ఐటీ దిగ్గజం టీసీఎస్‌లో పెద్ద కుంభకోణం జరిగిందని ఆంగ్ల పత్రికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దీనిపై స్పందించింది. తమ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని స్పష్టం చేసింది. తమ నుంచి కీలక వ్యక్తులు ఎవరూ ఇందులో లేరని తెలిపింది.
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగాల కుంభకోణంపై స్పందించింది. సంస్థలోని కీలక ఉద్యోగులు రూ.100 కోట్ల కమిషన్లను వసూలు చేశారనే ఆరోపణలపై స్పష్టత ఇచ్చింది. ఇందులో తమ ఉద్యోగుల పాత్ర ఏదీ లేదని వివరించింది. శుక్రవారం పలు మీడియాల్లో వచ్చిన వార్తలు సత్యదూరమైనవని తెలిపింది. ఈ మేరకు టీసీఎస్ కీలక ప్రకటన జారీ చేసింది. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?)
రిక్రూట్‌మెంట్ స్కాంపై అందిన ఫిర్యాదు మేరకు అంశాన్ని పరిశీలించామని అయితే తమ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎలాంటి మోసం జరగలేదని తేలిందని వెల్లడించింది. ఇందులో తమ ఉద్యోగుల పాత్ర లేని తెలిపింది. అంతేకాదు టీసీఎస్ నియామకాల్లోరిక్రూట్‌మెంట్ విభాగం పాత్ర ఉండదని వివరించింది. ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించి అందుబాటులో ఉన్న వనరులను ఉద్యోగులకు చూసుకునే బాధ్యత మాత్రమే ఆర్‌ఎంజీ అని చెప్పింది. ఇప్పుడు వచ్చిన వార్తలన్నీ సంస్థ ప్రధాన నియామక బృందానికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని వివరించింది. (అపుడు తప్పింది..ఇపుడు మింగేసింది: పాకిస్తాన్ టైకూన్ విషాద గాథ)
Comments
Please login to add a commentAdd a comment