తయారుచేసుకున్న సమాచారాన్ని టాటా కంపెనీయే ఉద్యోగుల నుంచి తస్కరించిందని ఎరిక్ ఆరోపిస్తోంది. దీనివల్ల మార్కెట్లో ఎపిక్‌ను నష్టపోయేలా చేయడం టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకుందని తన 39 పేజీల ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన ముంబై టీసీఎస్ అధికారి ఒకరు తమ ముందున్న ప్రశ్నలన్నింటికి కంపెనీ త్వరలో సమాధానం చెబుతుందని తెలిపారు.