విజిల్ బ్లోయర్ ఫిర్యాదుతో ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్‌లో 100 కోట్ల జాబ్స్ కుంభకోణం అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, ఈ అంశంపై టీసీఎస్ యాజమాన్యం బోర్డ్ ఆఫ్ డైరక్టర్లకు స్పష్టత ఇచ్చింది.
టీసీఎస్ మూడేళ్లలో 50 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఆ సమయంలో హైరింగ్ విభాగానికి చెందిన సీనియర్ స్థాయి ఉద్యోగులు..ఉద్యోగుల నుంచి (బ్రైబ్స్ ఫర్ జాబ్స్) డబ్బుల్ని వసూలు చేసింది. దీనిపై విజిల్ బ్లోయర్ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ హెడ్ ఈ ఎస్ చక్రవర్తి స్టాఫింగ్ కంపెనీల నుంచి కమీషన్లు తీసుకున్నారని ఆధారాల్ని అందిస్తూ టీసీఎస్ సీఈఓ, సీఓఓలకు సమాచారం అందించారనేది సదరు నివేదికల సారాశం.
దీనిపై దర్యాప్తు జరిపేందుకు కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అజిత్ మీనన్ నాయకత్వంలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్‌తో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ అంశంపై ఆరా తీస్తున్నట్లు నివేదికలు హైలెట్ చేశాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ యాజమాన్యం..సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు లేఖలు రాసింది. అందులో కంపెనీలో జరిగిన రిక్రూట్‌మెంట్ విషయంలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న నివేదికలపై చర్చించింది.
ఈ సందర్భంగా, దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. తుది నివేదిక వెల్లడి కావాల్సి ఉంది. కుంభకోణం జరిగిందని వస్తున్న వార్తలు ‘హాస్యాస్పదంగా ఉన్నాయి’. టీసీఎస్ మొత్తం వర్క్ ఫోర్స్‌లో సబ్‌కాంట్రాక్టర్లు చాలా తక్కువ శాతం ఉన్నారని బోర్డు సభ్యుడు తెలిపినట్లు ఎకనామిక్స్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఇంటర్నల్ ఆడిటర్‌లతో టీసీఎస్ సంప్రదింపులు జరుపుతోందని కథనంలో పేర్కొంది. జాబ్ స్కామ్ జరిగినట్లు వచ్చిన అస్పష్టమైన రిపోర్ట్‌ల విషయంలో ప్రస్తుతం సంస్థలో జరుగుతున్న దర్యాప్తు, ఆడిటర్‌లు ఏం నిర్ధారిస్తారనేది కీలకంగా మారనుంది.
చదవండి👉 ‘మాకొద్దీ ఉద్యోగం’..టీసీఎస్‌కు షాకిస్తున్న మహిళా ఉద్యోగులు!
Comments
Please login to add a commentAdd a comment