ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో.. ఈ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న వారికే దిగ్గజ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి సుముఖత చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది ఏఐలో శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద టెక్ కంపెనీ 'టీసీఎస్' లక్షల మంది ఉద్యోగులకు ఏఐలో ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టీసీఎస్ దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇప్పించినట్లు తాజాగా వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీలో ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చిన కంపెనీల జాబితాలో టీసీఎస్ ముందు వరుసలో నిలిచింది.
టీసీఎస్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో 1.5 లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. ఆ తరువాత కూడా ఇంకొంతమందికి ట్రైనింగ్ ఇచ్చింది. మొత్తం మీద కంపెనీ ఇప్పటి వరకు ఏకంగా 3.5 లక్షల మందికి ఏఐ విభాగంలో ప్రాథమిక నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది.
ఏఐలో శిక్షణ పొందిన వారిలో.. సగం కంటే ఎక్కువ మంది కంపెనీకి చెందిన వారు ఈ టెక్నాలజీలో నైపుణ్యం సాధించినట్లు టీసీఎస్ పేర్కొంది. క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కస్టమర్ అవసరాలకు దృష్టిలో ఉంచుకుని ఆయా విభాగాలలోని ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసిన ఘనత కూడా టీసీఎస్ సొంతం కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో కంపెనీ మరింత మంది ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment