బ్రైబ్స్ ఫర్ జాబ్స్ స్కామ్ ఆరోపణలు, మరో వైపు ఆన్‌బోర్డింగ్ ఆలస్యం వంటి అంశాలతో ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ చర్చాంశనీయంగా మారింది.
ఐటీ రంగంలో కోవిడ్-19, ఆర్ధిక మాంద్యంతో ఐటీ రంగంలో గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. స్టార్టప్స్ నుంచి దిగ్గజ కంపెనీలు సైతం ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. జాయినింగ్ లెటర్స్ జారీలో జాప్యం చేస్తున్నాయి. ఒక వేళ ఆఫర్ లెటర్లు ఇచ్చినా కంపెనీ ప్రాజెక్ట్‌లలో పని చేయించుకోవడం లేదని తెలుస్తోంది.
తాజాగా దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ లేటరల్ హైరింగ్ పేరుతో 200 మందిని నియమించుకుంది. జాయినింగ్ లెటర్ల ఇచ్చి.. సంస్థలోకి ఆహ్వానించింది. ఇప్పుడు ఆ ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
పలు నివేదికల ప్రకారం..టీసీఎస్ లేటరల్ హైరింగ్ పేరుతో నియమించుకున్న ఉద్యోగుల్ని 3 నెలల పాటు ప్రాజెక్ట్‌లలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. అందుకు కొత్త ప్రాజెక్ట్‌లు లేకపోవడం, ఆర్ధిక మాంద్యం ముందస్తు భయాలు, ఆర్ధిక అనిశ్చితిలేనని ప్రధాన కారణం. ఈ నిర్ణయంతో బెంగళూరు, పూణే, కొచ్చి, ఢిల్లీ ఎన్‌సీఆర్, భువనేశ్వర్, ఇండోర్‌కు చెందిన ఉద్యోగలపై ప్రతికూల ప్రభావం పడనుంది. వీరందరూ 1.8 ఏళ్ల నుంచి 15 ఏళ్ల అనుభవం ఉన్న వారేనని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
ఇక జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో నియమించుకున్న వారందరికీ 2,3 సార్లు జాయినింగ్ డేట్స్ ఇచ్చింది. అయినప్పటికీ ఆ తేదీలను పోస్ట్ పోన్ చేసింది. ఇటీవల ఆ అభ్యర్ధులకు మెయిల్స్ పెట్టింది. ఆక్టోబర్ నెలవరకు జాయింనింగ్ తేదీలను ఖరారు చేయలేమని ఆ మెయిల్స్‌లో స్పష్టం చేసినట్లు ఈ అంశంతో సంబంధం ఉన్న వ్యక్తం చెప్పారు. కాగా, దీనిపై టీసీఎస్ ప్రతినిధులు అధికారక ప్రకటన చేయలేదు.
చదవండి👉 రూ.100కోట్ల జాబ్స్ స్కామ్.. టీసీఎస్‌లో మరో కీలక పరిణామం!
Comments
Please login to add a commentAdd a comment