గుడ్‌ న్యూస్‌: టీసీఎస్‌ వేల కోట్ల రూపాయల మెగా డీల్‌  | TCS wins 1bn usd deal from Jaguar Land Rover | Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌: టీసీఎస్‌ వేల కోట్ల రూపాయల మెగా డీల్‌ 

Sep 7 2023 1:44 PM | Updated on Sep 7 2023 4:12 PM

TCS wins 1bn usd deal from Jaguar Land Rover - Sakshi

TCS deal with JLR దేశీయ అతిపెద్ద  ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  (టీసీఎస్‌) మెగా డీల్‌ కుదుర్చుకుంది.  టాటామోటార్స్‌ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR)తో  మెగా డీల్‌ను గెలుచుకున్నట్లు ప్రకటించింది. భవిష్య డిజిటల్‌ సేవల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని   కుదుర్చుకున్నట్టు  తెలిపింది.  (మోడ్రన్‌ కార్లలో సెక్స్‌ నుంచి పాలిటిక్స్‌ దాకా మొత్తం లీక్‌: షాకింగ్‌ రిపోర్ట్‌)

జేఎల్‌ఆర్‌తో రానున్న ఐదేళ్లకుగాను  రూ.8,300 కోట్ల( 1 బిలియన్‌ డాలర్ల) కొత్త భాగస్వామ్య డీల్ జరిగినట్లు టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కొత్త భవిష్యత్-సిద్ధమైన, వ్యూహాత్మక సాంకేతిక నిర్మాణాన్ని రూపొందించే క్రమంలోఈ డీల్‌   'రీఇమాజిన్' వ్యూహానికి మద్దతు ఇస్తుందని పేర్కొంది. (క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!)

టీసీఎస్‌ సేవల్లో అప్లికేషన్ డెవలప్‌మెంట్ అండ్‌ మెయింటెనెన్స్, ఎంటర్‌ప్రైజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, క్లౌడ్ మైగ్రేషన్, సైబర్ సెక్యూరిటీ  అండ్‌  డేటా సర్వీసెస్  లాంటివి ఉన్నాయి. ఈ డీల్‌పై ఇదరు సంస్థలు సంతోషాన్ని ప్రకటించాయి.  అనిశ్చిత డిమాండ్ వాతావరణం, కొత్త ప్రాజెక్టులు,  ఒప్పందాలు  లేక ఐటీ మేజర్‌లు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో  టీసీఎస్‌  ఐరోపాలో ఈ క్యాలెండర్ సంవత్సరంలో గెలిచిన ఆరవ ప్రధాన ఒప్పందం కావడం విశేషం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement